న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs KXIP: వరుసగా ఐదో విజయం.. అట్టడుగు నుంచి నాలుగో స్థానానికి పంజాబ్‌.. ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరం

IPL 2020: Kings XI Punjab gets fourth spot in points table after 5 consecutive victories

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2020లో ఇక ముందుకెళ్లడం కష్టమే అనుకున్న దశ నుంచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అద్భుతంగా పుంజుకుంది. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ జట్టులోకి వచ్చిన వేళావిశేషం కావొచ్చు అదిరే ప్రదర్శనను పంజాబ్ కొనసాగిస్తోంది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు ఓటములు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న పంజాబ్‌.. తర్వాత వరుసగా ఐదో విజయంతో ప్లేఆఫ్స్‌కు గట్టి పోటీదారుగా మారింది.

IND vs AUS: అభిమానులకు శుభవార్త.. బాక్సింగ్‌ డే టెస్టును నేరుగా చూడొచ్చు!!IND vs AUS: అభిమానులకు శుభవార్త.. బాక్సింగ్‌ డే టెస్టును నేరుగా చూడొచ్చు!!

గేల్‌ జిగేల్:

గేల్‌ జిగేల్:

సోమవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సూపర్ విక్టరీ కొట్టింది. పంజాబ్‌ బౌలర్లు విజృంభించడంతో మొదట కోల్‌కతా 9 వికెట్లకు 149 పరుగులే చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (57; 45 బంతుల్లో 3×4, 4×6), ఇయాన్ మోర్గాన్‌ (40; 25 బంతుల్లో 5×4, 2×6) రాణించారు. మహ్మద్ షమీ మూడు వికెట్లు తీశాడు. మన్‌దీప్‌ సింగ్‌ (66 నాటౌట్‌; 56 బంతుల్లో 8×4, 2×6), క్రిస్‌ గేల్‌ (51; 29 బంతుల్లో 2×4, 5×6) చెలరేగడంతో లక్ష్యాన్ని పంజాబ్‌ 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

నాలుగో స్థానం కోసంరసవత్తర పోరు:

నాలుగో స్థానం కోసంరసవత్తర పోరు:

కోల్‌కతాపై విజయం సాధించిన పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఇరు జట్లు 12 మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు సాధించినప్పటికీ.. నెట్ రన్ రేట్ అంతరంతో కోల్‌కతాను పంజాబ్ వెనక్కి నెట్టింది. ప్లేఆఫ్ రేసులో నాలుగో స్థానం కోసం జరుగుతున్న పోరులో ఇప్పటి వరకూ కోల్‌కతా ముందుండగా.. సోమవారం జరిగిన మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా పంజాబ్ ప్లేఆఫ్స్‌ రేసులో ముందుకెళ్లింది. కోల్‌కతా, పంజాబ్ జట్లలో ఒకటే నాలుగో స్థానం దక్కించుకోనుంది.

ముంబై@1:

ముంబై@1:

పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో ఉంది. ముంబై ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. 14 పాయింట్లే ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 10 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ ఆరో స్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్ ఏడో స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ 8వ స్థానంలో ఉన్నాయి. రాజస్థాన్, సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్నా.. ముందుకెళ్లడం కష్టమే. చెన్నై ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా రాహుల్:

ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా రాహుల్:

12 మ్యాచ్‌ల్లో 595 రన్స్ చేసిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ (471), బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ (415) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. 11 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీసిన ఢిల్లీ పేసర్ కగిసో రబాడ పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. 12 మ్యాచ్‌‌ల్లో 20 వికెట్లు తీసిన షమీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 17 వికెట్లతో జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Story first published: Tuesday, October 27, 2020, 8:31 [IST]
Other articles published on Oct 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X