న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs MI: ముంబైతో మ్యాచ్.. కోల్‌కతా ఓటమికి కారణాలు ఇవే!!

IPL 2021: 3 reasons why the Kolkata Knight Riders lost against Mumbai Indians

చెన్నై: 31 బంతుల్లో 30 పరుగులు.. చేతిలో ఆరు వికెట్లు.. క్రీజులో ఉన్నది ఆండ్రీ రస్సెల్‌, దినేశ్‌ కార్తీక్‌. ఈ దశలో కోల్‌కతా నైట్ ‌రైడర్స్‌ ఓటమి చెందుతుందని ఎవరైనా ఊహించగలరా?. కానీ అదే జరిగింది. ముంబై ఇండియన్స్‌ బౌలర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. రాహుల్ చహర్, క్రునాల్ పాండ్యా‌, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌ వారిని ఒక్కో పరుగు తీసేందుకే వణికేలా చేస్తూ తమ జట్టుకు అద్భుత విజయాన్నందించారు.

మంగళవారం చెన్నైలోని చిదంబరం మైదానంలో ముంబైతో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో కోల్‌కతా ఓడిపోయింది. కోల్‌కతా చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. ఆ జట్టు ఓటమికి కారణాలు ఏంటో ఓసారి చూద్దాం.

రసెల్, కార్తీక్ అతి జాగ్రత్త

రసెల్, కార్తీక్ అతి జాగ్రత్త

మ్యాచ్‌లో కోల్‌కతా విజయానికి 18 బంతుల్లో 22 పరుగులు అవసరమవగా.. మోర్గాన్ సేన వరుసగా మూడు ఓవర్లలో 3, 4, 4 పరుగులు మాత్రమే చేసింది. చేతిలో ఐదు వికెట్లు, క్రీజులో పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్, దినేశ్ కార్తీక్ ఉన్నా కోల్‌కతా 10 పరుగుల తేడాతో ఓడిపోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. రసెల్, కార్తీక్ అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. కేవలం సింగిల్స్ మాత్రమే రాబట్టిన ఈ జోడి.. కనీసం ఒక్క పెద్ద షాట్ కూడా ఆడే ప్రయత్నం చేయలేదు. రసెల్, కార్తీక్ తనదైన శైలిలో ధాటిగా ఆడుంటే కోల్‌కతా ఎప్పుడో విజయం సాధించేది.

ఆ బంతిని రాణా డిఫెన్స్ చేసుంటే

ఆ బంతిని రాణా డిఫెన్స్ చేసుంటే

ఛేదనలో కోల్‌కతాకి శుభమన్ గిల్‌ (33: 24 బంతుల్లో 5x4, 1x6)తో కలిసి నితీశ్ రాణా (57: 47 బంతుల్లో 6x4, 2x6) 8.5 ఓవర్లలోనే 72 పరుగుల భాగస్వామ్యంతో మంచి శుభారంభమిచ్చాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రాణా.. మ్యాచ్‌ని వేగంగా ముగించేసేలా కనిపించాడు. ఈ సమయంలో గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ ఔట్ అయినా రాణా నిలబడ్డాడు. అయితే 15వ ఓవర్లో రాహుల్ చహర్ వరుస బంతులతో రాణాను ఇబ్బందిపెట్టాడు. ఆ ఓవర్ చివరి బంతిని రాణా కచ్చితంగా షాట్ కోసం ప్రయత్నిస్తాడని ముందే ఊహించిన చహర్.. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా ప్లిపర్ రూపంలో సంధించాడు. భారీ షాట్ కోసం క్రీజు వెలుపలికి వచ్చిన రాణా.. స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. రాణా ఆ బంతిని కూడా డిఫెన్స్ చేసుంటే ఔట్ అయ్యేవాడు కాదు. అప్పుడు ఫలితం మరోలా ఉండేది.

అతి విశ్వాసమే

అతి విశ్వాసమే

చెన్నై పిచ్‌పై పరుగులు చేయడం అంత సులభం కాదు. అయినా కోల్‌కతా ఓపెనర్లు శుభమన్ గిల్‌, నితీశ్ రాణా అద్భుతంగా ఆడారు. 72 పరుగుల భాగస్వామ్యం అందించారు. రాహుల్ చహర్ ఓ అద్భుత బంతితో గిల్‌న ఔట్ చేశాడు. ఆ వెంటనే రాహుల్ త్రిపాఠి (5), ఇయాన్ మోర్గాన్‌ (7)లను కూడా ఔట్ చేశాడు. ఆదుకుంటాడనుకున్న షకీబ్ ఉల్ హాసన్ (9) కూడా క్రీజులో నిలవలేదు. స్టార్ బ్యాట్స్‌మన్‌ అందరూ ఒక్కసారిగా పెవిలియన్ చేరారు. మోర్గాన్‌, షకీబ్ బాధ్యతగా ఆడుంటే.. మరో వికెట్ కోల్‌కతా కోల్పోయేది కాదు. అప్పుడు కోల్‌కతా సునాయాసంగా గెలిచేది. చిన్న లక్ష్యమే కదా అనుకున్న కోల్‌కతా ఆటగాళ్ల అతి విశ్వాసమే మోర్గాన్‌ సేన కొంపముంచింది.

మిడిలార్డర్‌ విఫలం

మిడిలార్డర్‌ విఫలం

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకం సాధించగా.. రోహిత్‌ శర్మ (43) రాణించాడు. కోల్‌కతా బౌలర్లలో రసెల్ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. నితీశ్‌ రాణా అర్ధశతకం సాధించగా.. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. రాహుల్‌ చహర్‌ 4, బౌల్ట్‌ 2 వికెట్లు పడగొట్టారు.

KKR vs MI: ఓటమి దశ నుంచి గెలుపు.. కెప్టెన్సీలో రోహిత్ శర్మ దేవుడు!!

Story first published: Wednesday, April 14, 2021, 12:45 [IST]
Other articles published on Apr 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X