KKR vs MI: ఓటమి దశ నుంచి గెలుపు.. కెప్టెన్సీలో రోహిత్ శర్మ దేవుడు!!

చెన్నై: ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచిందంటే.. కేవలం జట్టు బలంగా ఉండటం వల్ల మాత్రమే కాదు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ కూడా కచ్చితమైన ప్రణాళికల్ని అమలు చేయడమే. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఎలా గెలిపించాలో మరోసారి రుజువు చేశాడు. చెన్నై వేదికగా మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌ను ముంబై గెలిచిందంటే సారథిగా రోహిత్ మరింత పరిణితిని కనబరచడమే. మ్యాచ్ ఓడిపోయే దశ నుంచి గెలుపు తీరాలకు వెళ్లిందంటే అది రోహిత్ వ్యూహ రచనే. కోల్‌కతాతో జరిగిన పోరులో ఆఖర్లో బౌలర్లు సత్తాచాటడంతో ముంబై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మరో స్పిన్నర్ అవసరం:
కోల్‌కతా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే ముంబై ఇద్దరు స్పిన్నర్లకే పరిమితమైంది. ఆ తర్వాత మరొక స్పిన్నర్‌ను ముంబై తీసుకుని ఉండుంటే బాగుండేదని మ్యాచ్ విశ్లేషకుల సైతం అభిప్రాయపడ్డారు. ప్రధానంగా రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బాగా నెమ్మదించి స్పిన్నర్లకు అనుకూలించిన విషయం రాహుల్ చహర్, కృనాల్ పాండ్యాల బౌలింగ్‌ను బట్టి అర్థమైంది. చహర్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసి 27 పరుగులే ఇవ్వగా.. కృనాల్ 4 ఓవర్లు వేసి 13 రన్స్ ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. ఈ ఇద్దరే ముంబై గెలుపులో ప్రధాన పాత్ర ధారులు. మరో స్పిన్నర్ అవసరం కూడా ముంబైకే ఏర్పడింది.
ఆ వ్యూహం సక్సెస్:
కీరోన్ పొలార్డ్‌తో ఒక ఓవర్, లెఫ్టార్మ్ పేసర్ మార్కో జాన్సన్ చేత రెండు ఓవర్లు మాత్రమే రోహిత్ శర్మ వేయించాడు. వీరి బౌలింగ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ ఎదురుదాడి చేసే అవకాశం ఉండటంతో అతడే ఒక ఓవర్ వేశాడు. 14 ఓవర్‌ను వేసి 9 పరుగులు ఇచ్చాడు. తొలి బంతికి రోహిత్ కాలి పాదం మెలికపడ్డా తిరిగి బౌలింగ్ కొనసాగించడం పోరాట స్ఫూర్తికి నిదర్శనం. పార్ట్ టైం బౌలర్ రూపంలో స్పిన్ బౌలింగ్ వేసి తన వ్యూహంను సక్సెస్ చేశాడు. ఐపీఎల్‌లో ఏడేళ్ల తర్వాత బంతిని అందుకున్నాడంటే రోహిత్ మ్యాచ్‌ను ఎంత సీరియస్‌గా తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.
ఫీల్డ్ ప్లేస్‌మెంట్ వావ్:
ఆండ్రీ రసెల్, దినేష్ కార్తీక్ బ్యాటింగ్ చేసినప్పుడు రోహిత్ శర్మ సెట్ చేసిన ఫీల్డ్ ప్లేస్‌మెంట్ వావ్ అనిపించింది. సరైన సమయాల్లో పేస్ బౌలర్లను రంగంలోకి దించడం, ఆటగాళ్లకు దైర్యం చెప్పడం లాంటి వాటితో రోహిత్ ఆకట్టుకున్నాడు. ఓటమి దశ నుంచి ముంబైని గెలుపు బాట పట్టించిన రోహిత్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అభిమానులు అతడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 'కెప్టెన్సీలో రోహిత్ శర్మ దేవుడు', 'రోహిత్ శర్మ కెప్టెన్సీ సూపర్', 'కెప్టెన్సీతో రోహిత్ ఎప్పుడూ నిరాశపరచడు', 'ఇది కదా కెప్టెన్సీ అంటే' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications