న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020 Final: 'నా అంచనా ప్రకారం ముంబై ట్రోఫీ గెలుస్తుంది.. కానీ అలా జరగకూడదు'

IPL 2020 Final: Virender Sehwag says I expect Mumbai Indians win IPL trophy but that should not happen

ఢిల్లీ: యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19న ప్రారంభమైన ఐపీఎల్ 2020 ఈరోజు జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఐపీఎల్ కప్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఫైనల్ మ్యాచ్ వారం మధ్యలో జరుగుతోంది. గతంలో 11 ఫైనల్స్ ఆదివారం జరగ్గా.. 2011లో మాత్రం శనివారం నిర్వహించారు. ఇక మరికొద్ది సేపట్లో మెగా ఫైట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఫైనల్ మ్యాచ్‌పై తన విశ్లేషణ చెప్పాడు.

సెహ్వాగ్‌ జోస్యం

సెహ్వాగ్‌ జోస్యం

టోర్నీ ఆరంభం నుంచి వీరేంద్ర సెహ్వాగ్‌.. 'వీరూకి బైతక్‌' ద్వారా తన విశ్లేషణ అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచుల్లో సెహ్వాగ్‌ చెప్పిన జట్లే దాదాపు విజయం సాధించాయి. అందరిలాగే తాను కూడా ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. అయితే ఈసారి ఛాంపియన్‌ ఎవరనేది మాత్రం ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసే వరకూ వేచి చూడాల్సిందే అని వీరూ చమత్కరించాడు. ఇక టాస్‌ గెలిచిన జట్టు ఏం తీసుకోవాలి, ఎలాంటి మ్యాచ్‌ ప్లాన్‌ అమలు చేయాలి అనే విషయాల్లో జట్లకు తనదైన శైలిలో సలహాలిచ్చాడు.

 టాస్‌ గెలవాలని అయ్యర్‌ ఆ దేవుణ్ని వేడుకోవాలి

టాస్‌ గెలవాలని అయ్యర్‌ ఆ దేవుణ్ని వేడుకోవాలి

'ఫైనల్ చేరిన ఢిల్లీకి ఇది ఒక కొత్త అనుభవం. కొత్తగా ప్రేమలో పడ్డ యువకుడికి ఎలా ఉంటుందో.. ఢిల్లీకి ఈ ఫైనల్‌ మ్యాచ్ అలాంటిదే. ఒకవేళ టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ తీసుకోవాలి. ఎందుకంటే ముంబై బ్యాటింగ్‌ ఆర్డర్‌కు గురించి మనకు తెలిసిందే. వాళ్లు మొదటి బ్యాటింగ్‌ చేస్తే 200లాక్ పైగా పరుగులు చేస్తారు. కాబట్టి టాస్‌ గెలిస్తే కెప్టెన్‌ శ్రేయాస్ అయ్యర్‌ తీసుకునే నిర్ణయం కీలకం.

టాస్‌ గెలవాలని అయ్యర్‌ ఆ దేవుణ్ని వేడుకోవాలి. ఢిల్లీకి ధావన్‌, స్టోయినీస్‌ అదిరిపోయే అరంభం ఇవ్వాలి. బ్యాట్స్‌మెన్‌ను బయపెట్టే బౌలర్లు బుమ్రా, బౌల్ట్‌ ముంబైలో ఉన్నారు. కానీ ధావన్‌ ఉన్న ఫామ్‌లో వాళ్ల మంత్రం పనిచేసే అవకాశం తక్కువే. ధావన్‌తో ఢిల్లీకి ఓపెనింగ్‌ సమస్య పూర్తిగా సమసిపోయింది. మిడిల్‌ ఆర్డర్‌ ఒక్కటే ఇబ్బందిగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో హెట్‌మైయెర్‌ ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. అయ్యర్‌, పంత్‌ పరుగులు చేయాలి. బౌలర్లు రాణించాలి' అని సెహ్వాగ్ అన్నాడు.

ముంబైలో ఆ రెండు జోడీలు కీలకం

ముంబైలో ఆ రెండు జోడీలు కీలకం

'ముంబై గురించి మాట్లాడాలంటే.. ఈ జట్టులో రెండు జోడీలు కీలకం. అవి పాండ్యా-పొలార్డ్‌, బుమ్రా-బౌల్ట్‌. ఈ రెండు జోడీలుముంబైని అలవోకగా ఫైనల్‌కు చేర్చాయి. ఈ సీజన్‌లో వడాపావ్‌ రోహిత్‌ ఎలాగూ ఫామ్‌లో లేడు. అయినా అది జట్టుకు పెద్ద సమస్యే కాదు. ఓపెనింగ్‌లో పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ ఉన్నాడు. ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టింది అతనే. మ్యాచ్‌లో పొలార్డ్‌, పాండ్యా ఇన్నింగ్స్‌ కీలకం.

ఇప్పటి వరకూ వాళ్లిద్దరూ కలిసి 85 బంతులు ఎదుర్కొని 229 స్ట్రైక్‌రేట్‌తో 195 పరుగులు చేశారు. మూడు బంతులకో బౌండరీ కొట్టారు. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్‌ ఇద్దరూ కలిసి ముంబైని బలంగా తయారుచేశారు. ఈ మ్యాచ్‌లో రబాడ, బుమ్రా మధ్య పోటీ ప్రధానం' అని వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

నా అంచనా నిజం కాకూడదు

నా అంచనా నిజం కాకూడదు

'ఈ మ్యాచ్‌లో ఢిల్లీపై విజయం సాధించి ముంబై మరోసారి ట్రోఫీని ముద్దాడుతుందని నా అభిప్రాయం. కానీ నా అంచనా నిజం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచి కొత్త ఛాంపియన్‌గా అవతరించాలి. అదే లీగ్‌కు మంచింది' అని ఢిల్లీ మాజీ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో ఢిల్లీతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఘన విజయాలు సాధించింది. లీగ్‌ దశలో రెండు మ్యాచ్‌లు నెగ్గి, తొలి క్వాలిఫయర్‌లోనూ అయ్యర్ సేనని చిత్తు చేసింది.

ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన కెప్టెన్.. తృటిలో సెంచరీ మిస్.. బ్యాట్ విసిరేసిన స్టార్ పేసర్!!

Story first published: Tuesday, November 10, 2020, 16:35 [IST]
Other articles published on Nov 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X