న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs SRH: హ్యాట్రిక్ బౌండరీలు.. జోఫ్రా ఆర్చర్‌ను హడలెత్తించిన విజయ్ శంకర్ (వీడియో)

IPL 2020: Vijay Shankar hits hat-trick fours in Jofra Archer bowling

దుబాయ్: గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్‌ లూకీ ఫెర్గూసన్‌ ధాటికి విలవిల్లాడి సూపర్‌ ఓవర్‌లో ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఈ సారి సమిష్టిగా రాణించి కీలక విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మనీశ్‌ పాండే (47 బంతుల్లో 83 నాటౌట్‌; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), విజయ్‌ శంకర్‌ (51 బంతుల్లో 52 నాటౌట్‌; 6 ఫోర్లు) చెలరేగడంతో వార్నర్‌ సేన ఈ సీజన్‌లో ఛేజింగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. గురువారం రాత్రి రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

సన్‌రైజర్స్‌ విజయంలో మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్‌లదే కీలక పాత్ర అని చెప్పాలి. ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఈ జోడి ఆడుకుంది. మనీష్ దూకుడుగా ఆడగా.. విజయ్ నెమ్మదిగా బ్యాటింగ్ చేసినప్పటికీ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఇక క్రీజులో కుదురుకున్నాక దూకుడు పెంచాడు. మనీష్ రాజస్థాన్ అందరి బౌలర్లను ఆటాడుకోగా.. జోఫ్రా ఆర్చర్‌ను విజయ్ హడలెత్తించాడు. అతని బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి చుక్కలు చూపించాడు. వరుస బౌండరీలు బాదడంతో ఆర్చర్ ముఖం చిన్నబోయింది.

మొదటి రెండు ఓవర్లలో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలను ఔట్ చేసిన జోఫ్రా ఆర్చర్..సన్‌రైజర్స్‌ జట్టును వణికించాడు. ఇక ఇన్నింగ్స్ 12వ ఓవర్లో బౌలింగ్ చేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మూడు ఓవర్లలో 8 రన్స్ మాత్రమే ఇచ్చిన ఆర్చర్.. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసి విజయ్ శంకర్‌కు బలయ్యాడు. మనీష్ పాండేకు ఛాన్స్ ఇవ్వకుండా ఆ ఓవర్ మొత్తం బ్యాటింగ్ చేసిన విజయ్.. 13 రన్స్ రాబట్టాడు. తొలి బంతిని మిడాఫ్ దిశగా ఫోర్ కొట్టాడు. తర్వాతి బంతిని మిడాన్ వైపు, మూడో బంతిని లాంగ్ ఆన్ మీదుగా ఫోర్ బాదాడు. ఆఖరి బంతికి సింగిల్ తీశాడు. వరుస బౌండరీలతో ఆర్చర్‌ను హడలెత్తించాడు. ఈ సమయంలో స్టీవ్ స్మిత్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. వరుస బౌండరీలకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది



మ్యాచ్ అనంతరం విజయ్ శంకర్ మాట్లాడుతూ... 'అంతకుముందు బౌలింగ్ చేశా కాబట్టి పిచ్ ఎలా ఉందనే విషయంపై కొంత అవగాహన ఉంది. బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆర్చర్ బౌలింగ్ చేస్తాడని తెలుసు. మొదట క్రీజులో కుదురుకోవాలనుకున్నా. ఈ మ్యాచ్ నాకు డూ ఆర్ డై లాంటిది. ఈ సీజన్లో ఇంతకు ముందు 18 బాల్స్ మాత్రమే ఎదుర్కొన్నాను. ఇది మంచి ఛాలెంజ్. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం కోసం ఎదురు చూస్తున్నా. ఇలాంటి పరిస్థితుల్లో రాణిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధాటిగా ఆడాలా అని మనీష్, నేను చర్చించుకున్నాం. చివరి వరకు ఆడాలనుకున్నాం. అలాగే చేశాం' అని తెలిపాడు.

టీచర్ హోం వర్క్ ఇచ్చినట్టు.. సిరాజ్‌కు ఏమాత్రం తెలియదు: రషీద్ ఖాన్ సెటైర్టీచర్ హోం వర్క్ ఇచ్చినట్టు.. సిరాజ్‌కు ఏమాత్రం తెలియదు: రషీద్ ఖాన్ సెటైర్

Story first published: Friday, October 23, 2020, 13:28 [IST]
Other articles published on Oct 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X