న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: ముంబైకి ధావల్ కులకర్ణి, రాజస్థాన్‌కు ఎవిన్ లూయిస్!

IPL 2020 Auction : Evin Lewis Traded To Rajasthan, Dhawal Kulkarni To Mumbai Indians || Oneindia
IPL 2020: Dhawal Kulkarni moves to Mumbai Indians; Evin Lewis traded to Rajasthan Royals

హైదరాబాద్: ముంబై క్రికెటర్ ధావల్ కులకర్ణి తిరిగి తన సొంత ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కి వచ్చాడు. ఆటగాళ్ల బదిలీలకు నవంబర్ 14ని చివరి గడువు తేదీగా ప్రకటించడంతో ఫ్రాంచైజీలు విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకున్నాయి. ఇందులో భాగంగా వచ్చే సీజన్‌లో ధావల్ కులకర్ణి ముంబైకి ఆడనున్నాడు.

ఆటగాళ్ల ట్రేడింగ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి ముంబై ఇండియన్స్ ధావల్ కులకర్ణిని సొంతం చేసుకుంది. ఐపీఎల్ ఆరంభ్ సీజన్ 2008 నుంచి 2013 వరకు ధావల్ కులకర్ణి ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, 2014 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ధావల్ కులకర్ణిని రాజస్థాన్ సొంతం చేసుకుంది.

ఇండోర్ టెస్టులో మెరిసిన షమీ: తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150 ఆలౌట్ఇండోర్ టెస్టులో మెరిసిన షమీ: తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150 ఆలౌట్

ఐపీఎల్ 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన కులకర్ణి 55.83 యావరేజితో 6 వికెట్లు పడగొట్టాడు. ఇక, ముంబై ఇండియన్స్ తరుపున 33 మ్యాచ్‌లు ఆడిన ధావల్ కులకర్ణి 36 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ మొత్తంగా చూస్తే 27.95 యావరేజతో 90 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ధావల్ కులకర్ణికి బదులుగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ వెస్టిండిస్ ఆటగాడు ఎవిన్ లూయిస్‌ను తీసుకుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు కర్ణాటక ఆల్ రౌండర్ కృష్ణప్ప గౌతమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడనున్నట్లు తెలుస్తోంది. కృష్ణప్ప గౌతమ్‌ను ఐపీఎల్ 2018 సీజన్ వేలంలో కనీస ధర రూ.20 లక్షలుగా ఉన్నప్పటికీ రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 6.2 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

స్వదేశంలో అత్యంత వేగంగా 250 వికెట్లు: ముత్తయ్య ప్రపంచ రికార్డుని సమం చేసిన అశ్విన్స్వదేశంలో అత్యంత వేగంగా 250 వికెట్లు: ముత్తయ్య ప్రపంచ రికార్డుని సమం చేసిన అశ్విన్

2018 సీజన్‌లో రాజస్థాన్ తరుపున 15 మ్యాచ్‌లు ఆడిన గౌతమ్ గత సీజన్‌లో కేవలం ఏడు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. గత రెండు సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున అతడు రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నప్పటికీ ఫ్రాంఛైజీ యాజమాన్యం అతడిని వదులుకునేందుకు సిద్ధమైంది.

Story first published: Thursday, November 14, 2019, 18:54 [IST]
Other articles published on Nov 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X