న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs KKR: అతడు వంగడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు.. ఇది కేకేఆర్‌కు పెద్ద తలనొప్పే: వాన్‌

IPL 2021: Andre Russell struggling with his body, Its a bad look for KKR says Michael Vaughan

చెన్నై: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. కేకేఆర్ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్ ‌(31; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచినా.. జట్టును గెలిపించలేకపోయాడు. గతంలో రసెల్‌ క్రీజ్‌లో ఉన్నాడంటే విజయం మనదే అన్న ధైర్యంగా ఉండే కేకేఆర్‌.. ఇప్పుడు అతని ఆటపై నమ్మకం ఉంచలేకపోతోంది. ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కీలకమైన 19 ఓవర్‌లో రసెల్‌ కేవలం ఒక్క పరుగే తీశాడు. డబుల్స్‌ తీసే అవకాశం ఉన్నా అతడు ప్రయత్నించకపోయాడు. దీనిపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యాత‌ మైకేల్‌ వాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఫిట్‌నెస్‌తో లేడు

ఫిట్‌నెస్‌తో లేడు

మైకేల్‌ వాన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... ప్రస్తుతం ఆండ్రీ రసెల్‌ శారీరక సమస్యతో బాధపడుతున్నట్లు కనిపిస్తున్నాడన్నాడు. ఎంతో విలువైన ఆటగాడు జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్‌ ఆడకపోతే ఆ ప్రభావం టోర్నీ చివర్లో కనిపిస్తుందని వాన్ పేర్కొన్నాడు. 'రసెల్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో లేడనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అతని ఫిట్‌నెస్‌ లెవెల్స్‌ చాలా కింది స్థాయిలో ఉన్నాయి. గతంలోలా చురుగ్గా మాత్రం లేడు. ఫీల్డింగ్‌ చేసేటప్పుడు వంగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. బాల్‌ అతని దగ్గరకు వచ్చినప్పుడు ఫీట్‌ను ఉపయోగిస్తున్నాడు' అని వాన్ అన్నాడు.

కేకేఆర్‌కు సరికొత్త తలనొప్పే

కేకేఆర్‌కు సరికొత్త తలనొప్పే

'19 ఓవర్‌లో భారీ షాట్ల సంగతి పక్కన పెడితే.. ఆండ్రీ రసెల్ డబుల్స్‌ తీసే ప్రయత్నం కూడా చేయడం లేదు. రసెల్‌ వంటి సూపర్‌ స్టార్‌ ఇలా అన్‌ఫిట్‌గా ఉండటం ఆ జట్టుకు సరికొత్త తలనొప్పే. ఇలా అయితే కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్‌, కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌లకు జట్టును ముందుకు తీసుకెళ్లడం కష్టంగా మారడం ఖాయం' అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2021 కోసం వాన్‌ వ్యాఖ్యాతగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. క్రిక్‌బజ్ నిర్వహించే డిబేట్‌లో అతడు పాల్గొంటున్నాడు. బెంగళూరు పేసర్ మొహ్మద్ సిరాజ్ వేసిన 19వ ఓవర్లో రసెల్ బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. 17వ ఓవర్లో మాత్రం హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. అదే ఊపును చివరి వరకు కొనసాగిస్తే.. కోల్‌కతా గెలిచేదే.

కొంచెం సందేహంగానే ఉన్నా

కొంచెం సందేహంగానే ఉన్నా

బెంగళూరు టైటిల్ గెలవాలంటే నాకౌట్ మ్యాచ్‌ల్లో బలమైన ముంబై ఇండియన్స్ ఓడించాలని, అలా జరిగితేనే ఈఏడాది చాంపియన్‌గా నిలుస్తుందని ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్యం చెప్పాడు. 'చాలా ఏళ్ల తర్వాత ఆర్‌సీబీ టీమ్ చాలా సమతూకంగా కనిపిస్తోంది. ఈ ఏడాది టైటిల్ కూడా గెలచేటట్లు కనిపిస్తోంది. అయితే నాకౌట్‌ మ్యాచ్‌ల్లో కోహ్లీసేన బలమైన ముంబైని ఓడిస్తేనే ఇది సాధ్యం అవుతుంది. ఐపీఎల్ 2021 చాంపియన్ ఎవరా అనే విషయంలో కొంచెం సందేహంగానే ఉన్నా' అని మైకేల్ వాన్ పేర్కొన్నాడు.

టాప్ స్కోరర్

టాప్ స్కోరర్

కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 రన్స్ చేసింది. మ్యాక్స్ వెల్ (78; 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఏబీ డివిలియర్స్ (76 నాటౌట్; 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీశాడు. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేసి ఓటమిపాలైంది. రసెల్ (31), ఇయాన్ మోర్గాన్ ( 29; 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో కైల్ జెమీసన్ మూడు వికెట్లు పడగొట్టాడు.

ఆ ఒక్క ఆటంకం ధాటితే ఈ సారి ఆర్‌సీబీదే టైటిల్.. మైకేల్ వాన్ జోస్యం!

Story first published: Monday, April 19, 2021, 18:01 [IST]
Other articles published on Apr 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X