IPL 2020: Sunrisers Hyderabad జట్టు బలాలు, బలహీనతలు, ప్లే ఆఫ్స్ అంచనా!!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌)‌ ఏడేళ్లుగా ఆడుతోంది. ఇది ఎనిమిదవ సీజన్. డెక్కన్ ఛార్జర్స్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన తర్వాత 2012లో సన్‌రైజర్స్‌ ఎంట్రీ ఇచ్చింది. 2012 నుంచి ఒకసారి టైటిల్‌.. మరోసారి రన్నరప్‌.. మూడు మార్లు నాలుగో స్థానంలో నిలిచి అద్భుత ప్రదర్శన చేస్తోంది. రెండు సార్లు మాత్రం ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. లీగ్‌లో విజయవంతమైన జట్లలో సన్‌రైజర్స్‌ ఒకటి. భారీ అంచనాలు లేకపోయినా.. పెద్ద స్టార్లు లేకపోయినా సత్తాచాటడం సన్‌రైజర్స్‌ ప్రత్యేకత. పటిష్ట బౌలింగ్ విభాగంతో నెట్టుకొస్తోంది. ఎప్పటిలానే ఈసారి కప్ పట్టాలని సన్‌రైజర్స్‌ చూస్తోంది. ఓసారి ఆ జట్టు బలాలు, బలహీనతలు చూద్దాం.

అతిపెద్ద బలం వార్నర్‌

అతిపెద్ద బలం వార్నర్‌

సన్‌రైజర్స్‌లో అత్యంత కీలక ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌. అటు బ్యాట్స్‌మన్‌గా.. ఇటు కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. వార్నర్ లేని సన్‌రైజర్స్‌ను ఊహించడం కష్టం అంటే.. అతడు ఎంతలా ప్రభావం చూపాడో అర్ధం చేసుకోవచ్చు. 2013లో అరంగేట్రం చేసిన సన్‌రైజర్స్‌ను అతడు 2016లో విజేతగా నిలిపాడు. సన్‌రైజర్స్‌ అతిపెద్ద బలం వార్నర్‌. ప్రతి సీజన్‌లో 500 పైచిలుకు పరుగులు సాధించడం విశేషం. 2015, 2017, 2019లలో అత్యధిక పరుగుల వీరుడు (ఆరెంజ్‌ క్యాప్‌) అతడే. ఈసారి కూడా అలానే ఆడాలని పట్టుదలగా ఉన్నాడు.

విలియమ్సన్ వెన్నెముక

విలియమ్సన్ వెన్నెముక

ఓపెనర్ జానీ బెయిర్‌స్టో కూడా సన్‌రైజర్స్‌కు బలమే. బెయిర్‌స్టో గత ఏడాదిలాగే ఈసారి కూడా సత్తాచాటితే ప్రత్యర్థి జట్లకు కష్టాలు తప్పవు. బెయిర్‌స్టో, వార్నర్ మంచి జోడిగా పేరొందిన విషయం తెలిసిందే. ఇక కేన్‌ విలియమ్సన్ మ్యాచ్ పరిస్థితులను బట్టి గేర్ మారుస్తుంటాడు. మూడో స్థానంలో వస్తూ జట్టుకు వెన్నెముకలా నిలుస్తాడు. మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్, వృద్ధిమాన్‌ సాహా, ప్రియం గార్గ్‌, విరాట్‌ సింగ్‌ రూపంలో దేశీ ఆటగాళ్లు ఉన్నారు. మొహమ్మద్ నబీ, మిచెల్‌ మార్ష్‌ వంటి మంచి ఆల్‌రౌండర్‌లు కూడా ఉన్నారు. హైదరాబాద్ ఆటగాడు బవనక సందీప్‌ ఎలా ఆడుతాడో చూడాలి.

