న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Kings XI Punjab: మాక్స్‌వెల్ విఫలమవుతున్నా.. అందుకే ఆడిస్తున్నాం: కేఎల్‌ రాహుల్‌

IPL 2020: KL Rahul reveals why Kings XI Punjab support Glenn Maxwell

దుబాయ్: వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ జట్టులోకి వచ్చిన వేళా విశేషమో కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020‌లో వరుస ఓటములతో డీలాపడిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్.. అనూహ్యంగా పుంజుకుంది. హ్యాట్రిక్ విజయాలతో ప్లే ఆఫ్ రేసులోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. మంగళవారం టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్లతో గెలుపొందింది. అయితే ఈ సీజన్లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ వరుసగా విఫలమవుతున్నాడు. అయినా అతడిని పంజాబ్ ప్రతి మ్యాచ్ ఆడిస్తోంది. చివరికి ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాడు.

 వరుసగా విఫలమవుతున్నా:

వరుసగా విఫలమవుతున్నా:

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌ రూ.10.5 కోట్లకు కొనుగోలు చేసింది. పంజాబ్ యాజమాన్యం అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ మ్యాక్స్‌వెల్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. వరుసగా విఫలమవుతూ వస్తున్న మ్యాక్స్‌వెల్‌ను ఇంకా జట్టులో ఎందుకు ఆడిస్తున్నారంటూ కిం‍గ్స్‌ జట్టుపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసించారు. కానీ ఇవేవి పట్టించుకోని కెప్టెన్ కేఎల్ రాహుల్, పంజాబ్ యాజామాన్యం మాక్స్‌వెల్‌ను తుది జట్టులో ఆడిస్తూనే ఉంది. తాజాగా మాక్స్‌వెల్‌ను జట్టులో ఎందుకు ఆడిస్తున్నామనే దానిపై పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ క్లారీటీ ఇచ్చాడు.

 మ్యాచ్‌ విన్నర్లు జట్టుకు అవసరం:

మ్యాచ్‌ విన్నర్లు జట్టుకు అవసరం:

తాజాగా కేఎల్‌ రాహుల్‌ స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ...'గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ ప్రాక్టీస్‌ సమయంలో బాగా ఆడతాడు. బ్యాటింగ్‌ విషయంలో బాగా కష్టపడుతున్నాడు. మ్యాక్సీ మా జట్టులో ఒక అద్భుతమైన టీం మెంబర్‌గా కనిపిస్తాడు. అతను జట్టులో ఉంటే నాకు ఎందుకో మేము మంచి బ్యాలెన్స్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. జట్టులో 11 మంది సరిగ్గా ఆడడం అనేది ఎప్పటికీ జరగదు. ఫీల్డింగ్‌లోనూ అందరూ తమ వైవిధ్యమైన ఆటతీరును చూపలేరు. కానీ మ్యాచ్‌ విన్నర్లు జట్టుకు చాలా అవసరం. ఇది మాక్స్‌వెల్‌లో పుష్కలంగా ఉంది' అని అన్నాడు.

మ్యాక్స్‌వెల్‌ ఫామ్‌లోకి వచ్చాడు:

మ్యాక్స్‌వెల్‌ ఫామ్‌లోకి వచ్చాడు:

'ఈ సీజన్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ విఫలం కావడం నిజమే. కానీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ చేసిన 32 పరుగులు మా జట్టు విజయంలో మరో కీలకపాత్ర అని నా అభిప్రాయం. నా దృష్టిలో మ్యాక్స్‌వెల్‌ ఫామ్‌లోకి వచ్చాడనే అనుకుంటున్నా. ఒకవేళ అదే నిజమైతే మాత్రం అతని నుంచి ఇకపై మంచి ఇన్నింగ్స్‌లు చూసే అవకాశం ఉంటుంది. అతనిపై మా అందరికి ఎంతో నమ్మకం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా బ్యాటింగ్ చేయగలడు. అందుకే అతడిని తుది జట్టులో ఆడిస్తున్నాం' అని రాహుల్‌ చెప్పుకొచ్చాడు.

ఓపెనింగ్‌ బౌలింగ్‌:

ఓపెనింగ్‌ బౌలింగ్‌:

ఢిల్లీతో మ్యాచ్‌లో‌ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌ బౌలింగ్‌ చేయించాడు. ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మ్యాక్సీ కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ 4 ఓవర్లు బౌలింగ్‌ వేసి ఒక వికెట్‌ తీశాడు. ఇక పంజాబ్‌ లక్ష్య ఛేదనలో మ్యాక్సీ 24 బంతుల్లో మూడు ఫోర్లతో 32 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో మ్యాక్స్‌వెల్ అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం.

KKR vs RCB: కోల్‌కతాతో మ్యాచ్.. అరుదైన రికార్డ్‌కి అడుగు దూరంలో కోహ్లీ!!

Story first published: Wednesday, October 21, 2020, 20:21 [IST]
Other articles published on Oct 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X