న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో మళ్లీ ఆ అనైతిక చర్య: తప్పనిసరి చేయాలంటూ డిమాండ్: చేసిందెవరో కాదు..

IPL 2021: Controversial mankading again raised after CSK vs RR Match
IPL 2021 : Harsha Bhogle Demands 'Mankading' Out In IPL || Oneindia Telugu

ముంబై: మన్కడింగ్.. మనోళ్లే కనిపెట్టిన టెక్నిక్ ఇది. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కొమ్ములు తిరిగిన బ్యాట్స్‌మెన్‌ను అయినా పెవిలియన్ దారి పట్టించడానికి ఉపయోగించే ఓ చిన్న చిట్కా. బౌలర్లకు కొరుకుడు పడకుండా, క్రీజ్‌లో పాతుకుని పోయిన అవుట్ చేయడానికి ప్రయోగిస్తుంటారిది. క్రికెట్‌లో అనైతిక చర్యగా దీన్ని అభివర్ణిస్తుంటారు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడానికి టెక్నికల్‌గా మన్కడింగ్ విధానాన్ని ఏ మాత్రం తప్పు పట్టనప్పటికీ- నైతికంగా చూస్తే.. దాన్ని మించిన తప్పు మరొకటి లేదనే అంటుంటారు విశ్లేషకులు. స్పోర్టివ్‌గా తీసుకోవాల్సిన ఈ రంగంలో అలాంటి అనైతిక చర్యలను ప్రోత్సహించకూడదనే చెబుతుంటారు.

మళ్లీ మన్కడింగ్..

మళ్లీ మన్కడింగ్..

దాన్నలా ఉంచితే- మరోసారి మన్కడింగ్ (Mankading) విధానం ఈ ఐపీఎల్‌లో చర్చకొచ్చింది. ఐపీఎల్ వంటి నాన్ ఐసీసీ టోర్నమెంట్లలో దీన్ని తప్పనిసరి చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీన్ని లేవనెత్తిందెవరో కాదు..మనకు బాగా తెలిసిన సెలెబ్రిటీనే.. స్టార్ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే. ముంబైలోని వాంఖెడె స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఆయన ఈ డిమాండ్ లేవనెత్తారు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడానికి మన్కడింగ్ విధానాన్ని మాండేటరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మన్కడింగ్ విధానం క్రికెట్ స్ఫూర్తితో ముడిపడి ఉండటాన్ని నాన్సెన్స్‌గా అభివర్ణించారు.

నాన్ స్ట్రైకింగ్ ఎండ్ నుంచే

నాన్ స్ట్రైకింగ్ ఎండ్ నుంచే

మన్కడింగ్ విధానంలో అవుట్ చేయడానికి నాన్ స్ట్రైకింగ్ బ్యాట్స్‌మెన్లు తమకు తాముగా అవకాశాన్ని కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని చూసీ చూడనట్లు వ్యవహరించడం సరికాదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్ చేస్తోన్న సమయంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో క్రీజ్‌ను వదిలి పెట్టి చాలా ముందుకు వచ్చిన సందర్భాన్ని ఆయన ఉటంకిస్తున్నారు. ముస్తాఫిజుర్ నో బాల్ సంధించిన సమయంలో డ్వేన్ బ్రావో..నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌ వైపు ఉన్న క్రీజ్‌‌ను వదిలి పెట్టి కనీసం ఓ యార్డ్ దూరం వచ్చేశాడు.

ఎందుకు అవుట్ చేయకూడదు..

ఎందుకు అవుట్ చేయకూడదు..

అప్పుడతన్ని అవుట్ చేయడానికి బౌలర్‌కు చక్కని అవకాశం లభించిందని, నైతికతకు కట్టుబడి ఉండటం వల్లే ముస్తాఫిజుర్‌కు.. మన్కడింగ్ చేయాలనే ఆలోచన కూడా వచ్చి ఉండకపోవచ్చని హర్షాభోగ్లే పేర్కొన్నారు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌ క్రీజ్‌ను అలా వదిలి పెట్టి ముందుకు రావడం సమంజసమేనా అని ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్‌‌ను ఆయన తన ట్వీట్‌కు జత చేశాడు. మన్కడింగ్ చేయకూడదనే నైతికత బౌలర్‌కు ఎలా ఉంటుందో.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ బ్యాట్స్‌మెన్‌కు కూడా క్రీజ్‌ను వదిలి పెట్టి రాకూడదనే బాధ్యత అంతే ఉంటుందని హర్షా భోగ్లే వ్యాఖ్యానించారు.

గత సీజన్‌లోనూ

గత సీజన్‌లోనూ

2019లో ఇదే రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ మన్కడింగ్ విధానంలో అవుటైన విషయం తెలిసిందే. అప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడిన రవిచంద్రన్ అశ్విన్.. మన్కడింగ్ విధానంలో బట్లర్‌ను అవుట్ చేశాడు. దానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. తాను అవుట్ చేసిన విధానాన్ని అశ్విన్ సమర్థించుకున్నాడు కూడా. ఆ తరువత- మన్కడింగ్ ద్వారా అవుట్‌ను గుర్తించబోమని ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లోనూ ఇది ప్రస్తావనకు వచ్చింది. ఢిల్లీ కేపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాటింగ్ మన్కడింగ్ విధానాన్ని లేవనెత్తారు.

Story first published: Tuesday, April 20, 2021, 11:38 [IST]
Other articles published on Apr 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X