IPL 2021: 'సురేష్ రైనా లానే.. కోల్‌తాకు హ‌ర్భ‌జ‌న్ సింగ్ కీలకంగా మారనున్నాడు'

IPL 2021 : Harbhajan Singh's Experience Will Definetly Help To KKR - Pragyan Ojha || Oneindia Telugu

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021‌లో కోల్‌తా నైట్ రైడర్స్ (కేకేఆర్)‌కు టీమిండియా వెటరన్‌ ఆఫ్ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కీలకంగా మారనున్నాడని భారత మాజీ బౌలర్‌ ప్రగ్యాన్‌ ఓజా జోస్యం చెప్పాడు. టీమిండియా తరపున హర్భజన్‌ ఎన్నో మ్యాచ్‌లు ఆడాడని, ఆ అనుభవం ఈ ఐపీఎల్‌లో ఎంతో ఉపయోగపడుతుందన్నాడు. ఐపీఎల్ 2021 ఏప్రిల్ ‌9న ప్రారంభమయి మే 30తో ముగుస్తుంది. కేకేఆర్‌ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 11న చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)‌తో తలపడనుంది.

కేకేఆర్‌కు కీలకంగా మారుతాడు

కేకేఆర్‌కు కీలకంగా మారుతాడు

ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగ్యాన్‌ ఓజా మాట్లాడుతూ...'హర్భజన్‌ సింగ్‌కు చాలా అనుభవం ఉంది. టీమిండియా తరపున హర్భజన్‌ ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున కూడా ఆడాడు. రెండు జట్లూ టైటిల్ గెలుచుకున్నాయి. అతని అనుభవం ఈ ఐపీఎల్‌లో ఎంతో ఉపయోగపడుతుంది. భజ్జీ తుది జట్టులో ఉంటే మాత్రం కేకేఆర్‌కు కీలకంగా మారుతాడు' అని అన్నాడు.

రైనా లానే.. కోల్‌తాకు హ‌ర్భ‌జ‌న్

రైనా లానే.. కోల్‌తాకు హ‌ర్భ‌జ‌న్

'కరోనా వైరస్ దృష్యా ఏ జట్టుకు సొంత మైదానంలో ఆడే వెసులబాటు లేదు. ఇది కేకేఆర్‌కు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ఎందుకంటే కోల్‌కతాలో హర్భజన్‌ సింగ్‌ గణాంకాలు గొప్పగా ఉన్నాయి. అక్కడ ఆడిన ప్రతిసారీ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ ఏడాది కేకేఆర్‌కు అక్కడ ఆడే అవకాశం లేదు. అనుభవం గురించి మాట్లాడితే.. భజ్జీ కంటే గొప్పవారు ఎవ్వరూ లేరని నా అభిప్రాయం. సీఎస్‌కేకు సురేష్ రైనా అనుభవం ఎలా ఉపయోగపడుతుందో.. కేకేఆర్‌కు హర్భజన్‌ అలా అవసరమవుతాడు. ఇప్పటికే ప్రాక్టీస్‌లో తలమునకలవడంతో మళ్లీ మెరుపులు మెరిపించేందుకు అతడు సిద్ధమవుతున్నాడు' అని ప్రగ్యాన్‌ ఓజా చెప్పుకొచ్చాడు.

గత సీజన్‌కు దూరం

గత సీజన్‌కు దూరం

హర్భజన్‌ సింగ్ వ్యక్తిగత కారణాల రిత్యా గత సీజన్‌కు దూరంగా ఉన్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో కుటుంబ భద్రత గురించి ఆలోచించే యూఏఈలో ఐపీఎల్ ఆడలేదని భజ్జీ ఇటీవలే తెలిపాడు. అయితే ఫిబ్రవరిలో జరిగిన వేలంలో హర్భజన్‌ను కేకేఆర్‌ రూ. 2 కోట్ల కనీస మద్దతు ధరకే సొంతం చేసుకుంది. ఇటీవలే ఏడు రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న హర్భజన్..‌ జట్టుతో చేరి ప్రాక్టీస్‌ ఆరంభించాడు. గత మూడేళ్లుగా చెన్నై‌లో కొనసాగిన భజ్జీని.. జనవరిలో ఆ జట్టు వదిలేసిన సంగతి తెలిసిందే. చివరిసారి 2019 ఐపీఎల్‌ ఫైనల్లో ఆడిన హర్భజన్..‌ అప్పటి నుంచీ ఒక్క మ్యాచ్‌ కూడా‌ ఆడలేదు.

160 మ్యాచ్‌లు.. 150 వికెట్లు

160 మ్యాచ్‌లు.. 150 వికెట్లు

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 160 మ్యాచ్‌లాడిన హర్భజన్ సింగ్‌ మొత్తం 150 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. 2018 నుంచీ చెన్నై తరఫున ఆడుతున్న భజ్జీ.. 2019 సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఆ జట్టు ఫైనల్‌ చేరడంలో తనవంతు పాత్ర పోషించాడు. అయితే వ్యక్తిగత కారణాలతో గతేడాది యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో హర్భజన్‌ ఆడలేదు. ఈ నేపథ్యంలోనే జనవరిలో చెన్నై అతడిని వదిలేసుకుంది. దాంతో కోల్‌కతా కొనుగోలు చేసింది.

IPL 2021: అనుష్క శర్మ 'సూపరో' సూపర్‌.. విరాట్ కోహ్లీని ఎత్తుకుని (వీడియో)!!

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, April 7, 2021, 15:24 [IST]
Other articles published on Apr 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X