న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: చూసారా.. మా కొత్త సిక్స్‌ హిట్టింగ్‌ మెషీన్‌! ఇది ట్రైలర్‌ మాత్రమే: పంజాబ్ కింగ్స్‌

IPL 2021: Punjab Kings player Shahrukh Khan smashes sixes only in practice session

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) 2021లో అరంగేట్రం చేయబోతున్న పంజాబ్ కింగ్స్‌ యువ బ్యాట్స్​మన్ షారుక్​ ఖాన్ నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో అదరగొట్టాలని ఉవ్విళూరుతున్న ఈ చెన్నై కుర్రాడు.. అందుకు తగ్గట్టుగానే నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. ఫోర్లు బాదడం కన్నా సిక్సర్లపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నాడు షారుక్. పేసర్‌, స్పిన్నర్‌ అన్న తేడా లేకుండా మైదానం నలుమూలలా భారీ సిక్సర్లు బాదుతున్నాడు. బంతిని స్టాండ్స్‌ దాటించడమే లక్ష్యంగా అతడు ఆడుతున్నాడు.

ఇది ట్రైలర్‌ మాత్రమే:

తాజాగా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో షారుక్‌ ఖాన్ మైదానం నలువైపులా భారీ షాట్లు ఆడుతున్న వీడియోను పంజాబ్‌ కింగ్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌ చేసింది. అంతేకాదు ఆ వీడియోకు మంచి క్యాప్షన్‌ జోడించింది. 'షారుక్‌.. మా కొత్త సిక్స్‌ హిట్టింగ్‌ మెషీన్‌. ఫోర్‌ కొట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపించడు' అని రాసుకొచ్చింది. ఐపీఎల్‌ 2021 సీజన్‌ ఆరంభానికి ముందు ఇది ట్రైలర్‌ మాత్రమే అన్నట్లు షార్ట్‌ వీడియో క్లిప్‌ను పంజాబ్‌ షేర్‌ చేసింది. మొత్తానికి పంజాబ్‌ ప్రాంచైజీ తమ ఫ్యాన్స్‌లో ఇలా ఉత్తేజం నింపింది.

సునాయాసంగా సిక్సర్లు బాదగల సామర్ధ్యం:

సునాయాసంగా సిక్సర్లు బాదగల సామర్ధ్యం:

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో షారుక్ ఖాన్​​ను పంజాబ్ కింగ్స్ జట్టు​ రూ.5.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో ఈ సీజన్‌లో అతనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల పంజాబ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే.. షారుక్‌పై చేసిన వ్యాఖ్యల బట్టి చూస్తే అతనిపై ప్రాంచైజీకి ఏమేరకు అంచనాలున్నాయో స్పష్టమవుతుంది. 25 ఏళ్ల షారుక్‌ దేశవాళీ క్రికెట్‌లో పెద్ద స్కోర్లేమీ చేయకపోయినప్పటికీ.. సునాయాసంగా సిక్సర్లు బాదగల సామర్ధ్యం ఉన్న కారణంగా పంజాబ్‌ అతన్ని కొనుగోలు చేసింది.

ఏమాత్రం నిరాశ చెందకుండా:

ఏమాత్రం నిరాశ చెందకుండా:

షారుఖ్ ఖాన్‌కు ఇదే మొదటి ఐపీఎల్ సీజన్. ఐపీఎల్ 2020 వేలంలో అతనికి నిరాశే ఎదురైంది. ఏ ప్రాంచైజీ అతడిని కొనుగోలు చేయలేదు. దానికి ఏమాత్రం నిరాశ చెందని ఈ తమిళనాడు క్రికెటర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇరగదీశాడు. సెమీఫైనల్లో 19 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అంతేకాదు తమిళనాడు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తనదైన బ్యాటింగ్‌తో ఆకట్టుకొని ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టాడు. కనీస ధర రూ. 20లక్షలు ఉంటే.. ఏకంగా రూ. 5 కోట్ల 25 లక్షలకు ఇతర ప్రాంచైజీలతో పోటీపడి మరీ పంజాబ్ కొనుగోలు చేసింది. మరి ఇప్పుడు ఎలా ఆడతాడో చూడాలి.

 పటిష్ట బ్యాటింగ్‌‌‌‌ లైనప్:

పటిష్ట బ్యాటింగ్‌‌‌‌ లైనప్:

ప్రస్తుతం పంజాబ్ జట్టును చూస్తే తిరుగులేదనిపిస్తుంది. బ్యాటింగ్‌‌‌‌లో కేఎల్ రాహుల్‌‌‌‌, క్రిస్‌‌‌‌ గేల్‌‌‌‌, డేవిడ్‌‌ మలాన్.. ధనాధన్‌‌‌‌ క్రికెట్ ఆడగలరు. వీళ్లలో ఏ ఇద్దరు కుదురుకున్నా.. పరుగుల వరద పారాల్సిందే. నికోలస్‌‌‌‌ పూరన్‌‌‌‌, మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌తో టాపార్డర్‌‌‌‌ మరింత బలంగా కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్, మన్‌దీప్‌ల రూపంలో ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఇక బౌలింగ్‌‌‌‌లో మొహ్మద్ షమీ,‌ జై రిచర్డ్సన్‌, రిలే మెరిడిత్‌ కీలకం కానున్నారు. ఇషాన్ పొరెల్, జలజ్‌ సక్సేనా, సౌరభ్‌ కుమార్, ఉత్కర్ష్‌ సింగ్‌‌లపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. టాప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ విన్నర్లు ఉన్నారు కాబట్టి పంజాబ్ ప్లే ఆఫ్‌‌‌‌కు వెళ్లే చాన్స్‌‌‌‌ ఉంది.

ఆస్పత్రి నుంచి సచిన్ టెండూల్కర్‌‌ డిశ్చార్జ్‌.. కానీ!!

Story first published: Thursday, April 8, 2021, 20:56 [IST]
Other articles published on Apr 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X