Sunrisers Hyderabad: చెలరేగిన ప్రియం గార్గ్, సాహా.. మరోసారి చిత్తయిన బెయిర్‌స్టో సేన!

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021కి సమయం దగ్గరపడింది. శుక్రవారం క్యాచ్ రిచ్ లీగ్ ఆరంభం కానుంది. 11న సన్‌రైజర్స్‌ హైదరాబాద్..‌ తన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు. సాధనలో భాగంగా సన్‌రైజర్స్‌ టీమ్‌ రెండుగా విడిపోయి మరోసారి ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌​ ఆడింది. ఒక జట్టుకు మనీష్ పాండే సారథ్యం వహించగా.. మరో టీమ్‌కు జానీ బెయిర్‌స్టో కెప్టెన్‌గా ఉన్నాడు.

గురువారం జరిగిన రెండో ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన జానీ బెయిర్‌స్టో సేన 159 పరుగులు చేసింది. కెప్టెన్ బెయిర్‌స్టో 42 బంతుల్లో 69 పరుగులు చేశాడు. మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మనీష్ పాండే జట్టు బౌలర్లు ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సుచిత్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ప్రియం గార్గ్, వృద్ధిమాన్ సాహా చెలరేగడంతో మనీష్ సేన సునాయాస విజయాన్ని అందుకుంది. గార్గ్ 42 బంతుల్లో 69 పరుగులు చేయగా.. సాహా 30 బంతుల్లో 43 రన్స్ చేశాడు. ఇంట్రాస్క్వాడ్‌ ప్రాక్టీస్ మ్యాచులో బెయిర్‌స్టో సేన ఓడడం ఇది రెండోసారి.

బుధవారం జరిగిన తొలి ఇంట్రాస్క్వాడ్‌ ప్రాక్టీస్ మ్యాచులో కూడా మనీష్ జట్టు గెలిచిన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన మనీష్ సేన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (50 బంతుల్లో 95 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో రెచ్చిపోగా.. సాహా (30 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లు సిద్దార్థ్ కౌల్ 2 వికెట్లు పడగొట్టాడు. 170 పరుగుల లక్ష్య ఛేదనలో బెయిర్‌స్టో సేన 138 పరుగులకే ఆలౌట్ అయింది. మొహ్మద్ నబీ (33 బంతుల్లో 39; 5 ఫోర్లు, 3 సిక్సులు), బెయిర్‌స్టో (34 బంతుల్లో 48; 2 ఫోర్లు, 2 సిక్సులు) మాత్రమే రాణించారు.

ఐపీఎల్ 2021 మ్యాచులకు ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. మన తెలుగు జట్టు అయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో ఆడే అవకాశం లేదు. ఈసారి ఏ జట్టుకూ సొంతగడ్డపై ఆడే అవకాశం లేదన్న విషయం తెలిసిందే. టైటిల్ ఫేవరేట్స్‌లో సన్‌రైజర్స్ కూడా ఒకటి. తుది జట్టులో నలుగురు ఫారినర్లు మాత్రమే ఉండాలనే రూల్‌కు అనుగుణంగా సరైన కాంబినేషన్ ఎంచుకోవడంపై సన్‌రైజర్స్ జర్నీ ఆధారపడి ఉంది. ఫైనల్ ఎలెవన్ కుదిరి మంచి స్టార్ట్ దొరికితే ప్రత్యర్థికి తిప్పలు తప్పవు. ఈజీగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్:

బ్యాట్స్‌మెన్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), కేన్ విలియమ్సన్, జేసన్ రాయ్, మనీష్ పాండే, ప్రియం గార్గ్, విరాట్ సింగ్, జానీ బెయిర్‌స్టో.

కీపర్స్: వృద్ధిమాన్‌ సాహా, శ్రీవత్స గోస్వామి, జానీ బెయిర్‌స్టో.

ఆల్‌రౌండర్స్: కేదార్‌ జాదవ్‌, విజయ్‌ శంకర్‌, అబ్దుల్‌ సమద్‌, అభిషేక్‌శర్మ, రషీద్‌ఖాన్‌, మహ్మద్‌ నబి, జేసన్‌ హోల్డర్. ‌

బౌలర్స్: భువనేశ్వర్‌కుమార్‌, నటరాజన్‌, షాబాజ్‌ నదీమ్‌, ఖలీల్‌ అహ్మద్‌, బాసిల్‌ థంపి, సిద్ధార్థ్‌ కౌల్‌, జగదీశ సుచిత్‌, ముజిబుర్‌ రహమాన్. ‌

IPL 2021: ధోనీ అభిమానులకు శుభవార్త.. మహీకి ఇదే చివరి ఐపీఎల్ కాదు!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, April 8, 2021, 19:34 [IST]
Other articles published on Apr 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X