న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: 'వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే.. నా టార్గెట్ 45! ఐపీఎల్ టైటిల్ గెలుస్తా'

IPL 2021: Chris Gayle said Age is just a number, my target is 45

చెన్నై: వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే అని యూనివర్స్ బాస్, విండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ అన్నాడు. తన వయసు ఇప్పుడు 41 ఒకటని, 45 ఏళ్ల వరకు క్రికెట్ ఆడుతానని గేల్ స్పష్టం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ తరఫున యూనివర్సల్ బాస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో జరిగిన మ్యాచులో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచులో గేల్ విఫలమయ్యాడు. 9 బంతుల్లో 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. బుధవారం చెన్నై వేదికగా హైదరాబాద్‌తో పంజాబ్ తలపడనుంది.

నిరూపించుకోవడానికి ఏమీ లేదు:

నిరూపించుకోవడానికి ఏమీ లేదు:

క్రిస్ గేల్ తాజాగా ఇన్‌సైడ్‌పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రిటైర్మెంట్ విషయంపై స్పందించాడు. 'వ్యక్తిగతంగా చూసుకుంటే.. ఇక నేను నిరూపించుకోవడానికి ఏమీ మిగలలేదు. అన్ని సాధించాను. ప్రతి సంవత్సరం మెరుగవ్వాలని అందరూ కోరుకుంటారు. నేను దాన్ని అమలు చేయగలిగితే.. నాకు ప్లస్ అవుతుంది. ఇక ఐపీఎల్ టోర్నీలో పంజాబ్ జట్టును మొదటగా ప్లేఆఫ్‌లోకి తీసుకెళ్లాలి. ఆపై ఫైనల్‌కు చేరుకుని ట్రోఫీ సాదించాలి. ఇది కష్టమయినా లక్ష్యం చేరుకుంటాం' అని గేల్ తెలిపాడు.

లక్ష్యం 45:

లక్ష్యం 45:

'నేను ఐపీఎల్ ట్రోఫీ గెలవడానికి ఇష్టపడతాను. ఆ మధుర క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. అవును వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. నేను ఇంకా మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నాను. నాలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉంది. ఇంకా కొన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడతాను. 45 సంవత్సరాల వరకు ఆడడమే నా లక్ష్యం. నాకు ఇప్పుడు 41, ఈ సంవత్సరంతో 42 ఏళ్లు పూర్తవుతాయి. నా రిటైర్మెంట్‌కు ఇంకా చాలా సమయం ఉంది' అని యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ అన్నాడు.

గతంలో మాట్లాడుతూ:

గతంలో మాట్లాడుతూ:

గతంలో ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో గేల్ మాట్లాడుతూ... 'ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్‌ మ్యాచ్‌లు ఆడుతున్నా. ఎందుకంటే ఆటకు నేను చేయాల్సింది చాలా ఉందని నా నమ్మకం. అందుకు నా శరీరం కూడా సహకరిస్తుంది. ఇందుకు చాలా సంతోషంగా ఉన్నా. రోజులు గడిచేకొద్ది నేను యవ్వనంగా మారుతున్నా' అని అన్నాడు. 'నేను ఆడితే చూడాలని చాలా మంది అభిమానులు ఆశిస్తున్నారు. నాక్కూడా క్రికెట్‌పై ఇంకా ఇష్టం పోలేదు. 45 అనేది మంచి సంఖ్య. 45 ఏళ్ల వరకు కొనసాగితే బాగుంటుంది. నాకు ఆటపట్ల ప్రేమ, అభిరుచి, అంకితభావం ఉన్నాయి. వీలైనంత కాలం కొనసాగడానికి ప్రయత్నిస్తా' అని చెప్పుకొచ్చాడు.

 30 బంతుల్లో సెంచరీ:

30 బంతుల్లో సెంచరీ:

ఏప్రిల్​ 23, 2013న వెస్టిండీస్ బ్యాట్స్​మన్ క్రిస్ గేల్​ ఐపీఎల్​లో విశ్వరూపాన్ని చూపాడు. ధనాధన్ ఆటతో క్రికెట్ చరిత్రలో వేగవంతమైన శతకాన్ని నమోదు చేసాడు. రాయల్స్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఆడుతూ గేల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 30 బంతుల్లో సెంచరీ బాదేశాడు.సెంచరీ సాధించే క్రమంలో ఏడు డాట్‌ బాల్స్‌ మాత్రమే ఉండగా.. 11 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఏకంగా 17 సిక్సర్ల సాయంతో 175 పరుగులు చేసి ఐపీఎల్​లో అత్యధిక స్కోరు రికార్డును నమోదు చేశాడు.

RCB vs KKR: అతడు వంగడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు.. ఇది కేకేఆర్‌కు పెద్ద తలనొప్పే: వాన్‌

Story first published: Monday, April 19, 2021, 19:08 [IST]
Other articles published on Apr 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X