న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ అండ్ టీమ్‌పై అదరగొట్టే ట్రాక్ రికార్డ్: వార్నర్ బెస్ట్ స్కోర్ ఇదే

IPL 2021, MI vs SRH: David Warner 488 runs against the Rohit team

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో తొమ్మిదో మ్యాచ్ ఈ సాయంత్రం ఆరంభం కాబోతోంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. డేవిడ్ వార్నర్ కేప్టెన్సీని వహిస్తోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఢీ కొనబోతున్నాయి. ఈ సాయంత్రం 7:30 గంటలకు చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ రెండు జట్లకూ ఈ సీజన్‌లో ఇది మూడో మ్యాచ్. ఓటమితో సీజన్ ఆరంభించిన ముంబై ఇండియన్స్.. ఆ తరువాతి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించింది. విజయాన్ని అందుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన రెండింట్లోనూ ఓటమిని మూటగట్టుకుంది.

IPL 2021: టఫ్ ఫైట్: ఎదురుగా ఉన్నది ఏనుగు..సన్‌రైజర్స్ పరిస్థితేంటీ? ప్రిడిక్షన్స్ ఇవీIPL 2021: టఫ్ ఫైట్: ఎదురుగా ఉన్నది ఏనుగు..సన్‌రైజర్స్ పరిస్థితేంటీ? ప్రిడిక్షన్స్ ఇవీ

వ్యక్తిగతంగా డేవిడ్ వార్నర్‌కు ముంబై ఇండియన్స్‌పై అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ముంబై ఇండియన్స్ అంటే ఓ రేంజ్‌లో విజృంభిస్తాడతను. ముంబై ఇండియన్స్‌పై వ్యక్తిగతంగా 488 పరుగులు చేశాడు వార్నర్. ముంబైపై అతని బెస్ట్ స్కోర్ 10 పరుగులు తక్కువ సెంచరీ. 90 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. యావరేజ్ స్ట్రైక్ రేట్ 61. అంటే.. ముంబై ఇండియన్స్‌పై ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ సగటున 60 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2020లోనూ అదే దూకుడు కొనసాగించాడు డేవిడ్ వార్నర్. రెండు మ్యాచుల్లో 60, 85 పరుగులు సాధించాడు. 85 నాటౌట్.

ఇక ఈ సాయంత్రం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రోహిత్ అండ్ టీమ్‌పై మరోసారి అలాంటి అద్భుత ప్రదర్శన చేయాలనే కోరుకుంటోంది సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్. రాయల్ ఛాలెంజర్స్‌పై ఆడిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ సాధించాడు. 37 బంతుల్లో ఒక సిక్సర్, ఏడు ఫోర్లతో 54 పరుగులు చేశాడతను. కోల్‌కత నైట్ రైడర్స్‌పై రాణించలేకపోయాడు. మూడు పరుగులకే అవుట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్‌పై మంచి ట్రాక్ రికార్డ్ ఉండటంతో అతని బ్యాటింగ్ మళ్లీ గాడినపడుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది.

ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా ఈ రెండు జట్లు 16 సార్లు తలపడ్డాయి. చెరో ఎనిమిది మ్యాచుల్లో విజయం సాధించాయి. తటస్థ వేదికపై మాత్రం సన్‌రైజర్స్‌దే అప్పర్ హ్యాండ్. తటస్థ వేదికల్లో నాలుగు సార్లు ఈ రెండు జట్లు ఎదురుపడగా.. మూడింట్లో గెలుపు హైదరాబాద్‌దే. ఈ పరిస్థితుల్లో ఈ సాయంత్రం జరిగే 17వ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తి రేపుతోంది. రెండు వరుస పరాజయాలు పలకరించడంతో డీలా పడ్డ డేవిడ్ వార్నర్ అండ్ టీమ్.. ఎలా పుంజుకుంటుందనేది ఉత్కంఠతగా మారింది. ఈ మ్యాచ్ ఓడితే.. ఇక ముందు సాగడం కష్టతరమౌతుంది.

Story first published: Saturday, April 17, 2021, 13:22 [IST]
Other articles published on Apr 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X