న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Chennai Super Kingsకు భారీ షాక్.. ఫామ్ బ్యాట్స్‌మన్‌కు గాయం?!!

IPL 2020: Faf du Plessis spotted with ice-pack ahead of CSK’s match against KKR

దుబాయ్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు షేన్ వాట్సన్‌ (53 బంతుల్లో 83 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫాఫ్ డుప్లెసిస్‌ (53 బంతుల్లో 87 నాటౌట్‌; 11 ఫోర్లు, ఒక సిక్సర్‌) అదరగొట్టడంతో ధోనీసేన 17.4 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 181 పరుగులు చేసింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత విక్టరీ కొట్టడంతో చెన్నై జట్టులో ఆనందం వెల్లువిరిసింది. అయితే చెన్నైకి భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది.

డుప్లెసిస్‌కు గాయం?

డుప్లెసిస్‌కు గాయం?

ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బాగా ఆడుతున్న 'ఒకేఒక్కడు' ఫాఫ్ డుప్లెసిస్. చెన్నై ఆడిన ఐదు మ్యాచుల్లో ఫాఫ్ అద్భుత ప్రదర్శన చేశాడు. నిలకడగా రాణిస్తూ వరుసగా 58, 72, 43, 22, 87 రన్స్ చేశాడు. ఇందులో రెండు నాటౌట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకూ 282 రన్స్ చేసిన డుప్లెసిస్.. కేఎల్ రాహుల్ (302) తర్వాతి స్థానంలో ఉన్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న డుప్లెసిస్‌కు గాయం అయినట్టు తెలుస్తోంది. పంజాబ్‌తో మ్యాచ్ తర్వాత చెన్నై విడుదల చేసిన ఓ వీడియోలో డుప్లెసిస్ మోకాలికి ఐస్ బ్యాగ్ పెట్టుకొని నడుస్తూ కనిపించాడు.

గాయం తీవ్రమైతే

గాయం తీవ్రమైతే

చెన్నై విడుదల చేసిన ఓ వీడియోలో ఫాఫ్ డుప్లెసిస్ మరీ ఇబ్బంది పడుతున్నట్లుగా మాత్రం కనిపించలేదు. అయితే చెన్నై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అతడికి అయిన గాయం చిన్నదే అని అర్ధమవుతోంది. ఒక వేళ డుప్లెసిస్ గాయం తీవ్రమైతే మాత్రం చెన్నై‌పై తీవ్ర ప్రభావం ఉండనుంది. ఎందుకంటే ఈ సీజన్లో డుపెస్లిస్ అద్భుతంగా రాణిస్తున్నాడు. చెన్నై బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోగా ఫాఫ్ ఫిట్‌నెస్‌ సాధిస్తే.. చెన్నైకి పెద్ద తలనొప్పి తగ్గనుంది. అంబటి రాయుడు, షేన్ వాట్సన్‌ తలో హాఫ్ సెంచరీ చేసినా.. నిలకడగా ఆడలేకపోతున్నారు. దీంతో చెన్నై డుపెస్లిస్‌పైనే ఆశలు పెట్టుకుంది.

హోరాహోరీగా తలపడ్డాయి

హోరాహోరీగా తలపడ్డాయి

చెన్నై, పంజాబ్‌ ఆదివారం రాత్రి తలపడ్డాయి. రెండు జట్లకూ ఈ మ్యాచ్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఎందుకంటే.. అప్పటికే నాలుగు మ్యాచులాడి మూడింట్లో ఓడిపోయాయి. అందుకే హోరాహోరీగా తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ మొదట 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (63), మయాంక్‌ అగర్వాల్‌ (26), నికోలస్ పూరన్‌ (33) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో పంజాబ్‌ బౌలింగ్‌ను చెన్నై ఓపెనర్లు ఆడుకున్నారు. వికెట్లేమీ నష్టపోకుండా 17.4 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించింది.

Sunrisers Hyderabad: భువనేశ్వర్ స్థానంలో తెలుగు బౌలర్‌కు ఛాన్స్.. ఎవరో తెలుసా?

Story first published: Tuesday, October 6, 2020, 16:35 [IST]
Other articles published on Oct 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X