న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs CSK:హై వోల్టేజ్ మ్యాచ్.. ముంబై, చెన్నై మధ్య బిగ్ ఫైట్!ఇషాన్‌కు మళ్లీ నిరాశే!తుది జట్లు, రికార్డులు ఇవే!

IPL 2021: MI vs CSK predicted playing 11, Preview and dream11 tips for match 27

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌లో భాగంగా ఈరోజు హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. శనివారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్‌లాడిన చెన్నై ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొంది దూసుకుపోతుండగా.. అన్నే మ్యాచ్‌లాడిన ముంబై మూడింట్లో మాత్రమే విజయం సాధించి వెనుకంజలో ఉంది. చెన్నై తన చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ని ఓడించగా.. రాజస్థాన్‌పై ముంబై జయకేతనం ఎగురవేసింది. మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల బలాలు ఓసారి చూద్దాం.

రష్మిక మందన్నా ఫెవరెట్‌ ఐపీఎల్ టీమ్‌ అదే.. ఫాన్స్ ఫుల్ ఖుషీ! అది తప్పా ఇంకేదైనా అడగండి అంటూ షాక్!రష్మిక మందన్నా ఫెవరెట్‌ ఐపీఎల్ టీమ్‌ అదే.. ఫాన్స్ ఫుల్ ఖుషీ! అది తప్పా ఇంకేదైనా అడగండి అంటూ షాక్!

 బెస్ట్ ఫామ్‌లో ఓపెనర్లు:

బెస్ట్ ఫామ్‌లో ఓపెనర్లు:

బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్టంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయంపై కన్నేసింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్‌ గైక్వాడ్‌ దంచి కొడుతున్నారు. పవర్‌ప్లేలోనే దూకుడుగా ఆడుతూ.. చెన్నై భారీ స్కోరుకి బాటలు వేస్తున్నారు. స్టార్ ఆల్‌రౌండర్‌ మొయిన్ అలీ ఉన్నంతసేపు పరుగుల వరద పారిస్తున్నాడు. మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ఫామ్ అందుకున్నాడు. అయితే అంబటి రాయుడు ధాటిగా ఆడుతున్నా.. భారీ స్కోర్లు చేయడం లేదు. ఇక కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఓ మంచి ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. రవీంద్ర జడేజా, సామ్ కరన్ హిట్టింగ్‌తో చెలరేగిపోతున్నారు. శార్దూల్ ఠాకూర్ కూడా బ్యాటింగ్ చేయగలడు. మొత్తానికి చెన్నైకి లోతైన బ్యాటింగ్ లైనప్ ఉంది.

స్వింగ్ కింగ్ చహర్ రెచ్చిపోతే:

స్వింగ్ కింగ్ చహర్ రెచ్చిపోతే:

బౌలింగ్ విభాగంను స్వింగ్ కింగ్ దీపక్ చహర్, సామ్ కరన్ మోస్తున్నారు. పవర్‌ప్లేలో తమ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులని ఒత్తిడిలోకి నెట్టి వికెట్లు పడగొడుతున్నారు. ముఖ్యంగా చహర్ తన స్వింగ్, స్లో డెలివరీలతో రెచ్చిపోతున్నాడు. ఢిల్లీలో అతడికి మెరుగైన గణాంకాలు ఉన్నాయి. ఇక ఐపీఎల్ 2021లో 0/36(4), 4/13(4), 0/32(3), 4/29(4), 0/25(2), 0/21(3) అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ రోజు కూడా అతడు రెచ్చిపోతే ముంబైకి తిప్పలు తప్పవు. మిడిల్ ఓవర్లలో మొయిన్ అలీ, రవీంద్ర జడేజా పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నారు. ఇక స్లాగ్ ఓవర్లలో లుంగి ఎంగిడి, శార్ధూల్ ఠాకూర్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేస్తున్నారు.

ముంబై టీంలో కెప్టెన్ రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తున్నా.. అతని స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేదు. మరో ఓపెనర్ డికాక్ గత మ్యాచ్ ద్వారా ఫామ్ అందుకోవడం గొప్ప ఊరట. రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగులు చేసిన డికాక్.. ఒంటిచేత్తో ముంబైకి విజయాన్ని అందించాడు. సూర్యకుమార్ యాదవ్ బాగానే ఆడుతున్నా.. భారీ స్కోర్లు చెయ్యట్లేదు. ఇక ఇషాన్ కిషన్ ఈ మ్యాచుకు దూరం కానున్నాడు. హార్దిక్ పాండ్యా మెరుపులు ఒకటి రెండు ఓవర్లకే పరిమితమవుతున్నాయి. కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యాలు ఫినిషర్ రోల్‌ని పోషిస్తున్నారు.

బౌలింగ్‌లో మాత్రం ముంబై పర్వాలేదనిపిస్తోంది. స్టార్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వికెట్లు పడగొట్టకపోయినా.. పరుగులు కట్టడిచేస్తున్నారు. అయితే వికెట్లు పడగొట్టడంతో పోటీపడే ఈ ఇద్దరూ ఈ సీజన్లో తేలిపోయారనే చెప్పాలి. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ ఈ జోడీ మెరిస్తేనే ముంబైకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడో పేసర్ నాథన్ కౌల్టర్ నైల్ అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. అయితే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ రాహుల్ చహర్ వికెట్లు పడగొడుతుండడం కలిసొచ్చే అంశం. అతనికి జోడీగా బౌలింగ్ చేస్తున్న కృనాల్ పాండ్యా ధారాళంగా పరుగులిచ్చేస్తున్నాడు. మరో స్పిన్నర్ జయంత్ యాదవ్ వికెట్లు పడగొట్టలేకపోతున్నాడు.

హెడ్ టు హెడ్ రికార్డ్స్:

హెడ్ టు హెడ్ రికార్డ్స్:

ఐపీఎల్‌లో చెన్నై, ముంబై హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 30 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై 18 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 12 మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించింది. ఈ జట్లు తలపడిన సందర్భాల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. ఐపీఎల్ 2019 సీజన్‌లో నాలుగు సార్లు ఈ రెండు జట్లు తలపడగా.. నాల్గింటిలోనూ ముంబై విజయం సాధించింది. అయితే ఐపీఎల్ 2020 సీజన్‌లో రెండు సార్లు మాత్రమే తలపడగా.. చెరొక మ్యాచ్‌లో గెలుపొందాయి. ఢిల్లీ పిచ్ బ్యాట్స్‌మన్‌కు అనుకూలం. మొదటి రెండు ఆటలలో ఇదే జరిగింది. ఇక బౌండరీ సరిహద్దు కూడా చిన్నదే కావడంతో 180-200 స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. మ్యాచుకు ఎలాంటి వర్ష ముప్పు లేదు.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

ముంబై: రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చహర్, నాథన్ కౌల్టర్-నైల్, జయంత్ యాదవ్.

చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, సామ్ కరన్, లుంగి ఎంగిడి, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్.

Story first published: Saturday, May 1, 2021, 12:03 [IST]
Other articles published on May 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X