న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వార్నర్ సేనకు ఛేజింగ్ అంటే ఎందుకంత వణుకు: ఏ ఒక్క మ్యాచ్‌లోనూ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల

IPL 2020: Sunrisers Hyderabad havent won a single game while chasing this season

దుబాయ్: సాధారణంగా క్రికెట్‌లో టార్గెట్‌ను ఛేదించడానికి ఇష్టపడుతుంటాయి కొన్ని జట్లు. ప్రత్యర్థి ఉంచిన లక్ష్యాన్ని ఛేదించడంలో అసలు సిసలు మజా ఉంటుందని భావిస్తుంటాయి. ఛేజింగ్ చేయడంలో దిట్ట టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఎంతటి భారీ స్కోరును తమ ముందు ఉంచినా.. దాన్ని అందుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఛేజింగ్ చేస్తోన్న ప్రతీసారీ విరాట్ కోహ్లీ వ్యక్తిగతంగా భారీ స్కోర్లను సాధించాడు. అతని అకౌంట్‌లో ఉన్న సెంచరీల్లో చాలామటుకు ఛేజింగ్ ద్వారా వచ్చినవే.

ఛేజింగ్ అంటే వణుకుతోన్న సన రైజర్స్

ఛేజింగ్ అంటే వణుకుతోన్న సన రైజర్స్

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ పరిస్థితి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో ఇప్పటిదాకా ఏ ఒక్క లక్ష్యాన్ని కూడా ఆ జట్టు అందుకోలేకపోయింది. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో వార్నర్ టీమ్ రెండోసారి బ్యాటింగ్‌కు దిగింది. ఆ నాలుగు మ్యాచ్‌లనూ ఓడిపోయింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోలేక చతికిలపడింది. మరో రెండింట్లో హైదరాబాద్ సెట్ చేసిన టార్గెట్‌ను ప్రత్యర్థులు అలవోకగా అందుకున్నాయి. ఇలా ఆరు మ్యాచ్‌లను ప్రత్యర్థులకు ధారదాత్తం చేసింది ఆరెంజ్ ఆర్మీ.

టైగా ముగిసిన మ్యాచ్‌లోనూ..

టైగా ముగిసిన మ్యాచ్‌లోనూ..

ఈ నెల 18వ తేదీన అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో కోల్‌కత నైట్ రైడర్స్ నిర్దేశించిన 163 పరుగులను అందుకునే ప్రయత్నంలో గెలుపు అంచుల దాకా వెళ్లినప్పటికీ.. దాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. రెండుసారి బ్యాటింగ్‌కు దగిన హైదరాబాద్ జట్టు కూడా 163 పరుగులే చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళ్లింది. ఆ మ్యాచ్‌లో పరజాయాన్ని చవి చూసింది. అంతకుముందు- మరో మూడు మ్యాచుల్లో హైదరాబాద్ జట్టు రెండోసారి బ్యాటంగ్‌కు దిగి తగిన మూల్యాన్ని చెల్లించుకుంది. ఏ ఒక్క దాంట్లోనూ గెలుపొందలేకపోయింది.

టోర్నీ ఆరంభం నుంచే..

టోర్నీ ఆరంభం నుంచే..

ఐపీఎల్-2020 సీజన్ ఆరంభంలో తాను ఆడిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన ఓ మోస్తరు టార్గెట్‌ను చేరుకోలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 163 పరుగులను చేయగా.. ఛేజింగ్‌కు దిగిన హైదరాబాద్ టీమ్.. 153 పరుగుల వద్ద ఆగిపోయింది. 19.4 ఓవర్లలో ఆలౌట్ అయింది.

షార్జాలో.. ముంబై ఇండియన్స్‌తో

షార్జాలో.. ముంబై ఇండియన్స్‌తో

షార్జా స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విధించిన 208 పరుగుల భారీ టార్గెట్‌ను వార్నర్ టీమ్ అందుకోలేకపోయింది. చివరికంటా పోరాడింది గానీ. లక్ష్యానికి ఆమడదూరంలో ఆగిపోయింది. 20 ఓవర్లలో 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ మ్యాచ్‌లో 20 ఓవర్ల కోటాను పూర్తిగా ఆడినప్పటికీ.. లక్ష్యం భారీగా ఉండటంతో దాన్ని ఛేదించలేకపోయింది. ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 34 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. దుబాయ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితి. చెన్నై జట్టు 167 పరుగులు చేయగా.. హైదరాబాద్ 147 పరుగుల వద్దే ఆగిపోయింది.

Story first published: Thursday, October 22, 2020, 15:09 [IST]
Other articles published on Oct 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X