IPL 2020: సన్‌రైజర్స్ రివ్యూ..వేలంలో మిడిలార్డర్‌పై దృష్టి.. బెయిర్‌స్టోను వదులుకోనుంది!!

హైదరాబాద్: ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి ప్రదర్శన చేసింది. ఈ సీజన్లో తొలి 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు మాత్రమే సాధించిన వార్నర్ సేన.. కీలక దశలో గొప్పగా పుంజుకుంది. చివరి మ్యాచ్‌ల్లో వరుసగా మూడు టాప్ జట్లపై విజయాలు సాధించి ప్లేఆఫ్ చేరింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ బాదడంతో క్వాలిఫైయర్-2కు వెళ్ళింది. అయితే క్వాలిఫైయర్-2లో మిడిలార్డర్ వైఫల్యం కారణంగా ఢిల్లీపై ఓడిపోయిన సన్‌రైజర్స్ ఇంటిబాట పట్టింది. మొత్తానికి వార్నర్ సేన ఆకట్టుకునే ప్రదర్శనతో లీగ్ ముగించింది.

అదొక్కటి పరిష్కారించుకుంటే

అదొక్కటి పరిష్కారించుకుంటే

సెప్టెంబర్ 21న బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ జట్టుకి గాయం దెబ్బ తగిలింది. మిచెల్ మార్ష్ బౌలింగ్ చేస్తూ గాయపడి.. ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. తర్వాత భువనేశ్వర్ కుమార్, విజయ్ శంకర్ సైతం గాయాల బారిన పడి ఇంటికి పయనమయ్యారు. ఇక ఎప్పటిలాగే ఈ సీజన్లోనూ సన్‌రైజర్స్‌ను మిడిలార్డ్ వైఫల్యం ఇబ్బంది పెట్టింది. కేన్ విలియమ్సన్‌ను నాలుగో స్థానంలో ఆడించడంతో ఆరెంజ్ ఆర్మీ మిడిలార్డర్ కష్టాలు కాస్త తగ్గాయి. ఈ సీజన్లో విలియమ్సన్ 45.28 యావరేజ్, 133.75 స్ట్రైక్ రేట్‌తో 317 రన్స్ చేశాడు. కానీ వార్నర్ సేన మిడిలార్డర్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. అదొక్కటి పరిష్కారించుకుంటే ఇక మన జట్టుకు ఎదురుండదు.

స్పార్క్ సరిపోదు

స్పార్క్ సరిపోదు

డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్‌, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, సాహా బ్యాటింగ్ విభాగంలో ఆకట్టుకోగా.. అబ్దుల్ సమద్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ తమలో స్పార్క్ ఉందని నిరూపించారు. అయితే యువ ఆటగాళ్లు మరింత రాణించాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్ విభాగం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 71 యార్కర్లు సంధించిన నటరాజన్.. తన తర్వాత ఎక్కువగా యార్కర్లు సంధించిన బౌలర్ కంటే రెట్టింపు యార్కర్లు విసరడం గమనార్హం. రషీద్ ఖాన్, నటరాజన్, సందీప్ శర్మ, హోల్డర్ ఒక్కొక్కరు పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశారు.

మిడిలార్డర్‌పై దృష్టి

మిడిలార్డర్‌పై దృష్టి

ఐపీఎల్ 2021లో అహ్మదాబాద్ బేస్డ్‌గా మరో కొత్త జట్టు బరిలో దిగనుంది. దీంతో వచ్చే సీజన్ కంటే ముందే ఆటగాళ్ల మెగా వేలం జరగనుంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో మెగా వేలం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగే సన్‌రైజర్స్ లాంటి జట్లు తమకు అవసరం లేని ఆటగాళ్లను రిలీజ్ చేసి.. కొత్తవారిని కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. దీంతో మిడిలార్డర్ సమస్యను పరిష్కరించుకునే అవకాశం సన్‌రైజర్స్ ముందుంది. మెగా వేలంలో ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకొని మరో ఇద్దరు ఆటగాళ్లను ఆర్టీఎం ద్వారా తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది.

బెయిర్‌స్టోను వదులుకోనుంది

బెయిర్‌స్టోను వదులుకోనుంది

గరిష్టంగా నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే తుది జట్టులో బరిలో దిగాలనే నిబంధన కారణంగా సన్‌రైజర్స్ వచ్చే సీజన్లో స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టోను వదులకునే అవకాశం ఉంది. ఈ సీజన్లో వార్నర్, విలియమ్సన్, రషీద్, హోల్డర్ కీలకంగా మారారు. బెయిర్‌స్టో బదులు సాహాను ఓపెనర్‌గా ఆడించడం ఫలితాన్ని ఇచ్చింది. దీంతో బెయిర్‌స్టోను రిలీజ్ చేసి.. భారత బ్యాట్స్‌మెన్ కోసం ప్రయతించే అవకాశం ఉంది. ఫ్యాబియెన్ అలెన్, మహ్మద్ నబీలను రిలీజ్ చేసే అవకాశం ఉంది. మనీష్ పాండే కోసం సన్‌రైజర్స్ రూ.11 కోట్లు వెచ్చించింది. కానీ అతడు తన ధరకు న్యాయం చేయలేకపోతున్నాడు. దీంతో అతణ్ని రిలీజ్ చేసి.. వేలం ద్వారా మళ్లీ తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఖలీల్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ రిలీజ్ చేయొచ్చు.

IPL 2020 : Commentator Felt That SunRisers Hyderabad Had No Potential | SRH Vs DC
వేలానికి ముందు క్లారిటీ

వేలానికి ముందు క్లారిటీ

ఎంత మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోవచ్చు.. ఎంత మందిని రిటైన్ చేసుకోవచ్చు.. క్యాప్డ్ ప్లేయర్లు ఎందరు అనే విషయంలో ఐపీఎల్ 2021 వేలానికి ముందు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వార్నర్, విలియమ్సన్, రషీద్, భువీ, నటరాజన్‌‌, సందీప్ శర్మను అట్టిపెట్టుకొని మిగతా వాళ్లను సన్‌రైజర్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ వేలంలో సురేష్ రైనా లాంటి ఓ ఇద్దరు భారత ఆటగాళ్లు జట్టులో చేర్చుకుంటే తిరుగుండదు.

ఐపీఎల్‌ 2020 కాదు.. ఐపీల్‌ 13వ సీజన్!! టైటిల్ కొట్టడానికి ఈ లెక్క చాలా?: రోహిత్ ‌

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Friday, November 13, 2020, 14:41 [IST]
Other articles published on Nov 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X