న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2014 తర్వాత తొలిసారి డకౌట్.. ఆ బ్యాట్స్‌మన్‌ ఎవరో తెలుసా?

IPL 2020, SRH vs CSK: Faf du Plessis out for a duck for first time since 2014

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే బ్యాట్స్‌మన్‌ ఆట. బ్యాట్స్‌మన్‌ క్రీజులోకి రావడంతోనే బాదుడు మొదలవుతుంది. ఇక భారీ లక్ష్య ఛేదనలో అయితే మొదటి బంతి నుంచే షాట్లు ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలామంది డకౌట్ అవుతుంటారు. కానీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఫాఫ్ డుప్లెసిస్‌ ఐపీఎల్ చరిత్రలో తక్కువ సార్లు డకౌట్ అయ్యాడు. 2014 తర్వాత తొలిసారి డకౌట్ అయ్యాడు. మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖాతా తెరువకుండానే ఫాఫ్ పెవిలియన్ చేరాడు.

మూడో ఓవర్లో వికెట్‌ కీపర్‌ జానీ బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి ఫాఫ్ డుప్లెసిస్ వెనుదిరిగాడు. ఓపెనర్‌ డుప్లెసిస్‌ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌ చేరాడు. మూడో ఓవర్‌లోనే డుప్లెసిని డకౌట్‌ చేసిన సందీప్‌ శర్మ చెన్నైకి ఝలక్‌ ఇచ్చాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో డుప్లెసిస్‌ డకౌట్‌ కావడం మూడోసారి మాత్రమే. 2014 తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ప్రస్తుత సీజన్‌లో అద్భుతంగా రాణిస్తూ చెన్నై తరఫున ఫాఫ్ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సీజన్‌లో ఇప్పటి వరకు 51.16 సగటుతో 307 పరుగులు చేశాడు.

IPL 2020, SRH vs CSK: Faf du Plessis out for a duck for first time since 2014

ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ సాధించిన విజయాల్లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ పాత్ర ఎంతో ఉంది. బ్యాట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే డుప్లెసిస్‌.. అద్భుత ఫీల్డింగ్‌ విన్యాసాలతో కళ్లు చెదిరే క్యాచ్‌లను అందుకున్నాడు. ముఖ్యంగా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అత్యుత్తమ అటతీరును ప్రదర్శిస్తుంటాడు. ఐపీఎల్ 2020లో అయితే చెన్నై తరఫున అద్భుత క్యాచులు పట్టి ఔరా అనిపించాడు. 79 ఐపీఎల్ మ్యాచులలో 2160 రన్స్ చేశాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్ ఓడించింది. అంబటి రాయుడు (41; 34 బంతుల్లో 3×4, 2×6), షేన్ వాట్సన్‌ (42; 38 బంతుల్లో 1×4, 3×6), రవీంద్ర జడేజా (25 నాటౌట్‌; 10 బంతుల్లో 3×4, 1×6) రాణించడంతో మొదట చెన్నై 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ 8 వికెట్లకు 147 పరుగులే చేసి ఓడింది. కేన్ విలియమ్సన్‌ (57; 39 బంతుల్లో 7×4) పోరాడినా ఫలితం లేపోయింది. చెన్నై బౌలర్లు కర్ణ్‌ శర్మ (2/37), డ్వేన్ బ్రావో (2/25) తలో రెండు వికెట్లు తీశారు.

ఎంఎస్‌ ధోనీపై వీరాభిమానం.. విమర్శకులకు మహీ ఫ్యాన్‌ వినూత్న సమాధానం!!ఎంఎస్‌ ధోనీపై వీరాభిమానం.. విమర్శకులకు మహీ ఫ్యాన్‌ వినూత్న సమాధానం!!

Story first published: Wednesday, October 14, 2020, 16:11 [IST]
Other articles published on Oct 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X