న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs RR: రెండో బ్యాట్స్‌మన్‌గా కేఎల్ రాహుల్ అరుదైన ఘనత!!

IPL 2021: KL Rahul Becomes 2nd Fastest Batsman To Score 3000 Runs After Chris Gayle

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత అందుకున్నాడు. ఐపీఎల్‌లో రాహుల్‌ మూడు వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. దుబాయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో రాహుల్ ఈ ఫీట్ అందుకున్నాడు. రాజస్థాన్ పేసర్ చేతన్ సకారియా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ మూడో బంతికి సిక్స్ బాదిన రాహుల్ మూడు వేల పరుగులను పూర్తిచేశాడు. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత వేగంగా మూడు వేల పరుగులలు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా రాహుల్ రికార్డుల్లో నిలిచాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్, కింగ్స్‌ పంజాబ్‌ హిట్టర్ క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు.

KKR vs RCB:ఆ నిర్ణయం జట్టుపై ఎలాంటి ప్రభావం చూపలేదు.. మా ఓటమికి కారణం అదే: ఆర్‌సీబీ కోచ్‌KKR vs RCB:ఆ నిర్ణయం జట్టుపై ఎలాంటి ప్రభావం చూపలేదు.. మా ఓటమికి కారణం అదే: ఆర్‌సీబీ కోచ్‌

రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డు:

రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డు:

ఐపీఎల్‌లో కింగ్స్‌ పంజాబ్‌ ప్లేయర్ క్రిస్ గేల్ 75 ఇన్నింగ్స్‌లలో మూడు వేల పరుగులను పూర్తిచేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ 80 ఇన్నింగ్స్‌లలో మూడు వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఈ జాబితాలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో ఉన్నాడు. వార్నర్ 94 ఇన్నింగ్స్‌లలో 3 వేల పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా 103 ఇన్నింగ్స్‌లలో 3 వేల పరుగులు పూర్తిచేసి నాలుగో స్థానంలో ఉన్నాడు. 2018 నుంచి

రాహుల్‌ పంజాబ్‌ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. పంజాబ్‌ జట్టు తరపునే రాహుల్‌ 2253 పరుగులు చేశాడు.

మయాంక్ అగర్వాల్2K:

మయాంక్ అగర్వాల్2K:

కేఎల్‌ రాహుల్‌ ఇప్పటివరకు ఐపీఎల్‌ టోర్నీలో 88 మ్యాచ్‌ల్లో మూడు వేల పరుగులు చేశాడు. ఇందులో 122 సిక్స్‌లు, 268 ఫోర్లు బాదాడు. ఇందులో 98 సిక్సర్లు పంజాబ్‌ కింగ్స్‌ తరపునే రాహుల్ బాదాడు. మరో రెండు సిక్సర్లు కొడితే.. పంజాబ్‌ కింగ్స్‌ తరపున 100 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మన్‌గా మరో రికార్డు కూడా ఖాతాలో వేసుకోనున్నాడు. అయితే ఈ మ్యాచులో రాహుల్ (49) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. మరోవైపు పంజాబ్‌ కింగ్స్‌ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఐపీఎల్‌ టోర్నీలో రెండు వేల పరుగులు పూర్తిచేశాడు. ప్రస్తుతం పంజాబ్ 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ (67), ఐడెన్ మార్క్రామ్ (2) ఉన్నారు. పంజాబ్ విజయానికి ఇంకా 43 బంతుల్లో 60 రన్స్ అవసరం.

చెలరేగిన ఆర్ష్‌దీప్ సింగ్:

చెలరేగిన ఆర్ష్‌దీప్ సింగ్:

అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లన్నీ కోల్పోయి 185 పరుగులు చేసింది. చివరలో పంజాబ్ పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లతో రాజస్థాన్ జోరుకు కళ్లెం వేశాడు. లేదంటే సంజుసేన 200 పరుగులకు పైగా చేసేదే. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (49; 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు), ఎవిన్ లూయిస్ (36; 21 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) దంచికొట్టగా.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ మహిపాల్ లోమ్రర్ (43; 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) సిక్సుల వర్షం కురిపించాడు. పంజాబ్ బౌలర్లలో ఆర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లు పడగొట్టగా.. మొహ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు.ఇషాన్ పోరెల్, హర్‌ప్రీత్ బ్రార్ చెరో వికెట్ తీసుకున్నారు.

Story first published: Tuesday, September 21, 2021, 23:11 [IST]
Other articles published on Sep 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X