న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇది జరగాలి..!

IPL 2020:Do Chennai Super Kings have Playoff Chances,Here is the statistical report
IPL 2020 : Chennai Super Kings Still Have Playoff Chances, Here Is The Statistical Scenario

దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్‌లోనే అత్యంత పేలవమైన ప్రదర్శన ఇచ్చింది మాత్రం అక్టోబర్ 23న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే. ఇంత చెత్తగా చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ ఆడలేదని సోషల్ మీడియాలో ఆ జట్టు అభిమానులు బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడుసార్లు ఐపీఎల్ టోర్నీ విజేతగా నిలిచిన ధోనీ సేనకు ఏమైందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్లే ఆఫ్స్‌కు దాదాపుగా దూరమైన సీఎస్‌కే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మళ్లీ రేసులోకి వచ్చే ఛాన్స్ లేదు. ఇంతకీ ధోనీసేనకు ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఏమేరకు ఉన్నాయి...?

 చెన్నై జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు

చెన్నై జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు

ఐపీఎల్ 13వ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు అత్యంత చేదు అనుభవాలను మిగిల్చింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలో దిగిన ధోనీ సేన ఇప్పుడు ప్లే ఆఫ్ చేరుకునే అవకాశాలు కూడా దాదాపు మూసుకుపోయాయి. గత మూడు మ్యాచులు ధోనీ సేనకు డూ ఆర్ డై సిచ్యువేషన్‌ను క్రియేట్ చేశాయి. అయినప్పటికీ మూడింటిలో ఒక్కటి కూడా గెలవలేక పోయింది. దీంతో ఆడిన 11 మ్యాచుల్లో మూడు మ్యాచులు ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా ప్లే ఆఫ్స్‌కు చేరే ఛాన్స్ ఉందా..?

 మిగతా జట్ల ప్రదర్శనపై చెన్నై భవిత్యం

మిగతా జట్ల ప్రదర్శనపై చెన్నై భవిత్యం

చెన్నై సూపర్‌కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరే దారులు దాదాపుగా మూసుకుపోయినప్పటికీ కొన్ని గణాంకాల్లో మార్పులు వస్తే అవకాశాలుంటాయి. ఇక వచ్చే గేమ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ధోనీ సేన తలపడనుంది. అయితే మిగతా జట్ల ప్రదర్శనపైనే చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఇక సూపర్ కింగ్స్ టాప్‌ 4కు చేరాలంటే రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌ రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌లతో ఆడే మ్యాచుల్లో తప్పనిసరిగా విజయం సాధించాలి. అది కూడా ఇతర జట్ల కంటే మెరుగైన రన్‌రేట్‌‌తో ధోనీ సేన విజయం సాధించాల్సి ఉంటుంది.

 గణాంకాలు ఎలా మారాలి..?

గణాంకాలు ఎలా మారాలి..?

ఇదిలా ఉంటే ముంబై మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఆడే మిగతా మ్యాచుల్లో విజయం సాధించి 18 లేదా 22 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలవాలి. ఇక బెంగళూరు జట్టు మూడో స్థానంలో 16-20 పాయింట్లతో ఉండాలి. చెన్నైతో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోయి సన్‌రైజర్స్‌పై గెలవాల్సి ఉంటుంది. ఇలా జరిగితే ముంబై - బెంగళూరు, ఢిల్లీ -బెంగళూరు, ముంబై- ఢిల్లీల మధ్య జరిగే మ్యాచుల ఫలితాలతో చెన్నై జట్టుకు పని ఉండదు. ఐపీఎల్ 2020 ప్లే ఆఫ్ ఆశలు సజీవంగానే ఉంటాయి.

 ఈక్వేషన్స్ ఏం చెబుతున్నాయి..?

ఈక్వేషన్స్ ఏం చెబుతున్నాయి..?

ఇక రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాదు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ జట్టులను పరిశీలిస్తే ఈ మూడు జట్లు ఒక మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ మూడు జట్లు పాయింట్ల పట్టికలో రాజస్థాన్ జట్టు 7వ స్థానం, సన్‌రైజర్స్ జట్టు 5వ స్థానం, పంజాబ్ జట్టు 6వ స్థానంలో ఉన్నాయి. వీటన్నిటికీ 8 పాయింట్లు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కో మ్యాచ్ గెలిస్తే 10 పాయింట్లతో ఉంటాయి. దీంతో రాజస్థాన్ రాయల్స్ తక్కువ నెట్ రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు ఉండవు. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ మరో మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్ల వస్తాయి. ఇక ప్రస్తుతం కోల్‌కతాకు 10 పాయింట్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌పై నెగ్గి పంజాబ్ మరియు ఢిల్లీ జట్లపై ఓడితే ఐదవ స్థానంకు కోల్‌కతా పరిమితమవుతుంది.

మొత్తానికి పైన చెప్పిన ఈక్వేషన్స్ వర్కౌట్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలున్నాయి. కానీ ఇదంతా నిజమవ్వాలంటే తప్పకుండా ఏదో అద్భుతం జరగాలి.

Story first published: Saturday, October 24, 2020, 11:35 [IST]
Other articles published on Oct 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X