న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంజాబ్ కింగ్స్‌కు గట్టి షాక్.. లీగ్ నుంచి కేఎల్ రాహుల్‌ ఔట్!

KL Rahul diagnosed with acute appendicitis, to undergo surgery

అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో పంజాబ్ కింగ్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్దాంతరంగా ఈ క్యాష్ రిచ్ లీగ్‌ నుంచి దూరమయ్యాడు. గత రాత్రి తీవ్ర కడుపునొప్పితో బాధపడిన కేఎల్ రాహుల్‌‌ను టీమ్ ఫిజియో పరిశీలించగా.. అపెండిసైటిస్‌ అని తేలింది. దాంతో కేఎల్ రాహుల్‌కు సర్జరీ అనివార్యమవ్వడంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

'గత రాత్రి కేఎల్ రాహుల్ తీవ్ర కడుపునొప్పితో బాధపడ్డాడు. వెంటనే టీమ్ ఫిజియో ప్రాథమిక చికిత్స అందించగా అతను కోలుకోలేదు. దాంతో అతన్ని అత్యవసర రూమ్‌కు తరలించి పలు పరీక్షలు చేశారు. రాహుల్ అపెండిసైటిస్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. సర్జరీ అనివార్యమైన నేపథ్యంలో వెంటనే అత్యంత భద్రతా మధ్య అతన్ని ఆసుపత్రికి తరలించారు.'అని పేర్కొంది.

అయితే లీగ్‌కు దూరమవుతాడా? లేక కొన్ని మ్యాచ్‌లకేనా? అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం ఫ్రాంచైజీ చెబుతున్న ప్రకారం రాహుల్ ఆసుపత్రిలో చేరాడు. ఈ లెక్కన అతను టీమ్ బయో బబుల్ దాటినట్లే. అతను తిరిగొచ్చినా నిబంధనల ప్రకారం మరో వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. అంతేకాకుండా అతనికి సర్జరీ అనివార్యం. అక్యుట్ అపెండైసెటీస్ ఉంటే 24 గంటల్లో సర్జరీ చేయాలి. కోలుకోవడానికి కనీసం 2-3 వారాల విశ్రాంతి అవసరం. ఈ క్రమంలో రాహుల్ దాదాపు ఈ సీజన్‌కు దూరమైనట్లేనని విశ్లేషకుల అభిప్రాయం.

331 పరుగులతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్న రాహుల్.. ఆర్‌సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో(92 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఏడు మ్యాచ్‌ల్లో ఇప్పటికే నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే ఈ ఏడు మ్యాచ్‌ల్లో పంజాబ్ మాత్రం మూడే గెలిచి పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో ఉంది. నేడు జరిగే తమ తదుపరి మ్యాచ్‌ను నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. రాహుల్ గైర్హాజరీ పంజాబ్‌కు గట్టి ఎదురుదెబ్బ.

Story first published: Sunday, May 2, 2021, 18:50 [IST]
Other articles published on May 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X