అత్యుత్త బౌలింగ్‌ దళం

అత్యుత్త బౌలింగ్‌ దళం

లీగ్‌లోనే అత్యుత్త బౌలింగ్‌ దళం సన్‌రైజర్స్‌ సొంతం. 140 స్కోరును ఎన్నోసార్లు సన్‌రైజర్స్‌ కాపాడుకుందంటే అది బౌలర్ల వల్లే. భువనేశ్వర్‌ కుమార్, ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌, బాసిల్‌ థంపిలకు తోడు విదేశీ పేసర్లలో మిచెల్‌ మార్ష్‌, బిల్లీ స్టాన్‌లేక్‌ అందుబాటులో ఉన్నారు. ఇక టీ20ల్లో అత్యుత్తమ స్పిన్నర్‌ అయిన రషీద్‌ ఖాన్ ఉండనే ఉన్నాడు. ఈ సీజన్‌కు స్టాన్‌లేక్‌ అందుబాటులోకి రావడంతో బౌలింగ్‌ బెంచ్‌ బలం మరింత పెరిగినట్లే.

విదేశీ ఆటగాళ్లే ఎస్‌ఆర్‌హెచ్‌కు బలహీనత

విదేశీ ఆటగాళ్లే ఎస్‌ఆర్‌హెచ్‌కు బలహీనత

సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ వార్నర్‌, బెయిర్‌స్టో, విలియమ్సన్‌లపైనే ఆధారపడి ఉంది. ఈ ముగ్గురిలో ఎవరైనా గాయపడితే లేదా ఫామ్ కోల్పోతే వారి లోటును భర్తీ చేయగల ఆటగాళ్లు లేరు. ఇప్పటివరకు పాండే, సాహా, శంకర్‌, అభిషేక్‌శర్మల్లో ఎవరూ ఫినిషర్‌ పాత్రను సమర్థంగా పోషించలేకపోయారు. వీరందరూ లీగ్ ఆసాంతం రాణించిన దాఖలు లేవు. అందరూ ఒక్కో మ్యాచులో మాత్రమే మెరుగైన ప్రదర్శన చేయడం సన్‌రైజర్స్‌ బలహీనత. ఎక్కువ మంది ఓవర్‌సీస్‌ ఆటగాళ్లు ఉండటమే ఎస్‌ఆర్‌హెచ్‌కు మరో బలహీనత. తుది జట్టులో నలుగురు మించి విదేశీ ఆటగాళ్లు ఉండకూడదు. ఇక్కడ విదేశీ ఆటగాళ్ల బలంతో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది అతి పెద్ద మైనస్‌.

ప్లేఆఫ్స్‌ అంచనా

ప్లేఆఫ్స్‌ అంచనా

2016లో టైటిల్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. గత మూడు సీజన్లగా కనీసం ప్లేఆఫ్స్‌కు చేరుతూ వస్తూ అభిమానుల ఆశల్ని వమ్ము చేయడం లేదు. ఈ ఏడాది కూడా ప్లేఆఫ్స్‌కు చేరే జట్ల అంచనాలలో కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ కచ్చితంగా ఉంటుంది. డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలో ఈ సీజన్‌ ఐపీఎల్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ ‌గెలవడానికి పూర్తిస్థాయిలో కసరత్తులు చేస్తోంది. హైదరాబాద్ అభిమానులు కూడా అండగా ఉన్నారు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు:

దేశీయ ఆటగాళ్లు: మనీష్‌ పాండే, శ్రీవత్స గోస్వామి, వృద్ధిమాన్‌ సాహా, ప్రియం గార్గ్‌, విరాట్‌ సింగ్‌, అబ్దుల్‌ సమద్‌, విజయ్‌ శంకర్‌, అభిషేక్ ‌శర్మ, బవనక సందీప్‌, సంజయ్‌ యాదవ్‌, భువనేశ్వర్ కుమార్‌, షాబాజ్ నదీమ్‌, ఖలీల్‌ అహ్మద్‌, తంగరసు నటరాజన్‌, బాసిల్ థంపి, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌.

విదేశీ ఆటగాళ్లు: డేవిడ్ వార్నర్‌ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్‌, మొహమ్మద్ నబీ, మిచెల్‌ మార్ష్‌, ఫాబియన్‌ అలెన్‌, రషీద్ ‌ఖాన్‌, బిల్లీ స్టాన్‌లేక్‌.

ప్రపంచ అత్యుత్తమ టీ20 బౌలర్ బుమ్రా.. అతడితో కలిసి ఆడేందుకు ఆసక్తిగా ఉన్నా: ఆసీస్ పేసర్

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, September 16, 2020, 12:18 [IST]
Other articles published on Sep 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X