న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs RCB: డివిలియర్స్ వీరవిహారం.. ఓడే మ్యాచ్‌లో ఆర్‌సీబీ అద్భుత విజయం!

AB de Villiers blitzkrieg helps Bangalore chase down 178

దుబాయ్: మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్(22 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్స్‌లతో 55 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రాయల్ చాలెంజర్ బెంగళూరుకు అద్భుత విజయాన్నందించాడు. అతని ధాటైన ఇన్నింగ్స్‌తో శనివారం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 7 వికెట్లతో రాజస్థాన్ రాయల్స్‌‌పై గెలుపొందింది. దాదాపు ఓటమి ఖాయామనుకున్న మ్యాచ్‌లో ఏబీడీ మార్క్ పెర్ఫామెన్స్‌ కనబర్చి ఒంటి చేత్తో విజయాన్నందించాడు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 రన్స్ చేసింది. స్టీవ్ స్మిత్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 57 ), రాబిన్ ఊతప్ప (22 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 41) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీయగా క్రిస్ మోరిస్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఆర్‌సీబీ 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 179 పరుగులు చేసి అద్భుత విజయాన్నందుకుంది. ఏబీడీకి తోడుగా విరాట్ కోహ్లీ(32 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 43), దేవదత్ పడిక్కల్( 37 బంతుల్లో 2 ఫోర్లతో 35) రాణించారు. ఈ గెలుపుతో ఆర్‌సీబీ మూడో స్థానంలోకి దూసుకెళ్లగా రాజస్థాన్ తమ ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ సీజన్‌లో రాజస్థాన్‌పై ఆర్‌సీబీ రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచింది.

శుభారంభం దక్కలేదు..

శుభారంభం దక్కలేదు..

ఇక 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ఫించ్(14) శ్రేయాస్ గోపాల్ వేసిన నాలుగో ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరో ఓపెనర్ పడిక్కల్‌తో కలిసి ఇన్నింగ్స్ ‌ను ముందుకు నడిపించాడు. పడిక్కల్ రెండు, కోహ్లీ ఓ బౌండరీ కొట్టడంతో ఆర్‌సీబీ పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. అనంతరం ఈ జోడీ క్విక్ సింగిల్స్‌, డబుల్స్‌కే పరిమితవడంతో స్కోర్ బోర్డు వేగం తగ్గింది.

తేవాటియా సూపర్ క్యాచ్..

తేవాటియా సూపర్ క్యాచ్..

గోపాల్ వేసిన పదో ఓవర్ ఆఖరి బంతికి విరాట్ భారీ సిక్సర్ కొట్టడంతో 10 ఓవర్లలో ఆర్‌సీబీ 77 రన్స్ చేసింది. అనంతరం మరో రెండు ఓవర్లలో కూడా బౌండరీలు రాకపోవడంతో ఈ జోడీపై ఒత్తిడి నెలకొంది. ఈ క్రమంలో రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో కోహ్లీ భారీ సిక్సర్ కొట్టాడు. కానీ ఈ మ్యాచ్‌లో పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమైన పడిక్కల్ ఒత్తిడిలో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. కార్తీక్ త్యాగీ వేసిన 14 ఓవర్ ఫస్ట్ బాల్‌ను కోహ్లీ డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడగా.. తెవాటియా సూపర్ క్యాచ్‌ ఫీట్‌తో ఔరా అనిపించాడు. బౌండరీ రోప్‌పై చాకచక్యంగా బంతిని అందుకున్నాడు. దాంతో మ్యాచ్ రాజస్థాన్ వైపు తిరిగింది.

డి'విలియం'..

డి'విలియం'..

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్, గుర్‌క్రీత్ సింగ్ కుదురుకోవడానికి టైమ్ తీసుకోవడంతో చేజింగ్ రన్ రేట్ అమాంతం పెరిగింది. అయితే ఆర్చర్ వేసిన 16వ ఓవర్‌లో ఏబీడీ సిక్సర్ కొట్టడంతో 10 రన్స్ వచ్చాయి. దాంతో చివరి 24 బంతుల్లో ఆర్‌సీబీ విజయానికి 54 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో డివిలియర్స్ ధాటిగా ఆడుతూ ఆశలు రేకెత్తించాడు. ఉనాద్కత్ వేసిన 19వ ఓవర్‌లో ఏబీడీ హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టగా.. గుర్‌క్రీత్ బౌండరీ బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌తో మ్యాచ్ ఆర్‌సీబీ వైపు మళ్లింది.

ఆఖరి ఓవర్‌లో విజయానికి 10 పరుగులు కావాల్సి ఉండగా.. ఆర్చర్ వేసిన తొలి మూడు బంతులకు 5 పరుగులే రావడంతో ఉత్కంఠతను తలిపించింది. అయితే నాలుగో బంతిని డివిలియర్స్ భారీ ‌సిక్సర్‌గా మలచడంతో ఆర్‌సీబీ విజయం లాంఛనమైంది.

Story first published: Saturday, October 17, 2020, 20:32 [IST]
Other articles published on Oct 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X