న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎట్టి పరిస్థితుల్లో కేన్ మామను వదులుకోం.. హైదరాబాద్ అభిమానులకు డేవిడ్ వార్నర్ హామీ

IPL 2021: David Warner says We will not lose Kane Williamson and try our best to retain him
IPL 2021 : David Warner Assures Fans Will Try To Retain Kane Williamson For IPL 2021

హైదరాబాద్: కరోనా సమయంలోనూ.. అందునా విదేశంలో నిర్వహించిన ఐపీఎల్‌ 2020 సీజన్ సూపర్‌ సక్సెస్‌ కావడంతో బీసీసీఐ ఫుల్‌ జోష్‌లో ఉంది. 14వ సీజన్‌ను భారత్‌లో నిర్వహించాలనే కృతనిశ్చయంతో ఉన్న బోర్డు.. ఒకటి లేదా రెండు కొత్త జట్లకు లీగ్‌లో స్థానం కల్పించాలని భావిస్తోంది. 13వ సీజన్‌కు ఫ్యాన్స్‌ నుంచి మునుపెన్నడూలేని రీతిలో భారీ స్పందన లభించడంతో టోర్నీకి మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కొత్త జట్లు ఎన్నో క్లారిటీ లేకున్నా రావడం మాత్రం పక్కా అనే సంకేతాలు అందుతున్నాయి.

కొత్త జట్టు వస్తే..

కొత్త జట్టు వస్తే..

కొత్త జట్లే వస్తే మాత్రం బీసీసీఐ మెగా వేలం నిర్వహించాల్సిందే. అదే జరిగితే ఇప్పటి వరకు ఆయా ఫ్రాంచైజీల తరఫున ఆడిన ఆటగాళ్లంతా తారుమారు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ జట్టు వీడుతాడనే ప్రచారం ఊపందుకుంది. అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ తీసుకునే అవకాశం ఉందని, మెగా వేలం జరిగితే అతను హైదరాబాద్ వీడక తప్పదనే అభిప్రాయం సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతుంది.

నో టెన్షన్ మాకు కావాలి..

నో టెన్షన్ మాకు కావాలి..

ఈ ప్రచారంతో ఆందోళనకు గురైన కొంతమంది హైదరాబాద్ అభిమానులు ఈ విషయాన్ని నేరుగా హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ట్విటర్ వేదికగా కేన్ మామ దూరమవుతాడా? అని ప్రశ్నించారు. ‘డేవిడ్ బాయ్.. మెగా వేలం జరిగితే కేన్ మామను హైదరాబాద్ జట్టు నుంచి వెళ్లిపోతాడా?'అని ఒకరు కామెంట్ చేయగా.. దిగులుపడవద్దని బదులిచ్చిన వార్నర్.. కేన్ తమకు కావాలన్నాడు. ఇక ‘వచ్చే ఏడాది మేగా వేలం జరుగుతుందా? అదే జరిగితే కేన్‌ సేవలను కోల్పోవాల్సి ఉంటుందా?'అని మరో అభిమాని ప్రశ్నించగా.. తాము ఎట్టి పరిస్థితుల్లో కేన్ వదులు కోమని స్పష్టం చేశాడు. వేలం జరిగితే రిటైన్ చేసుకుంటామని చెప్పకనే చెప్పాడు.

సన్‌రైజర్స్‌లో కేన్ కీలకం..

సన్‌రైజర్స్‌లో కేన్ కీలకం..

ఆరెంజ్ ఆర్మీలో కేన్ విలియమ్సన్ కీలక ఆటగాడు. వార్నర్ గైర్హాజరీలో రెండేళ్లు జట్టును లీడ్ చేసిన ఈ కివీస్ ప్లేయర్ ఓ సారి ఫైనల్‌కు మరోసారి ఫ్లే ఆఫ్స్‌కు చేర్చాడు. ఈ రెండు సీజన్లలో జట్టు బ్యాటింగ్ బాధ్యతలను తన భుజాలపై మోసాడు. ఈ సీజన్‌లో కూడా కేన్ మామ ఆకట్టుకున్నాడు. గాయంతో ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన.. ఆ తర్వాత 12 మ్యాచ్‌ల్లో 133.75 స్ట్రైక్ రేట్‌తో 317 రన్స్ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో అతను కనబర్చిన పోరాటపటిమ ఈ సీజన్‌కే హైలైట్. కానీ దురదృష్టవశాత్తు హైదరాబాద్ విజయాన్నందుకోలేకపోయింది.

ఐపీఎల్‌లో కొత్త జట్లు.. రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు

Story first published: Saturday, November 14, 2020, 14:02 [IST]
Other articles published on Nov 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X