న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సీఎస్‌కే నుండి మురళీ విజయ్‌కి ఉద్వాసన.. లిస్టులో జాదవ్, రాయుడు?

IPL Auction 2020 : 3 Indian Players Who Could Be Released By Chennai Super Kings
IPL 2020: CSK might release Murali Vijay, Kedar Jadhav, Karn Sharma ahead of the auction

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్‌కు ఇప్పటినుండే రంగం సిద్దమవుతోంది. 2020 వేలం కోల్‌కతాలో డిసెంబర్ 19న ఉండటంతో ఫ్రాంచైజీలు విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకున్నారు. ఆటగాళ్ల బదిలీలకు ఈ నెల 14న చివరి గడువు. ఇప్పటికే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మారుతున్న విషయం తెలిసిందే. ఈ సారి ఆటగాళ్ల విషయంలో ఫ్రాంచైజీలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్టార్ ఆటగాళ్లను సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు.

రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ ప్లాన్ ఏంటో తెలుసా.. తెలిస్తే షాక్ అవుతారు!!రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ ప్లాన్ ఏంటో తెలుసా.. తెలిస్తే షాక్ అవుతారు!!

విజయ్‌కి ఉద్వాసన:

విజయ్‌కి ఉద్వాసన:

గత రెండేళ్లుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మురళీ విజయ్‌ వచ్చే సీజన్‌కు జట్టులో ఉండకపోవచ్చు. వచ్చే నెలలో జరుగనున్న ఐపీఎల్‌ వేలంలో భాగంగా సీఎస్‌కే విడుదల చేసే ఆటగాళ్లలో మురళీ విజయ్‌ ముందు వరుసలో ఉన్నట్లు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. గత రెండు సీజన్లుగా విజయ్‌కి చెన్నై రెండు కోట్ల జీతం చెల్లిస్తోంది. 2018,19 సీజన్లలో మూడు మ్యాచ్‌లు ఆడిన విజయ్‌.. కేవలం 76 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో విజయ్‌ను రిలీజ్‌ చేసేందుకు సీఎస్‌కే రంగం సిద్ధం చేసిందట.

కరణ్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌లకు గుడ్‌ బై:

కరణ్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌లకు గుడ్‌ బై:

కరణ్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌లను కూడా రిలీజ్‌ చేయడానికి సీఎస్‌కే సిద్ధమైనట్లు సమాచారం. గత రెండు సీజన్లలో లెగ్‌ స్పిన్నర్‌ కరణ్‌ శర్మ ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదు వికెట్లను మాత్రమే తీశాడు. బౌలింగ్‌ ఎకానమీ రేట్‌ కూడా బాలేదు. గత రెండు సీజన్లలో 23 మ్యాచ్‌లు ఆడిన శార్దూల్‌ ఠాకూర్ 24 వికెట్లు మాత్రమే తీశాడు. కరణ్‌ శర్మకు రూ. 5 కోట్లు, శార్దూల్‌కు రూ. 2 కోట్లకు పైగా చెల్లిస్తున్నారు. ఠాకూర్‌, కరణ్‌ ప్రదర్శనలపై అసంతృప్తిగా ఉన్న సీఎస్‌కే రిలీజ్‌ చేయడానికి సిద్ధంగా ఉంది.

 జాదవ్, రాయుడులకు చోటు కష్టమే:

జాదవ్, రాయుడులకు చోటు కష్టమే:

సీఎస్‌కేలో కీలక ఆటగాళ్లు కేదార్ జాదవ్, అంబటి రాయుడులను కూడా రిలీజ్‌ చేయడానికి ప్లాన్ చేస్తోందని సమాచారం. ప్రపంచకప్‌లో పూర్తిగా విఫలమమై ఇప్పటికే భారత జట్టులో చోటు కోల్పోయిన జాదవ్.. సీఎస్‌కేలో కూడా చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇతనికి రూ .7.80 కోట్లు చెల్లిస్తోంది. గత సీజన్‌లో పరుగులు చేయడంలో ఆకట్టుకోలేకపోయిన రాయుడును కూడా వదులుకోనుందని సమాచారం. ఒక వేళ ఈ ఐదుగురుని సీఎస్‌కే రిలీజ్‌ చేస్తే.. వీరు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే.

లిస్టులో డేవిడ్ మిల్లెర్, మార్టిన్ గుప్టిల్‌:

లిస్టులో డేవిడ్ మిల్లెర్, మార్టిన్ గుప్టిల్‌:

సన్‌రైజర్స్ హైదరాబాద్ మార్టిన్ గుప్టిల్‌ను వదులుకోనుంది. బాసిల్ తంపి, బిల్లీ స్టాన్లేక్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ కూడా ఈ జాబితాలో ఉన్నారు. స్టువర్ట్ బిన్నీ, అష్టన్ టర్నర్, ధావల్ కులకర్ణి, రాబిన్ ఉతప్ప, పియూష్ చావ్లా, రింకు సింగ్, జో డెన్లీ, క్రిస్ మోరిస్, కోలిన్ మున్రో, జయంత్ యాదవ్, అన్మోల్‌ప్రెట్ సింగ్, ఎవిన్ లూయిస్, మిచెల్ మెక్‌క్లెనాఘన్, డేవిడ్ మిల్లెర్, అంకిత్ రాజ్‌పూట్, హార్డస్ విల్జోయెన్ వంటి వారు తమ తమ జట్ల నుండి విదేలయ్యే అవకాశం ఉంది.

Story first published: Wednesday, November 13, 2019, 16:14 [IST]
Other articles published on Nov 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X