న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH తరఫున డేవిడ్ వార్నర్‌కు ఇదే చివరి సీజన్: డేల్ స్టెయిన్

IPL 2021: Dale Steyn says this might be the last time we see Warner in the Orange Army
Might Be Last Time We See David Warner At SRH, Says Dale Steyn | Oneindia Telugu

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున డేవిడ్ వార్నర్‌కు ఇదే చివరి ఐపీఎల్ సీజనని ఆ జట్టు మాజీ పేసర్, సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ అన్నాడు. డేవిడ్ వార్నర్‌పై వేటు వేసి కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు ఇవ్వడం సరికాదని ఈ మాజీ పేసర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న వార్నర్‌ను జట్టు నుంచి తప్పించడం వింతగా అనిపించిందన్నాడు. తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌తో మాట్లాడుతూ.. వార్నర్ వేటుపై స్పందించిన ఈ సఫారీ మాజీ పేసర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఏదో జరుగుతోంది..

ఏదో జరుగుతోంది..

'యాజమాన్య నిర్ణయాన్ని డేవిడ్‌ ప్రశ్నించాడో లేదో నాకు తెలియదు. అయితే, మనీష్‌ పాండే విషయంలో మాత్రం తాను ఎలాంటి డెసిషన్‌ తీసుకోలేదని చెప్పాడు. కొన్నిసార్లు మేనేజ్‌మెంట్‌కు ఇలాంటి మాటలు రుచించకపోవచ్చు. ఒక కెప్టెన్‌గా కొన్ని తప్పనిసరి బాధ్యతలు ఉంటాయి. ఎవరు తుదిజట్టులో ఉంటారు, ఎవరిని పక్కన పెట్టాలి అన్న అంశాలపై స్పష్టత ఉండాలి. అయితే, ఒక్కోసారి పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు. మొత్తానికి తెరవెనుక ఏదో జరుగుతోందనే విషయం మాత్రం స్పష్టంగా అర్థం అవుతోంది.'డేల్ స్టెయిన్‌ చెప్పుకొచ్చాడు.

ఇదే చివరి సీజన్..

ఇదే చివరి సీజన్..

సన్‌రైజర్స్ యాజమాన్యం వ్యవహారశైలి చూస్తుంటే డేవిడ్‌ వార్నర్‌ ఇక ఆ జట్టుకు ఆడే పరిస్థితి కనబడటం లేదని పేర్కొన్నాడు. 'డేవిడ్ వార్నర్‌ను జట్టు నుంచి తప్పించడం వింతగా అనిపించింది. తదుపరి సీజన్‌‌కు కేన్‌ను కెప్టెన్‌గా కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. కానీ డేవిడ్ వార్నర్ ఓ అసాధారణమైన బ్యాట్స్‌మెన్. నేనైతే అతన్ని జట్టులోనే ఉంచుకుంటా. కానీ ఆరెంజ్ ఆర్మీ తరఫున డేవిడ్ వార్నర్ ఇదే ఆఖరి సీజన్ అనుకుంటా' 2013-15 సీజన్లలో హైదారాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన స్టెయిన్ పేర్కొన్నాడు.

చిత్తయిన హైదరాబాద్..

చిత్తయిన హైదరాబాద్..

రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు ముందు వార్నర్ కెప్టెన్సీపై వేటు వేసిన సన్‌రైజర్స్ టీమ్‌మేనేజ్‌మెంట్.. తుది జట్టులో కూడా చోటివ్వలేదు. అతని స్థానంలో మహ్మద్ నబీని జట్టులోకి తీసుకుంది. కానీ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమైన జట్టు.. 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. వార్నర్‌ను తప్పించి తగిన మూల్యం చెల్లించుకుంది. అయినా వార్నర్‌కు తదుపరి మ్యాచ్‌ల్లో అవకాశం దక్కదని టీమ్ కోచ్, డైరెక్టర్ స్పష్టం చేశారు. బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసం వార్నర్ తప్పించామని పేర్కొన్నారు.

Story first published: Monday, May 3, 2021, 15:36 [IST]
Other articles published on May 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X