Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రషీద్ ఖాన్‌ను ముద్దులతో ముంచెత్తిన హసీనా.. మిస్సవుతున్నాన్న అఫ్గాన్ సెన్సేషన్!

Rashid Khan shares adorable video of his niece cheering him on from Afghanistan

దుబాయ్: ఐపీఎల్ 2020 నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ జూలు విదిల్చింది. ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టి కీలక విజయాన్నందుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 88 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది. ఈ గెలుపుతో ప్లే ఆశలను సజీవం చేసుకుంది. బ్యాటింగ్‌లో వృద్దిమాన్ సాహా(45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87), డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) విధ్వంసం సృష్టిస్తే.. బౌలింగ్‌లో అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ మాయ చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే బెస్ట్ బౌలింగ్‌(3/7) గణంకాలతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు.

అయితే తన సూపర్ పెర్ఫామెన్స్‌కు గల కారణాన్ని రషీద్ తెలియజేశాడు. తన ముద్దుల కోడలు, చిన్నారి హసీనా ఇస్తున్న ప్రోత్సాహమే ఈ సంచలన ప్రదర్శనకు కారణమన్నాడు. ఆ చిన్నారి తన మామ ఆటను ఆస్వాదిస్తూ ముద్దుల వర్షం కురిపించిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోలో పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో రషీద్ ఖాన్ మాట్లాడుతుండగా.. టీవీ ముందు నిలుచున్న చిన్నారి హాసీనా ఫ్లైయింగ్ కిస్‌లతో తన మామను ముంచెత్తింది. ఈ వీడియో ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ 7 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. అంతేకాకుండా 17 డాట్ బాల్స్ వేశాడు. షిమ్రాన్ హెట్‌మెయిర్‌ను బౌల్డ్‌ చేసిన రషీద్‌.. అజింక్య రహానేను ఎల్బీగా ఔట్‌ చేశాడు. అక్షర్‌ పటేల్‌‌ను క్యాచ్‌గా ఔట్ చేసి మరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఈ ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ గణాంకాలను (3/7) నమోదు చేశాడు. అంతేకాకుండా అత్యుత్తమ ఎకానమీని (1.91) కూడా రషీద్‌ తన పేరిట లిఖించుకున్నాడు.

Story first published: Wednesday, October 28, 2020, 16:06 [IST]
Other articles published on Oct 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+