న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ ఎప్పుడూ అలానే చేస్తుంటావ్.. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం: పాంటింగ్!! అసలు ట్విస్ట్ ఇక్కడే

IPL 2020: Iceland cricket use MS Dhonis example to troll Ricky Ponting over Mankad

హైదరాబాద్: గత ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌)లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్ అయిన రవిచంద్రన్‌ అశ్విన్‌ చేసిన 'మన్కడింగ్‌' పెద్ద దుమారమే లేపింది. మన్కడింగ్‌ ద్వారా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను రనౌట్‌ చేశాడు. అశ్విన్ బంతి విసరక ముందే నాన్‌ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బట్లర్.. క్రీజు వెలుపలికి వెళ్లాడు. దీంతో బౌలింగ్‌ ఆపిన అశ్విన్.. నాన్‌స్ట్రక్ ఎండ్‌లోని బెయిల్స్‌ని ఎగరగొట్టాడు. అప్పుడు అశ్విన్‌‌ తీరుపై కొందరు అండగా నిలవగా.. మరికొందరు క్రీడాస్ఫూర్తి తప్పాడంటూ విమర్శలు గుప్పించారు. అయితే తాను నిబంధనల ప్రకారమే చేశానని అతడు ఒకే మాటపై నిలబడ్డాడు.

మన్కడింగ్‌ చేయనివ్వను:

మన్కడింగ్‌ చేయనివ్వను:

గతేడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న ఆర్ అశ్విన్..‌ ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్.. ఈ ఏడాది అశ్విన్‌ని మన్కడింగ్‌ చేయనీయనని లీగ్ ఆరంభానికి ముందే చెప్పాడు. అంతేకాదు అతనితో ప్రత్యేకంగా మాట్లాడాడు. అయితే అశ్విన్ చెప్పిన వివరణతో ఏకీభవించిన రికీ.. మన్కడింగ్‌ చేయకుండా పరుగులు పెనాల్టీ వేయాలని ఐసీసీకి సూచించాడు. ఇదిలాఉంటే.. పాంటింగ్ ఎఫెక్ట్ ఏమో లేక గతేడాది జరిగిన రచ్చ కారణంగానో కానీ అశ్విన్ ఈ సారి మన్కడింగ్ చేయలేదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్ ఆరోన్ ఫించ్‌కు అశ్విన్ అదిరిపోయే ఝలక్ ఇచ్చాడు.

వార్నింగ్‌తో వదిలేసిన అశ్విన్:

బెంగళూరు మ్యాచులో ఆరోన్ ఫించ్‌ని మన్కడింగ్‌ చేసే అవకాశం లభించినా.. ఆర్ అశ్విన్ వార్నింగ్‌తో వదిలేశాడు. అశ్విన్ బంతి విసరక ముందే ఫించ్.. క్రీజు వదిలి చాలా దూరం వెళ్లిపోయాడు. దాంతో అతడి వైపు కోపంగా చూసిన అశ్విన్.. ఫస్ట్ వార్నింగ్ అనేలా సైగ చేసి ఊరుకున్నాడు. ఈ సన్నివేశం చూసిన ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ మైదానం బయట నవ్వుతూ కనిపించాడు. మ్యాచ్ తర్వాత అశ్విన్ ఓ పోస్ట్ చేశాడు. 'ఐపీఎల్ 2020లో ఫస్ట్, ఫైనల్ వార్నింగ్ ఇదే. ఆ తర్వాత నన్ను నిందించొద్దు' అని రాసుకొచ్చాడు.

 ధోనీ.. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం:

ధోనీ.. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం:

అశ్విన్ వార్నింగ్‌ ఇచ్చిన విషయంపై ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు స్పందించింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్టంపింగ్ చేస్తున్న ఓ ఫొటోని షేర్ చేసి.. ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్‌ను సరదాగా ట్రోల్ చేసింది. ఫొటోలో బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్‌ను మహీ స్టంపౌట్ చేస్తున్నాడు. 'ఎంఎస్ ధోనీ.. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. మహీ ఎప్పుడూ అలానే చేస్తుంటాడు. బ్యాట్స్‌మెన్ క్రీజ్ వదిలి కొద్దిగానే బయటకు వచ్చాడు. కానీ అతడు అవేం పట్టించుకోలేదు. ధోనీ బ్యాట్స్‌మెన్‌కు వార్నింగ్ ఇచ్చి.. అతడు బ్యాటింగ్ కొనసాగించేలా చూడాలి' అని ట్వీట్ చేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చింది. ఆ వ్యాఖ్యలు రికీ అన్నట్టు పేర్కొంది.

 పాంటింగ్‌ను ప్రశ్నించించిన ఐస్‌లాండ్ క్రికెట్:

పాంటింగ్‌ను ప్రశ్నించించిన ఐస్‌లాండ్ క్రికెట్:

ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు చేసిన ట్వీట్‌లో ఎక్కడా కూడా మన్కడింగ్ ప్రస్తావన తేలేదు. కానీ క్రీజ్ దాటి బయటకొచ్చిన వాళ్లను ఔట్ చేయడం తప్పెలా అవుతుందని.. రికీ పాంటింగ్‌ను ఎదురు ప్రశ్నించింది. అంతేకాదు పాంటింగ్ తీరుతో విబేధించింది. క్రికెట్‌ నియమావళి 41.16 ప్రకారం నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ క్రీజు వదిలి ముందుకు వెళితే.. ఆ సమయంలో అతడిని బౌలర్‌ రనౌట్‌ చేసే విధానాన్ని మన్కడింగ్‌ అంటారు. అయితే దీన్ని1947-48 ఆస్ట్రేలియా పర్యటనలో తొలిసారిగా భారత దిగ్గజ బౌలర్‌ వినూ మన్కడ్‌ చేయడంతో ఆయన పేరుమీదుగా మన్కడింగ్‌ ఔట్‌గా నిబంధనల్లో చేర్చారు.

స్వితోలినాకు షాక్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన పొదరోస్కా!!

Story first published: Wednesday, October 7, 2020, 8:06 [IST]
Other articles published on Oct 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X