న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ధోనీ రెస్ట్‌ తీసుకున్నా పర్వాలేదు.. చెన్నై నాలుగో ఐపీఎల్‌ టైటిల్ గెలుస్తుంది: లారా

IPL 2021: Brian Lara has said CSK batting order very long, MS Dhoni can take some rest

ముంబై: ప్రస్తుతం చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎంతో మెరుగ్గా ఉందని, ఇలాంటి సమయంలో కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ కాస్త విశ్రాంతి తీసుకున్నా పర్వాలేదని వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం, ప్రముఖ వ్యాఖ్యాత బ్రియన్‌ లారా అన్నారు. జట్టులోని బ్యాట్స్‌మెన్‌ అంతా మంచి ఫాంలో ఉన్న కారణంగా మహీ బ్యాటింగ్‌ సేవలకు విరామం ఇవ్వాలని సూచించారు. చెన్నై ఇదే స్థాయి ప్రదర్శన ఇవ్వగలితే నాలుగో ఐపీఎల్‌ టైటిల్ గెలుస్తుందని లారా జోస్యం చెప్పారు. సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఎక్కువగా ఆశించడం సరికాదు

ఎక్కువగా ఆశించడం సరికాదు

మంగళవారం స్టార్ స్పోర్ట్స్‌తో బ్రియాన్ లారా మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ సేవల గురించి ఎక్కువగా ఆశించడం సరికాదు. వికెట్‌ కీపర్‌గా గొప్పగా రాణిస్తున్నాడు. అద్భుతమైన స్టంపింగ్స్‌, సూపర్ క్యాచ్‌లు పడుతున్నాడు. కీపింగ్‌లో తన శైలే వేరు అన్న సంగతి అందరికీ తెలుసు. వాస్తవానికి ఇప్పుడు చెన్నై బ్యాటింగ్‌ ఆర్డర్‌ చాలా బాగుంది. ధోనీ విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది. తను ఫాంలో ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇది సహజమే. మహీ ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే.. ఎంతటి విధ్వంసం సృష్టిస్తాడో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు' అని అన్నారు.

ధోనీ రెస్ట్‌ తీసుకున్నా ఫరవాలేదు

ధోనీ రెస్ట్‌ తీసుకున్నా ఫరవాలేదు

'చెన్నై జట్టులో స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్‌ కాకుండా డ్వేన్ బ్రేవో, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, సామ్‌ కరన్, శార్దూల్ ఠాకూర్ వంటి ఎంతో మంది ఆల్‌రౌండర్‌లు జట్టులో ఉన్నారు. ప్రస్తుత జట్టులో ఒకరిద్దరు తప్ప అందరూ బ్యాటింగ్ చేస్తారు. అందుకే కెప్టెన్ ఎంఎస్ ధోనీ రెస్ట్‌ తీసుకున్నా ఫరవాలేదు. చెన్నైకి మహీ వంటి స్పూర్తిమంతమైన నాయకుడు ఉన్నాడు. ఒకవేళ తను గనుక కెప్టెన్సీపై మరింత దృష్టిసారించి, ప్రతీ ఆటగాడి సేవలను పూర్తిగా వినియోగించుకుని, ఇదే స్థాయి ప్రదర్శన ఇవ్వగలితే టైటిల్ కచ్చితంగా గెలుస్తాడు' అని వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రియన్‌ లారా ధీమా వ్యక్తం చేశారు.

హామీ ఇవ్వలేను

హామీ ఇవ్వలేను

మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ... 'నేను నెమ్మదిగా ఆడటం చెన్నైకి నష్టం కలిగిస్తుంది. దీనికి అంగీకరిస్తున్నా. అయితే ఎప్పుడూ మంచి ప్రదర్శన చేస్తానని హామీ ఇవ్వలేను. ఈ మ్యాచ్‌లో నేను ఆడిన మొదటి ఆరు బంతులు వేరే మ్యాచులో ఉపయోగపడతాయి. మనం మెరుగ్గా ఆడుతున్నప్పుడు ఆన్‌ఫిట్‌ అని ఏ ఒక్కరూ అనరు. ఇది నిజం. ప్రదర్శన అనేది హామీ ఇవ్వలేని అంశం. నా 24 ఏళ్ల వయసులోనూ బాగా రాణిస్తానని అప్పుడు హామీ ఇవ్వలేదు. ఇప్పుడు నా వయసు 40 ఏళ్లు. ఇప్పుడు కూడా హామీ ఇవ్వలేను' అని అన్నాడు. ఇ‍ప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండింటిలో గెలుపొందిన చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

IPL 2021: 90 నిమిషాల్లో చెన్నై నుంచి ముంబైకి వెళ్లాలి.. లేదంటే విరాట్ కోహ్లీకి ఫైన్‌!!

Story first published: Tuesday, April 20, 2021, 18:50 [IST]
Other articles published on Apr 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X