న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మన్కడింగ్‌కి బదులు రన్ పెనాల్టీ.. అశ్విన్ వ్యాఖ్యలకు పాంటింగ్ మద్దతు!!

IPL 2020: Ricky Ponting agrees with Ravichandran Ashwin’s idea of introducing run penalty

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 12వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా ఆడిన రవిచంద్రన్ అశ్విన్.. ఓ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని మన్కడింగ్ చేశాడు. అశ్విన్ బంతి విసరక ముందే.. బట్లర్ క్రీజు దాటి చాలా దూరం వెళ్లిపోయాడు. ఇది గమనించిన అశ్విన్ బౌలింగ్‌ని నిలిపివేసి.. బెయిల్స్‌ని పడగొట్టాడు. ఔట్ కోసం అప్పీల్ చేయగా.. థర్డ్ అంపైర్ ఔటిచ్చేశాడు. దాంతో అశ్విన్ క్రీడాస్ఫూర్తి తప్పాడంటూ ఆ సీజన్ మొత్తం పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే తాను మాత్రం క్రికెట్ రూల్స్ ప్రకారమే ఆడానని బదులిచ్చాడు.

మన్కడింగ్ చేయనివ్వను

మన్కడింగ్ చేయనివ్వను

గత ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన ఆర్ అశ్విన్.. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడబోతున్నాడు. దాంతో ఐపీఎల్ 2020 సీజన్‌లో అశ్విన్‌ని మన్కడింగ్ చేయనివ్వనని ఢిల్లీ చీఫ్ కోచ్ రికీ పాంటింగ్ ఇటీవల స్పష్టం చేశాడు. దుబాయ్ వెళ్లిన వెంటనే అశ్విన్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతా అని కూడా ఆసీస్ మాజీ కెప్టెన్ పేర్కొన్నాడు. ఇప్పటికే యూఏఈకి చేరుకున్న పాంటింగ్.. క్వారంటైన్ సైతం పూర్తిచేసుకున్నాడు. ఇక మాన్కడింగ్ విషయంపై తాజాగా అశ్విన్‌తో యూట్యూబ్ ఛాట్‌ షోలో మాట్లాడాడు.

12వ ఏట నుంచే మన్కడింగ్ చేస్తున్నా

12వ ఏట నుంచే మన్కడింగ్ చేస్తున్నా

పాంటింగ్‌తో మన్కడింగ్ విషయమై అశ్విన్ చర్చించాడు. 'నేను 12వ ఏట నుంచే మన్కడింగ్ చేయడం మొదలెట్టా. బంతి వేయకుండానే బ్యాట్స్‌మెన్ క్రీజును దాటడం సహించలేను. ఎందుకంటే.. జూనియర్ స్థాయిలో ఆడినప్పుడు నేను కూడా ఓ బ్యాట్స్‌మన్‌నే. బౌలర్ బంతి విసరక ముందే బ్యాట్స్‌మెన్ అలా ముందుకు వెళ్లడం ద్వారా.. సింగిల్‌‌ని డబుల్‌గా మార్చేందుకు అవకాశం ఉంటుంది. ఇలా మ్యాచ్ మొత్తం చూసుకుంటే కనీసం 10 పరుగులైనా అదనంగా బ్యాటింగ్‌ టీమ్‌కి లభించే అవకాశం ఉంది' అని పాంటింగ్‌కు అశ్విన్ వివరించాడు.

అశ్విన్ వ్యాఖ్యలకు పాంటింగ్ మద్దతు

అశ్విన్ వ్యాఖ్యలకు పాంటింగ్ మద్దతు

క్రీజు వెలుపలికి వెళ్లే బ్యాట్స్‌మెన్‌కి రన్ పెనాల్టీ విధించాలని కూడా అశ్విన్ ప్రతిపాదించాడు. వాస్తవానికి ఈ యూ ట్యూబ్ ఛాట్ షోలో మాట్లాడకముందు వరకూ అశ్విన్ క్రీడాస్ఫూర్తి తప్పాడంటూ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. కానీ అశ్విన్ తన వాదనని బలంగా వినిపించడం ద్వారా రికీ తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. చివరకు అశ్విన్ చేసిన ప్రపోజల్‌కి పాంటింగ్ అంగీకారం తెలిపాడు. బంతిని బౌలర్ విసరక ముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని బ్యాట్స్‌మెన్ 2-3 అడుగులు మందుకు వెళ్లడం ఛీటింగ్ అని, అలా నిబంధనలు అతిక్రమించే బ్యాట్స్‌మెన్‌కి రన్ పెనాల్టీ విధించాలని ప్రతిపాదించాడు.

ఆటగాళ్లతో రికీ సమావేశం

ఆటగాళ్లతో రికీ సమావేశం

ఐపీఎల్ 2020లో భాగంగా యూఏఈలో క్వారంటైన్‌ పూర్తవడంతో చెన్నై సూపర్ కింగ్స్ మినహా ఇతర జట్లన్నీ ప్రాక్టీస్‌ మొదలెట్టాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్ రికీ పాంటింగ్‌ సమక్షంలో ఆ జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. ఆటగాళ్ల నెట్స్‌ సెషన్‌ను పాంటింగ్ దగ్గరుండి మరీ పర్యవేక్షించాడు. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ బృందంతో సమావేశమైన రికీ ఆటగాళ్లతో ముచ్చటించాడు. ఢిల్లీ సీనియర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌, కెప్టెన్ శ్రేయాస్‌ అయ్యర్‌, ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ తదితరలు మంగళవారం నెట్స్‌లో చెమటోడ్చారు.

Serena Williams: క్రిస్‌ ఎవర్ట్‌ రికార్డు బద్దలు.. యుఎస్‌ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన సెరెనా!!

Story first published: Thursday, September 3, 2020, 9:03 [IST]
Other articles published on Sep 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X