Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: 90 నిమిషాల్లో చెన్నై నుంచి ముంబైకి వెళ్లాలి.. లేదంటే విరాట్ కోహ్లీకి ఫైన్‌!!

 If Flight take more than 90 minutes RCB Captain will be fined: Mr Nags punch on Virat Kohli

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జోరుమీదుంది. ఎలాగైనా ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ పట్టాలని చూస్తోంది. అంతేకాదు ఆ దిశగా అడుగులు కూడా వేస్తోంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న కోహ్లీసేన ఐపీఎల్ 2021లో ప్రతీ మ్యాచ్‌లోనూ సమిష్టిగా రాణిస్తోంది. బ్యాటింగ్‌లో విరాట్‌ కోహ్లీ, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఏబీ డివిలియర్స్‌ పరుగుల వరదపారిస్తున్నారు. బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్, కైల్ జెమీషన్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చహల్ రాణిస్తుండడంతో ఇప్పటికే ఆర్‌సీబీ హ్యాట్రిక్ విజయాలు అందుకుంది.

కోహ్లీపైనే పంచ్‌లు

కోహ్లీపైనే పంచ్‌లు

ఆర్‌సీబీ చెన్నైలోని చెపాక్‌లో మ్యాచ్‌లు ముగించుకుని ముంబైలోని వాంఖడేలో ఆడటానికి సిద్ధంగా ఉంది. గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో ఆర్‌సీబీ తలపడనుంది. అయితే చెన్నై నుంచి ముంబైకు వెళ్లబోయే విమానంలో కమెడియన్‌ డానిష్‌ సైత్‌ వినోదాన్ని అందించాడు. మిస్ట‌ర్ నాగ్స్‌గా పేరుగాంచిన డానిష్‌ సైత్‌.. ఆర్‌సీబీకి హెస్ట్‌, ప్రజెంటర్‌గా వ్యవహరించాడు. ఈ సంద‌ర్భంగా మిస్ట‌ర్ నాగ్స్ ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే పంచ్‌లు వేశాడు. ఐపీఎల్ 2021లోని మ్యాచులలో స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసిన కెప్టెన్‌కు భారీ జరిమానా విధిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై నాగ్స్ పంచ్ వేశాడు.

కెప్టెన్‌కు ఫైన్ వేద్దాం

'ఈ ఫ్లైట్ 90 నిమిషాల్లో ముంబై వెళ్తుంది. ఆల‌స్య‌మైతే.. ఆర్‌సీబీ కెప్టెన్‌కు ఫైన్ వేద్దాం. విరాట్ కోహ్లీకి ఇది అల‌వాటే' అంటూ స్లో ఓవ‌ర్ రేట్‌లో కోహ్లీకి జ‌రిమానాలు ప‌డిన విష‌యాన్ని గుర్తు చేస్తూ మిస్ట‌ర్ నాగ్స్ పంచ్ వేశాడు. 'ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో ఎప్పుడూ బెంగ‌ళూరు టాప్‌లో లేదు. ఇక చాలు. దీనిని ఇలా ముగిద్దాం. ముంబైకి వ‌ద్దు.. బెంగ‌ళూరుకు వెళ్లిపోదాం' అంటూ కోచ్‌, కెప్టెన్ స‌హా టీమ్‌లోని ప్ర‌తి ప్లేయ‌ర్ ద‌గ్గ‌రికీ వెళ్లి అత‌డు అన‌డం ఫ‌న్నీగా ఉంది. తన ఇంగ్లిష్‌ మాటలతో, ప్రత్యేకమైన హాస్యంతో ఆర్‌సీబీ జట్టు సభ్యులను, బెంగళూరు అభిమానులను నాగ్స్ ఉత్సాహపరుస్తాడన్న విషయం తెలిసిందే.

బాత్ ‌రూమ్‌లో వేసి

బాత్ ‌రూమ్‌లో వేసి

'ముంబైలో కేవలం ఏబీ డివిలియర్స్‌ మీద ఆధారపడకండి.. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఉన్నాడు. షెహబాజ్‌ అహ్మద్‌, హర్షల్‌ పటేల్‌ కూడా మనకు ఉన్నారు. ఇప్పుడు వారి సాయం కూడా తీసుకోండి. బాగా సాయం చేస్తారు' అంటూ మిస్ట‌ర్ నాగ్స్ నవ్వులు పూయించాడు. చివ‌రికి అతని బాధ‌ను తట్టుకోలేని జట్టు సభ్యులంతా అత‌న్ని ఫ్లైట్‌లోని బాత్ ‌రూమ్‌లో వేసి లాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ తన ట్వీటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 'ముంబైలో కూడా ఇదే జోష్‌ ఉండాలి' అంటూ ఫ్యాన్స్‌ పోస్టులు చేస్తున్నారు.

ఇదే తొలిసారి

ఇదే తొలిసారి

ఐపీఎల్‌ చరిత్రలో ఆర్‌సీబీ ఒక సీజన్‌లో మొదటి మూడు మ్యాచ్‌లు గెలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకు ముందు ఐపీఎల్‌ 2014 సీజన్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ విజయం సాధించింది. టోర్నీ మొదటి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్‌ను ఆర్‌సీబీ ఓడించింది. ముంబై 159 పరుగులు చేయగా.. కోహ్లీసేన చివరి బంతికి విజయం సాధించింది. డివిలియర్స్‌ 27 బంతుల్లో 48 రన్స్ చేశాడు. రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఆర్‌సీబీ మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 149 రన్స్ చేయగా.. సన్‌రైజర్స్ 143 పరుగులకే పరిమితమైంది. షాబాజ్ అహ్మద్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. మూడో‌ మ్యాచ్‌లో బెంగళూరు 204 స్కోరు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (78), డివిలియర్స్‌ (76 నాటౌట్‌) చెలరేగారు. ఛేదనలో తడబడిన కోల్‌కతా 166/8 స్కోరుకే పరిమితమైంది. జెమీసన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు.

World Test Championship: భారత్‌ రెడ్‌లిస్ట్‌లో ఉన్నా.. యధావిధిగా డబ్యూటీసీ ఫైనల్: ఐసీసీ

Story first published: Tuesday, April 20, 2021, 18:23 [IST]
Other articles published on Apr 20, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+