న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంజాబ్‌ను దెబ్బతీసిన అంపైర్ తప్పిదం.. ఆ మూడు ఓటములే కొంపముంచాయి!

IPL 2020: Umpiring error cost Kings XI Punjab Playoffs Chance
CSK VS KXIP: Third Umpire Controversial Decision Spoil KXIP's Playoffs Chance, KL Rahul Angry

హైదరాబాద్: ఐపీఎల్ 2020 టోర్నీ నుంచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిష్క్రమించినా.. స్పూర్తిదాయకమైన ఆట తీరుతో ఆ జట్టు అభిమానులను ఆకట్టుకుంది. ఫస్టాఫ్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు ఓటములతో అట్టడుగున నిలిచిన రాహుల్ సేన.. ఆ తర్వాత అనూహ్యంగా ఐదు విజయాలందుకొని ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఆ జట్టు కష్టం చూసిన వారంతా పంజాబ్ ప్లేఆఫ్ చేరితే బాగుండని కోరుకున్నారు. కానీ చివరి రెండు మ్యాచ్‌‌‌ల్లో ఓడిన పంజాబ్.. ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.

ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 9 వికెట్లతో ఓటమిపాలైంది. దాంతో చెన్నై పోతూ పోతూ.. తమ వెంట పంజాబ్‌ను తీసుకెళ్లింది. అయితే దురదృష్టాన్ని నెత్తిల పెట్టుకున్న పంజాబ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడటం.. అంపైర్ తప్పిదం కారణంగా మూల్యం చెల్లించుకుందని ఆ జట్టు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

 అంపైర్ తప్పిదంతో ఓటమి

అంపైర్ తప్పిదంతో ఓటమి

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో గెలవాల్సిన పంజాబ్ అంపైర్ తప్పిదంగా కారణంగా ఓడింది. మూడు బంతుల్లో ఒక్క పరుగు చేయలేక సూపర్ ఓవర్‌ దాకా తెచ్చుకున్న రాహుల్ సేన.. సూపర్ ఓవర్లో మ్యాచ్‌ను కోల్పోయింది. విన్నింగ్ షాట్ సిక్స్ కొట్టాలన్న ఉత్సాహంలో మ్యాచ్‌నే చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో అంపైరింగ్ తప్పిదం కూడా పంజాబ్‌ ఓటమికి కారణమైంది.

రబడా వేసిన ఇన్నింగ్స్‌ 18.3 ఓవర్లో మయాంక్‌ అగర్వాల్‌ రెండు పరుగులు తీశాడు. కానీ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లోని క్రిస్‌ జోర్డాన్‌.. రెండో పరుగు సమయంలో బ్యాట్‌‌ను సరిగా క్రీజ్‌లో ఉంచలేదనే కారణంతో అంపైర్‌ నితిన్‌ మీనన్ ఒక పరుగు కోత పెట్టాడు‌. కానీ బ్యాట్ క్రీజ్‌ లోపలే పెట్టినట్లు తర్వాత తేలింది. రూల్స్‌ ప్రకారం రెండు పరుగులు వచ్చి ఉంటే.. పంజాబ్‌ సునాయసంగా గెలుపొందింది. అప్పట్లో ఈ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగగా.. తాజాగా పంజాబ్ నిష్క్రమణతో మరోసారి చర్చనీయాంశమైంది.

కాట్రేల్ చెత్త బౌలింగ్

కాట్రేల్ చెత్త బౌలింగ్

ఇక రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పంజాబ్ గెలుపు ఖాయమని భావించారంతా. కానీ కాట్రెల్ వేసి 18వ ఓవర్లో ఐదు సిక్సులు బాదిన రాహుల్ తెవాటియా అనూహ్యంగా మ్యాచ్‌ను తిప్పేశాడు. 30 బంతుల్లో 84 రన్స్ అవసరమైన దశలో.. పంజాబ్ బౌలర్లు కాస్త తెలివిగా బంతులు విసిరి ఉండుంటే.. 223 రన్స్ చేసిన కింగ్స్ ఎలెవన్ ఈ మ్యాచ్‌లో సునాయసంగా గెలిచి ఉండేది. కానీ కాట్రెల్ ఒకే ఓవర్‌లో 30 పరుగులిచ్చి ఓటమికి కారణమయ్యాడు.

ఇంచ్ తేడాలో సిక్స్ మిస్..

ఇంచ్ తేడాలో సిక్స్ మిస్..

ఇక కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో పంజాబ్ ఓడిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ జట్టు ఎంత అన్‌లక్కీ అర్థమైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 164 రన్స్ చేయగా.. చివరి మూడు ఓవర్లలో విజయానికి 22 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉన్న పంజాబ్.. మ్యాచ్ ముగిసే సరికి రెండు పరుగుల తేడాతో ఓడింది. ఆఖరి బంతికి సిక్స్ కొడితే గెలుస్తారనగా.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో మ్యాక్స్ వెల్ కొట్టిన భారీ షాట్ ఇంచు తేడాలో ఫోర్‌గా వెళ్లింది. ఇది కనుక సిక్స్ పడి ఉంటే పంజాబ్ గెలిచేది.

ఓడే మ్యాచ్‌ల్లో గెలిచినా..

ఓడే మ్యాచ్‌ల్లో గెలిచినా..

అనంతరం అనూహ్యంగా పుంజుకున్న పంజాబ్.. ముంబై ఇండియన్స్, హైదరాబాద్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓడాల్సిన దశలోనూ గెలుపొందింది. హైదరాబాద్‌తో స్వల్ప స్కోర్‌కు కాపాడుకున్న ఆ జట్టు.. ముంబైతో డబుల్ సూపర్ ఓవర్‌లో గెలిచింది. కానీ ఫలితం లేకుండా పోయింది. ఫస్టాఫ్‌లో ఓడే మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ రేసులో ఉండేది. ఇక 10.5 కోట్లు పెట్టి కొన్న మ్యాక్స్‌వెల్ వైఫల్యం ఆ జట్టును తీవ్రంగా నిరాశపరించింది. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ అయిన మ్యాక్స్‌వెల్ ఈ సీజన్‌లో ఒక్క సిక్స్ కూడా కొట్టకపోవడం గమనార్హం.

ధోనీ దేశవాళీ క్రికెట్ ఆడు.. వచ్చే సీజన్‌లో నీకు తిరుగుండదు: సునీల్ గవాస్కర్

Story first published: Monday, November 2, 2020, 14:16 [IST]
Other articles published on Nov 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X