ధోనీ దేశవాళీ క్రికెట్ ఆడు.. వచ్చే సీజన్‌లో నీకు తిరుగుండదు: సునీల్ గవాస్కర్

దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. వరుస పరాజయాలతో అందరికన్నా ముందే చెన్నై ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక ఏడాది తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన మహీ.. ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు. కీపింగ్‌లో అదరగొట్టినా.. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలయ్యాడు. అతని కెప్టెన్సీలో కూడా మునపటి మార్క్ కనిపించలేదు.
దాంతో ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఘోరంగా విఫలమై చెన్నై ఇంటి బాట పట్టింది. అయితే, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహీ దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. వచ్చే సీజన్‌లో చెన్నై సారథి బ్యాటింగ్‌లో మెరవాలంటే నెట్స్‌లో సాధన ఒక్కటే సరిపోదని, మైదానంలోకి దిగి మ్యాచ్‌లు ఆడితేనే ఒత్తిడిని జయించి రాణించగలడని గవాస్కర్ సూచించాడు.

వచ్చే సీజన్‌పై ధోనీ క్లారిటీ
ఆదివారం పంజాబ్‌తో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై 9 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిలందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా టాస్ వేసే సమయంలో హోస్ట్ డానీ మోరిసన్ చెన్నై తరఫున ఇదే చివరి మ్యాచ్ కాదు కదా? అని ధోనీని ప్రశ్నించాడు. ధానికి ధోనీ నవ్వుతూ కచ్చితంగా కాదన్నాడు. మ్యాచ్ అనంతరం కూడా వచ్చే సీజన్ ప్రణాళికల గురించి మాట్లాడాడు. జెర్సీలు ఇవ్వడంతో రిటైర్ అవుతానని అందరూ పొరపడ్డారని తెలిపాడు. కానీ అలాంటిదేం లేదని వచ్చే సీజన్‌కు తమ కోర్ టీమ్‌ను మార్చాల్సిన అవసరం ఉందన్నాడు. దాంతో వచ్చే సీజన్ ధోనీ ఆడటంపై ఓ క్లారిటీ వచ్చింది.

నాకు సంతోషమే..
ఇదే విషయంపై స్పందించిన గవాస్కర్.. ధోనీ ఆడటం తనకు కూడా సంతోషమేనని, మహీ ఆకట్టుకునే క్రికెటర్ అని ప్రశంసించాడు. తన బ్యాటింగ్, కీపింగ్‌తో పాటు నాయకత్వ లక్షణాలతో మహీ మైమరపిస్తాడని చెప్పాడు. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ ఎక్కడైనా ధోనీ ఆదర్శంగా ఉంటాడని మెచ్చుకున్నాడు. 'ధోనీ ఖచ్చితంగా ఆడాలి. సంగక్కర కూడా ఇంతకుముందే ఇదే విషయం చెప్పాడు. ధోనీ దేశవాళీ క్రికెట్ ఆడాలి. నెట్స్‌లో సాధన చేస్తే సరిపోతుంది కానీ, నిజంగా క్రికెట్ ఆడితేనే బాగుంటుంది. ఎందుకంటే అతడి వయసు ప్రభావం కారణంగా ఆటలో మెరుపు కోల్పోయే ప్రమాదం ఉంది.

టైమింగ్‌లో తేడా ఉంటుంది..
వయసు పైబడే కొద్ది టైమింగ్‌లో తేడా వస్తుంది. అద్దంలో చూసుకుంటే అంతా బాగున్నట్లే అనిపిస్తుంది. కానీ కాస్త బరువు తగ్గొచ్చు. జిమ్‌కి వెళ్లి ఎంత దృఢంగా మారినా ఆడేటప్పుడు షాట్ల టైమింగ్‌లో తేడా ఉంటుంది. ఇప్పుడు ధోనీ కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. అతడు దేశవాళీ క్రికెట్ ఆడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. దాంతో మనం చేసేదేం లేదు. అతడు క్రికెట్ ఆడితేనే బాగుంటుంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తే ఒత్తిడి ఉండదు. మ్యాచ్‌లు ఆడితేనే ఒత్తిడిని తట్టుకొని రాణిస్తాడు. నిజంగా అలా చేస్తే వచ్చే సీజన్‌లో ధోనీకి తిరుగుండదు' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

కాంపిటీటివ్ క్రికెట్ ఆడాలి..
వచ్చే సీజన్ ముందు ధోనీ కాంపిటీటివ్ క్రికెట్ ఆడి తన ఫామ్ అందుకోవాలని శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర సూచించాడు. ‘వ్యక్తిగత ప్రదర్శన పట్ల ధోనీ తీవ్ర నిరాశకు గురై ఉంటాడు. అయితే మిగిలిన ఒక్క మ్యాచ్‌తో అతనేం చేయలేడు. కనీసం తదుపరి సీజన్‌కైనా తన తప్పిదాలను తెలుసుకొని రావాలి. అయితే అంతర్జాతీయ క్రికెట్, ఫస్ట్ క్లాస్, ప్రాంతీయ క్రికెట్ ఆడకుండా నేరుగా ఐపీఎల్‌లో ఆడుదామంటే కుదరదు. ఫామ్ అందుకోవాలంటే అతను వచ్చే సీజన్ ముందు కాంపిటీటివ్ క్రికెట్ ఆడాలి.'అని ఈ శ్రీలంక మాజీ వికెట్ కీపర్ సూచించాడు.
KKR vs RR: అంతా ఆ దేవుడి దయే.. ప్లే ఆఫ్ అవకాశాలపై ఇయాన్ మోర్గాన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications