న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాన్న కోరిక.. అందుకే చివరివరకూ క్రీజ్‌లో ఉన్నా: మన్‌దీప్ భావోద్వేగం

IPL 2020, KKR Vs KXIP: Mandeep Singh recalls Late Fathers Golden Words

షార్జా: షార్జా వేదికగా సోమవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. 150 పరుగుల లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలుండగానే ఛేదించింది. యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌ (51; 29 బంతుల్లో 2×4, 5×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. యువ బ్యాట్స్‌మన్‌ మన్‌దీప్‌ సింగ్‌ (66; 56 బంతుల్లో 8×4, 2×6) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించాడు. టోర్నీలో వరుసగా ఐదో విజయం అందుకొని పంజాబ్ సంచలనం సృష్టించింది. అంతేకాదు పాయింట్ల పట్టికలో పంజాబ్‌ నాలుగో స్థానానికి చేరుకుంది.

గత శుక్రవారం మన్‌దీప్‌ సింగ్ తండ్రి మరణించారు. అతనికి సంఘీభావంగా జట్టులోని ఆటగాళ్లంతా ఆ రోజు ఆడిన మ్యాచులో బ్లాక్ రిబ్బన్స్‌తో బరిలోకి దిగారు. ఇక కోల్‌కతా మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన మన్‌దీప్‌.. అతని నాన్నకు అంకితమిచ్చాడు. ఆకాశం వైపు చూస్తూ నివాళులు అర్పించాడు. మ్యాచ్ అనంతరం మన్‌దీప్‌ సింగ్ మాట్లాడుతూ... 'ఆడిన ప్రతి మ్యాచ్‌లో నాటౌట్‌గా నిలవాలని నాన్న నాతో ఎప్పుడూ చెబుతుండేవారు. అందుకే.. ఈ మ్యాచ్‌లో చివరి వరకూ క్రీజ్‌లో ఉన్నాను. అందుకే ఈ మ్యాచ్ నాకెంతో ప్రత్యేకం. నువ్వెప్పుడైనా 100 లేదా 200 కొడితే.. నాటౌట్‌గా ఉండాలని నాన్న చెబుతుండేవారు' అని తన తండ్రిని గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యాడు.

'కోల్‌కతా మ్యాచ్‌కు ముందు కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో మాట్లాడా. "గత మ్యాచ్‌లో వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నించా. నాకు అలా ఆడితేనే సౌకర్యంగా ఉంది. నా సహజమైన ఆట ఆడితే.. మ్యాచ్ గెలుస్తాననే నమ్మకం నాకుంది" అని అతనితో చెప్పా. రాహుల్ నాకు మద్దతుగా నిలిచాడు. చెప్పిన విధంగా మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉంది. బ్యాటింగ్ చేస్తూ ఉండూ.. చివరి దాకా క్రీజ్‌లో ఉండమని క్రిస్ గేల్‌ నాతో చెప్పాడు. ఇప్పటికీ గేల్ బాగా ఆడుతున్నాడు' అని మన్‌దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.

అంతకుందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సారథి కేఎల్‌ రాహుల్ మాట్లాడుతూ... 'బయో బుడగలో ఉండటం వల్ల కుటుంబ సభ్యులు, ఆప్తులు దగ్గరుండరు. తండ్రి చనిపోయినప్పటికీ మన్‌దీప్‌ సింగ్ చూపిన తెగువ మాలో భావోద్వేగం కలిగించింది. మిగతా కుర్రాళ్లూ అతడి బాధను పంచుకున్నారు. ఈరోజు మ్యాచ్‌ను ముగించి తండ్రికి గొప్పగా నివాళి అర్పించాడు. దుబాయ్‌లో ఉండటం వల్ల తన తండ్రి అంత్యక్రియల్లో మన్‌దీప్‌ వీడియోకాల్‌ ద్వారా భాగమయ్యాడు. ఆ సమయంలో అతడిని చూసి భావోద్వేగం చెందా' అని తెలిపాడు.

'బీసీసీఐ సెలక్టర్లు.. సూర్యకుమార్ రికార్డులు చూడండి!! టీమిండియాకు ఎంపికవ్వాలంటే ఇంకా ఏంచేయాలి''బీసీసీఐ సెలక్టర్లు.. సూర్యకుమార్ రికార్డులు చూడండి!! టీమిండియాకు ఎంపికవ్వాలంటే ఇంకా ఏంచేయాలి'

Story first published: Tuesday, October 27, 2020, 14:53 [IST]
Other articles published on Oct 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X