న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs CSK: మ్యాచ్‌కు ముందు.. ధోనీ తన జట్టు సబ్యులకు గుడ్‌లక్‌ చెప్పడు! అసలు కారణం చెప్పిన ఓజా!!

IPL 2021, KKR vs CSK: MS Dhoni never wishes his teammates good luck says Pragyan Ojha

హైదరాబాద్: ఎంఎస్ ధోనీ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. భారత క్రికెట్లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ధోనీ ఒకడు. టీమిండియాకు తిరుగులేని విజయాలు ఎన్నో అందించాడు. టెస్టుల్లో టీమిండియాను అగ్రస్థానంలో నిలపడంతో పాటు.. టీ20 ప్రపంచకప్‌, వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్‌కు అందించాడు. క్రికెట్ చరిత్రలో ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్ ధోనీ మాత్రమే. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కూల్‌గా ఆలోచిస్తూ 'మిస్టర్ కూల్'‌గా పేరొందాడు మహీ. యువకులకు ఆదర్శంగా మారాడు. అయితే ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న మహీకి ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉందట.

గుడ్‌లక్‌ చెబితే

గుడ్‌లక్‌ చెబితే

మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఏ కెప్టెన్‌ అయినా వారి టీమ్‌కు గుడ్‌లక్‌ చెప్పి సూచనలు ఇవ్వడం మామూలే. అయితే చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ మాత్రం మ్యాచ్‌కు ముందు తమ జట్టు ఆటగాళ్లకు ఎలాంటి గుడ్‌లక్‌ చెప్పడట. అలా చెప్పడం ఎప్పటినుంచో మానేశాడట. ఈ విషయాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్‌ ఓజా తెలిపాడు. అయితే మహీ అలా చేయడానికి ఒక కారణం ఉందని ఓజా పేర్కొన్నాడు. తన జట్టులోని ఆటగాళ్లకు గుడ్‌లక్‌ లేదా ఆల్‌ ది బెస్ట్‌ చెబితే.. మ్యాచ్ తర్వాత ఏదో ఒకటి తనకు వ్యతిరేకంగా జరుగుతుందని ధోనీ నమ్ముతాడట.

సెంటిమెంట్స్‌ ఉన్నాయి

సెంటిమెంట్స్‌ ఉన్నాయి

ప్రగ్యాన్‌ ఓజా తాజాగా స్పోర్ట్స్ టుడేతో మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ మ్యాచ్‌కు ముందు తన జట్టులోని ఆటగాళ్లకు గుడ్‌లక్‌ లేదా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పడు. ఒకవేళ చెబితే మ్యాచ్ తర్వాత ఏదో ఒకటి తనకు వ్యతిరేకంగా జరుగుతుందని మహీ నమ్ముతాడు. అందుకే అతను ఆల్‌ ది బెస్ట్‌ చెప్పడం కూడా మానేశాడు. అంతేగాక ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా మ్యాచ్‌కు ముందు ధోనీ దగ్గరకి వెళ్లడానికి ఆలోచిస్తారు. ఓ సందర్భంలో మహీనే ఈ విషయాన్ని చెప్పాడు. తనకు కొన్ని సెంటిమెంట్స్‌ ఉన్నాయని, వాటిని బలంగా నమ్ముతానని.. అందుకే మ్యాచ్‌కు ముందు నా జట్టుకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పనన్నాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కూడా నాకు ఎలాంటి విషెస్‌ చెప్పాలని తాను కోరుకోనని కూడా చెప్పాడు' అని తెలిపాడు.

ఐపీఎల్ టోర్నీలో 4650 రన్స్

ఐపీఎల్ టోర్నీలో 4650 రన్స్

ఎంఎస్ ధోనీ ఐపీఎల్ టోర్నీలో 207 మ్యాచులు ఆడి 4650 రన్స్ చేశాడు. ఇందులో 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక మహీకి ఐపీఎల్ 2021 చివరి సీజ‌న్ కావ‌చ్చ‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే చెన్నై సూప‌ర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వ‌నాథ‌న్ మాత్రం ధోనీకి ఇదే చివ‌రి సీజ‌న్ కాద‌ని తాజాగా అన్నారు. 'మహీకి ఇదే చివ‌రి ఏడాది అని నాకు అనిపించ‌డం లేదు. ఇది నా వ్య‌క్తిగ‌త అభిప్రాయం. మేము ఇప్ప‌టికిప్పుడు మ‌రో ప్లేయ‌ర్ వైపైతే చూడటం లేదు. ఇప్పటివరకు ధోనీ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు' అని చెన్నై సీఈవో స్ప‌ష్టం చేశారు.

గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై

గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై

టీమిండియా‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ గతేడాది ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ధోనీ 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10773 రన్స్‌ చేశాడు. వీటిల్లో 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183‌. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1600 పరుగుల బాదాడు.

PBKS vs SRH: ముందు మ్యాచ్ గెలవండిరా అయ్యా.. ఈ పజిల్స్ తర్వాత ఆడుకుందాం! సన్‌రైజర్స్‌పై ఫాన్స్ ఫైర్!

Story first published: Wednesday, April 21, 2021, 16:12 [IST]
Other articles published on Apr 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X