న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చాహర్ పిలక హెయిర్ స్టైల్‌కు రీజన్ దొరికింది: జుట్టు గుట్టు బట్టబయలు: గర్ల్‌ఫ్రెండ్ ప్రయోగం

IPL 2021, MI vs DC: Rahul Chahar Gives a Glimpse of His girl friend and Hairstylist Ishani

ముంబై: రాహుల్ చాహర్.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ తురుఫుముక్క. తన స్పిన్ మాయాజాలంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ముప్పతిప్పలు పెడుతుంటాడు. ఇదివరకటి సీజన్లతో పోల్చుకుంటే.. ఈ సారి ప్రారంభం నుంచే చెలరేగిపోతున్నాడు. ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఒకదాంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడతను. ఈ మూడు మ్యాచ్‌లల్లో ఏడు వికెట్లను పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ రేస్‌లో ఉన్నాడు. రాహుల్ చాహర్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 4/27. సీజన్ సీజన్‌కు రాటుదేలుతున్నాడు.

వెస్టిండియన్లను తలపించే హెయిర్ కట్ అతనిది. అతనిది కర్లింగ్ హెయిర్ స్టైల్‌. రింగుల జుట్టును బలంగా వెనక్కి దువ్వినట్టు ఉంటుంది. చివర్లో చిన్నపిలకను ముడేసి ఉంటాడు. మిగిలిన ఇండియన్ క్రికెటర్లతో పోల్చుకుంటే.. రాహుల్ చాహర్ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంటుంది. దానికి కారణం ఏమిటనేది ఇప్పటిదాకా పెద్దగా బయటికి రాలేదు. అతని జుట్టు గుట్టు తాజాగా వెలుగు చూసింది. అతని డిఫరెంట్ హెయిర్ స్టైల్‌కు కారణం.. అతని గర్ల్‌ఫ్రెండే. రాహుల్ చాహర్‌కు 2019లో నిశ్చితార్థమైంది. టాప్ హెయిర్ స్టైలిస్ట్ ఇషానీని అతను పెళ్లి చేసుకోబోతున్నాడు.

వారిద్దరిదీ పెద్దలు కుదర్చిన ప్రేమ వివాహం. చాలాకాలం పాటు రాహుల్ చాహర్-ఇషానీ ప్రేమపక్షుల్లా తిరిగారు. ప్రేమలోకంలో విహరించారు. 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లికి ముహూర్తం మాత్రం ఇంకా రాలేదు. పెళ్లి పీటలు ఎక్కడానికి ఇంకా సమయం ఉందనేది రాహుల్ చాహర్ కుటుంబీకుల మాట. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత వారిద్దరూ ఒక్కటి కావచ్చని అంటున్నారు. తాజాగా తన ఇషానీతో కలిసి దిగిన ఓ ఫొటోను రాహుల్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్.. ఈ సాయంత్రం ఢిల్లీ కేపిటల్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్ సాయత్రం 7:30 గంటలకు చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభం కానుంది. స్పిన్ విభాగంలో కీలకంగా మారడం, ఫుల్ ఫామ్‌లో ఉండటం వల్ల తుది జట్టులో అతనికి చోటు దక్కడం ఖాయమే. తన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగిస్తాడా? లేదా? తేలిపోతుంది.

Story first published: Tuesday, April 20, 2021, 14:03 [IST]
Other articles published on Apr 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X