IPL 2020: అమ్మో.. బయో బబుల్‌ ఓ పెద్ద నరకం!! బయటకు వెళ్లేందుకు కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టా: స్టార్ పేసర్

దుబాయ్: కరోనా వైరస్ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ బయో సెక్యూర్‌ బబుల్‌ వాతావరణంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. లీగ్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లంతా బయోసెక్యూర్‌లోనే గడపాల్సి ఉంటుంది. ఎవరూ బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే.. క్వారంటైన్‌లోకి పోవాలి. రెండోసారి కూడా అలానే చేస్తే.. కఠిన శిక్షలు అమలు చేయాల్సి ఉంటుంది. ఫ్రీగా ఎంజాయ్ చేసే ఆటగాళ్లు ఇలా బబుల్‌లో ఉండడం కాస్త కష్టమే. అందుకే బబుల్‌ నుంచి బయటపడేందుకు తాను కౌంట్‌డౌన్‌ మొదలెట్టినట్లు ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ పేర్కొన్నాడు.

 కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టా:

కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టా:

తాజాగా బ్రిటీష్‌ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో జోఫ్రా ఆర్చర్ ‌మాట్లాడుతూ... 'ఐపీఎల్ 2020 చివరి అంకానికి చేరుకుంది. నేను ఫ్రీ అయ్యేందుకు కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టా. గత కొన్ని నెలలుగా బయో సెక్యూర్‌ బబుల్‌ అనే నరకంలో ఉంటున్నా. త్వరలోనే అందులోంచి బయటపడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఒక ఏడాది క్యాలెండర్‌లో ఎన్నో మ్యాచ్‌లు ఆడే నేను ఈ ఏడాది మాత్రం రోజుల ఎంత త్వరగా గడుస్తాయా అని ఆలోచిస్తున్నా' అని తెలిపాడు.‌ ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆర్చర్ రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

బబుల్‌లో ఎక్కువ గడిపింది నేనే:

బబుల్‌లో ఎక్కువ గడిపింది నేనే:

'ఏవైనా సిరీస్‌లు ఆడేటప్పుడు బయోసెక్యూర్‌ బబుల్‌తో కేవలం హోటల్‌, మైదానానికి పరిమితం కావాల్సి వస్తుంది. ఇక ఖాళీ స్టేడియాల్లో ఆడడం అనేది నాకు ఏదోలా అనిపిస్తుంది. నాకు తెలిసినంతవరకు బయోబబుల్‌లో అందరికన్నా ఎక్కువగా గడిపింది నేనే అనుకుంటున్నా. కరోనా వల్ల బయోబబుల్‌లో ఉంటున్నా తనకు ఫ్యామిలీ వెంట ఉన్నా.. స్వేచ్చ అనేది మాత్రం దూరమైపోయింది. కొద్ది రోజుల్లో ఐపీఎల్‌ ముగిసిపోతుందిగా.. అందుకే కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టా' అని ఆర్చర్ తెలిపాడు. ఈ సీజన్‌లో రాజస్తాన్‌ తరపున 12 మ్యాచ్‌లాడిన ఆర్చర్‌ 17 వికెట్లతో స్థిరంగా రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు.

వెస్టిండీస్‌తో సిరీస్‌:

వెస్టిండీస్‌తో సిరీస్‌:

ఐపీఎల్‌ ప్రారంభం కాకముందు ఇంగ్లండ్‌ జట్టు వెస్టిండీస్‌తో సిరీస్‌ ఆడిన విషయం తెలిసిందే. ఆ సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్‌ పాల్గొన్నాడు. విండీస్‌తో జరిగిన సిరీస్‌ కూడా బయోసెక్యూర్‌ బబుల్‌ వాతావరణంలోనే జరిగింది. అప్పటినుంచి ఆర్చర్‌ బయోబబుల్‌ సెక్యూర్‌లో గడిపాడు. అయితే బయో బబుల్‌ నిబంధనలు ఉల్లఘించినందుకు ఆర్చర్‌పై రెండో టెస్టులో వేటు కూడా పడింది. ఆ తర్వాత ఐపీఎల్‌లో ఆడేందుకు వచ్చిన ఆర్చర్‌ అదే వాతావరణంలో ఉండడంతో అసహనం వ్యక్తం చేశాడు.

12 మ్యాచులు.. 5 విజయాలు:

12 మ్యాచులు.. 5 విజయాలు:

ఐపీఎల్ 2020లో రాజస్తాన్‌ రాయల్స్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన రాజస్తాన్‌ 5 విజయాలు, ఏడు ఓటములతో పట్టికలో 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు చేరడం కొంచెం కష్టమే అయినా.. మిగిలిన రెండు మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలవడంతో పాటు రన్‌రేట్‌ను కూడా గణనీయంగా మెరుగుపరుచుకోవాలి. అంతేకాదు తనకంటే ముందున్న ఎస్‌ఆర్‌హెచ్‌, కేకేఆర్‌, పంజాబ్‌లు మిగిలిన మ్యాచ్‌లు ఓడిపోతేనే రాజస్తాన్‌కు ప్లేఆఫ్‌ చేరే అవకాశం ఉంటుంది.

'సూర్యకుమార్‌ నైపుణ్యతకు ఎప్పుడో టీమిండియాలో అడుగుపెట్టాల్సింది.. తీవ్ర నిరాశ చెంది ఉంటాడు'

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, October 29, 2020, 19:00 [IST]
Other articles published on Oct 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X