న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేదార్ జాదవ్: ఒక్క పరుగు = రూ.10 లక్షలు: రూ. 23 కోట్లు ధారపోసినా: వరుసగా మూడో సీజన్‌లో

IPL 2020: The last couple of seasons for Kedar Jadhav has been a big struggle

చెన్నై: ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి మిగిల్చిన సెగ ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. ధోనీ సేన మరో భారీ విజయాన్ని అందుకుంటే గానీ.. అభిమానుల ఆగ్రహం చల్లారేలా కనిపించట్లేదు. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ చేస్తోన్న ట్రోల్స్..ఇంకా పెరుగుతున్నాయే తప్ప.. ఎక్కడా తగ్గముఖం పట్టట్లేదు. ఈ ట్రోల్స్ మొత్తం- ఒకే ఒక్క బ్యాట్స్‌మెన్‌ చుట్టూ తిరుగుతున్నాయి. తమ ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోనీని ఏమీ అనలేక.. ఆ బ్యాట్స్‌మెన్‌పై తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నట్టున్నారు చెన్నై అభిమానులు.

కేదార్ జాదవ్ చుట్టే..

కేదార్ జాదవ్ చుట్టే..

ఆ బ్యాట్స్‌మెన్.. కేదార్ జాదవ్. మిడిల్ ఆర్డర్‌లో అటాకింగ్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన కేదార్.. అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో కోల్‌కత నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పేలవంగా ఆడాడు. కాస్త ధాటిగా ఆడితే.. విజయం ఖాయమనే పరిస్థితుల్లో అతను నింపాదిగా ఆడటం పట్ల అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. 12 బంతుల్లో ఏడు పరుగులు చేసిన కేదార్ జాదవ్.. నాటౌట్‌గా నిలిచాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా ధాటిగా ఆడుతున్నా.. అతని నుంచి ఏ మాత్రం స్ఫూర్తిని పొందనట్టుగా కనిపించాడతను.

2018 నుంచీ అదే పరిస్థితి..

2018 నుంచీ అదే పరిస్థితి..

నిజానికి- ఈ ఒక్క సీజన్‌లోనే కేదార్ జాదవ్ విఫలం అయ్యాడనుకోవడానికి వీల్లేదు. 2018 నుంచీ అతని ఆటతీరు పేలవంగానే ఉంటోంది. 2018 ఐపీఎల్ సీజన్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడతను. ఆ మ్యాచ్‌లో 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఆ తరువాత గాయం వల్ల సీజన్ మొత్తానికీ అందుబాటులో లేకుండా పోయాడు. ఈ ఒక్క మ్యాచ్‌తోనే అతను విఫలం అయ్యాడని నిర్ధారించలేం. మరుసటి ఏడాది అంటే 2019లోనూ అతను ఏ మాత్రం రాణించలేకపోయాడు.

14 మ్యాచుల్లో..

14 మ్యాచుల్లో..

గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లోనూ కేదార్ జాదవ్ తన స్థాయికి తగ్గ ఆటతీరును కనపర్చలేకపోయాడు. ఐపీఎల్-2019 సీజన్ మొత్తం మీద 14 మ్యాచ్‌లను ఆడిన అతను 162 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ సీజన్‌లో అతని హయ్యెస్ట్ స్కోరు 58 పరుగులు. సీజన్ మొత్తంలో అతని బ్యాటింగ్ సగటు 18.00. స్ట్రైకింగ్ రేటు 95.85గా నమోదైంది. ఆ సీజన్ మొత్తం మీద మూడే సిక్సులను బాదాడతను. ఓ అటాకింగ్ బ్యాట్స్‌మెన్ నుంచి ఏ మాత్రం ఆశించని, ఊహించని గణాంకాలు ఇవి.

ఈ సీజన్‌లోనూ అదే దారిలో..

ఈ సీజన్‌లోనూ అదే దారిలో..

ఐపీఎల్-2020 సీజన్‌లో అతని ఆటతీరు మెరుగుపడుతుందని ఆశించిన సగటు అభిమానికి నిరాశే కలిగింది. అతని బ్యాటింగ్ శైలిలో దూకుడు కొరవడింది. బౌలర్లపై కౌంటర్ అటాక్ చేయాలనే విషయాన్నే మరిచిపోయినట్టు కనిపిస్తున్నాడు కేదార్ జాదవ్. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆరు మ్యాచ్‌లను ఆడిన కేదార్.. 58 పరుగులు మాత్రమే చేశాడు. అత్యథిక స్కోరు 26. 98.30గా అతని స్ట్రైక్ రేటు నమోదైంది. అతని నుంచి ఇంతకంటే నాణ్యమైన బ్యాటింగ్‌ను ఆశించలేమనే అభిప్రాయానికి వచ్చేశారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు.

2018 నుంచి అతను చేసిన పరుుగులు.. 244

2018 నుంచి అతను చేసిన పరుుగులు.. 244

2018 నుంచి బుధవారం రాత్రి నాటి మ్యాచ్ వరకు మొత్తం 21 మ్యాచ్‌ను కేదార్ జాదవ్ ఆడాడు. 244 పరుగులు చేశాడు. అతను తీసుకున్న రెమ్యునరేషన్ మాత్రం భారీగా ఉంటోంది. ఈ మూడు సీజన్లకు కలిపి కేదార్ తీసుకున్న రెమ్యునరేషన్ 23.4 కోట్ల రూపాయలు. ఈ మొత్తంతో అతను ఆడిన మొత్తం 21 మ్యాచ్‌ల బ్యాటింగ్ సగటును పరిగణనలోకి తీసుకుంటే.. 19.75, స్ట్రైక్ రేటు 99.5గా నమోదవుతోంది. 23.4 కోట్ల రూపాయలను అతని బ్యాటింగ్ సగటుతో లెక్కిస్తే.. ఒక పరుగు విలువ కాస్త అటుఇటుగా 10 లక్షల రూపాయలు పలుకినట్టయింది.

Story first published: Thursday, October 8, 2020, 13:09 [IST]
Other articles published on Oct 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X