న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs RR: మ్యాచ్‌కు ముందే సూర్యకుమార్‌తో మాట్లాడా.. ఒకటే చెప్పా: రోహిత్

IPL 2020, MI vs RR: Rohit sharma hails Suryakumar Yadav fifty knock
IPL 2020,MI vs RR : Suryakumar Yadav's Shot-Making Was Perfect - Rohit Sharma || Oneindia Telugu

అబుదాబి: రాజస్థాన్ రాయల్స్‌‌ మ్యాచ్‌కు ముందే సూర్యకుమార్ యాదవ్‌తో మాట్లాడానని, నీ ఆటను నువ్ ఆడు అని చెప్పానని ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలిపాడు. ముంబై ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు. మంగళవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆల్‌రౌండ్‌ షో చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (79; 47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించాడు. జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగాడు. కీరన్ పొలార్డ్, అనుకుల్‌లు స్టన్నింగ్ క్యాచ్‌లు పట్టారు.

మ్యాచ్‌ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'మా జట్టులో ఎంతోమంది నాణ్యమైన ఆటగాళ్లున్నారు. తమదైన రోజున మ్యాచ్‌ను మావైపు తిప్పే సత్తా వాళ్ల సొంతం. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లోనూ మేమంతా వంద శాతం శ్రమించాం. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. సూర్యకుమార్‌ యాదవ్‌ మళ్లీ బ్యాటింగ్‌లో రాణించడం సంతోషించాల్సిన విషయం. మ్యాచ్‌కు ముందే అతనితో మాట్లాడాను. బాగా ఆడాలని చెప్పా. అతని షాట్లలో కచ్చితత్వం ఉంటుంది. అతను వినూత్నమైన షాట్లతో అలరిస్తాడు. సూర్యకుమార్‌ ఆఖరి వరకూ బ్యాటింగ్‌ చేయాలని మేమంతా కోరుకున్నాం' అని చెప్పాడు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ... 'మంచి ఇన్నింగ్స్ ఆడాను. ఎందుకంటే గత కొన్ని మ్యాచులలో నేను విఫలమయ్యాను. సమస్యల నుంచి త్వరగా బయటపడటానికి మార్గాలను కనుగొన్నా. చివరకు సక్సెస్ అయ్యా. ఇన్నింగ్స్ చివరి వరకు బ్యాటింగ్ చేయాలనుకున్నా. టాప్ ఆర్డర్ బాధ్యత తీసుకోవడం ఆనందంగా ఉంది. లాక్‌డౌన్ నాకు మేలు చేసింది. నా ఆఫ్-సైడ్ గేమ్‌ను మెరుగుపరుచుకున్నాను. జట్టు గెలవడం నిజంగా సంతృప్తికరంగా ఉంది. బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు' అని తెలిపాడు.

మంగళవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆల్‌రౌండ్‌ షో చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ విజృంభించాడు. ఆపై ముంబై బౌలర్లు కూడా వికెట్లు తీయడంలో పోటీపడ్డారు. బుమ్రా 4.. బౌల్ట్‌, ప్యాటిన్సన్‌ చెరో రెండేసి వికెట్లు తీసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీశారు. దీంతో రోహిత్ సేన 57 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ముంబై అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

MI vs RR: ఐపీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన జస్ప్రీత్ బుమ్రా!!MI vs RR: ఐపీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన జస్ప్రీత్ బుమ్రా!!

Story first published: Wednesday, October 7, 2020, 10:37 [IST]
Other articles published on Oct 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X