న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంపైర్ ఘోర తప్పిదం.. నిబంధనలకు విరుద్దంగా డేవిడ్ వార్నర్‌కు సాయం!

IPL 2020: Umpire Anil Chaudhary triggers controversy by allegedly influencing DRS call

దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫీల్డ్ అంపైర్ల ఘోర తప్పిదాలు కొనసాగుతునే ఉన్నాయి. అంపైర్ నితిన్ మీనన్ షార్ట్ రన్ నిర్ణయం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపడంతో తీవ్ర దుమారం రేగింది. అనంతరం అంపైర్ రఫెల్ ధోనీ ఆగ్రహాన్ని చూసి వెడ్ ఇవ్వకుండా వెనక్కి తగ్గడం కూడా చర్చనీయాంశమైంది. తాజాగా మరో ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి నిబంధనల్ని అతిక్రమిస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కి సాయం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 88 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఔట్ విషయంలో అంపైర్ అనిల్ చౌదరీ.. డేవిడ్ వార్నర్ డీఆర్ఎస్ తీసుకోకుండా సాయం చేశాడు.

అసలు ఏం జరిగిందంటే..?

అసలు ఏం జరిగిందంటే..?

ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా సన్‌రైజర్స్ ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ వేసిన 17వ ఓవర్‌లో రవిచంద్రన్ అశ్విన్ బంతిని ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. బంతి అతని బ్యాట్ అంచున తాకి అనంతరం ఫ్యాడ్స్‌ని తాకింది. అయినప్పటికీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేశారు. దాంతో.. ఆ అప్పీల్‌ని తిరస్కరించిన ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి.. వెంటనే బంతి బ్యాట్‌కి తాకిందనేలా చేతులతో సిగ్నల్ ఇచ్చాడు. ఈ హింట్‌తో వెనక్కి తగ్గిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రివ్యూ తీసుకోలేదు.

రూల్ ప్రకారం అలా చెప్పకూడదు..

రూల్ ప్రకారం అలా చెప్పకూడదు..

వాస్తవానికి నిబంధనల ప్రకారం ఫీల్డ్ అంపైర్ అలా తన ‘నాటౌట్'నిర్ణయానికి గల కారణాన్ని రివ్యూ తీసుకునే ముందు వెల్లడించకూడదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ డీఆర్‌ఎస్ కోరేందుకు ఉన్న 15 సెకన్ల గడువు ముగిసిన తర్వాతే చెప్పినా.. ఫర్వాలేదు. కానీ.. రివ్యూ కోరకముందే తాను నాటౌట్ ఇవ్వడానికి గల కారణాన్ని ఫీల్డ్ అంపైర్ చెప్పడంతో డేవిడ్ వార్నర్ రివ్యూకి వెళ్లలేదు. ఇక అనిల్ చౌదరి తీరుపై మ్యాచ్ కామెంటేటర్లు సైతం పెదవి విరిచారు. ఇలా చేసి ఉండాల్సింది కాదని బ్రెట్ లీ, స్కాటీ అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్ రూల్స్‌లో ఏం ఉందంటే..

ఐపీఎల్ రూల్స్‌లో ఏం ఉందంటే..

ఐపీఎల్ నిబంధన 3.2.3 ప్రకారం అంపైర్ నిర్ణయం ప్రకటించిన తర్వాత డీఆర్‌ఎస్ కోరే సమయం (15 సెకన్లు) ముగిసేలోపు ఆటగాళ్లు అంపైర్‌తో చర్చించడానికి వీల్లేదు. అలానే అంపైర్ కూడా తన నిర్ణయానికి గల కారణాన్ని ఎట్టి పరిస్థితుల్లో బహిర్గతం చేయకూడదు. కానీ.. అనిల్ చౌదరి ఇక్కడ రూల్స్‌ బ్రేక్ చేస్తూ.. సైగలు చేశాడు.

సోహోరే సాహా..

సోహోరే సాహా..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగులు చేసింది. వృద్దిమాన్ సాహా(45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87), డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66), మనీష్ పాండే(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 44 నాటౌట్ ) చెలరేగారు. అనంతరం ఢిల్లీ 19 ఓవర్లలో 131 పరుగులకు కుప్పకూలింది. రిషభ్ పంత్(36), రహానే(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్(3/7) మూడు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ(2/27), నటరాజన్ (2/26) రెండేసి వికెట్లు తీశారు. నదీమ్, హోల్డర్, శంకర్‌కు తలో వికెట్ దక్కింది.

రషీద్ ఖాన్‌ను ముద్దులతో ముంచెత్తిన హసీనా.. మిస్సవుతున్నాన్న అఫ్గాన్ సెన్సేషన్!

Story first published: Wednesday, October 28, 2020, 17:17 [IST]
Other articles published on Oct 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X