న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB: హేడెన్‌ను గుర్తుచేస్తున్నాడు.. అతడు భారత క్రికెట్ భవిష్యత్తు: మోరిస్‌

IPL 2020: Chris Morris says Devdutt Padikkal is the future of Indian cricket

దుబాయ్: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌పై ఆ జట్టు ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆరంభపు ఐపీఎల్‌ సీజన్‌లోనే అదరగొడుతున్న పడిక్కల్‌ అచ్చం ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ మాథ్యూ హేడెన్‌ తరహాలోనే ఆడుతున్నాడన్నాడు. పడిక్కల్‌ భారత క్రికెట్ భవిష్యత్తు అని మోరిస్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2020లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత టోర్నమెంట్‌లో బెంగళూరు తరఫున రెండవ అత్యధిక పరుగులు చేసింది పడిక్కలే.

హేడెన్‌ను పడిక్కల్‌ గుర్తుచేస్తున్నాడు:

హేడెన్‌ను పడిక్కల్‌ గుర్తుచేస్తున్నాడు:

శుక్రవారం క్రిస్‌ మోరిస్‌ మాట్లాడుతూ... 'అరోన్‌ ఫించ్‌తో కలిసి దేవదత్‌ పడిక్కల్‌ ఓపెనింగ్‌ పంచుకోవడం నిజంగా గొప్పగా అనిపిస్తోంది. పడిక్కల్‌ ఆటకు మాథ్యూ హేడెన్‌ ఆటకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. సైజ్‌ పరంగా హేడెన్‌ భారీకాయుడు. అతడి చెస్ట్‌ చాలా పెద్దది. ఇందులో పడిక్కల్‌కు పోలిక లేదు (నవ్వుతూ). అయితే పడిక్కల్‌ గొప్ప అథ్లెట్. బ్యాటింగ్‌ టెక్నిక్‌ పరంగా హేడెన్‌కు పడిక్కల్‌కు చాలా దగ్గర పోలికలున్నాయి. అతడిని చూస్తే అతనిలో ఏదో ఉంది అనిపిస్తోంది. పడిక్కల్ భారత క్రికెట్ భవిష్యత్తు' అని అన్నాడు.

సైనీ మంచి బౌలర్:

సైనీ మంచి బౌలర్:

పేసర్లు నవదీప్‌ సైనీ, మహ్మద్‌ సిరాజ్‌లపై కూడా క్రిస్ మోరిస్‌ ప్రశంసలు కురిపించాడు. యువ పేసర్లు తమ జట్టులో ఉండటమే కాకుండా వారికి వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టుకు విజయాల్ని అందిస్తున్నారన్నాడు. గతంలో సైనీ ఢిల్లీ జట్టులో ఉన్నప్పుడు తాను కూడా అదే ఫ్రాంచైజీలో ఉన్నానన్నాడు. అప్పుడే అతనొక మంచి బౌలర్‌ అనే విషయాన్ని గ్రహించానన్నాడు. ఆ టాల్‌ బౌలర్‌ బౌలింగ్‌ రాకెట్లు దూసుకుపోతున్నట్లు ఉంటుందన్నాడు.

సిరాజ్‌ బౌలింగ్‌ అసాధారణం:

సిరాజ్‌ బౌలింగ్‌ అసాధారణం:

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌ అసాధారణమని దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిష్ మోరిస్‌ పేర్కొన్నాడు. 'సిరాజ్ తన సీమ్ మెరుగుపరుచుకోవడానికి డేల్ స్టెయిన్‌తో కలిసి కష్టపడ్డాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో సిరాజ్‌ బౌలింగ్‌ అసాధారణం. భారత ఫాస్ట్ బౌలర్లు బాగా కష్టపడతారు' అని మోరిస్‌ చెప్పాడు. వాషింగ్టన్ సుందర్ ఇప్పుడు బాగా బౌలింగ్ చేస్తున్నాడని, అతను 13 సంవత్సరాల వయస్సు నుండి ఐపీఎల్ ఆడుతున్నట్లు అనిపిస్తుందన్నాడు.

RR vs SRH: ఆమెను వెకేషన్ మధ్యలో వదిలేసి యూఏఈ వచ్చా.. కష్టంగా ఉంది: సన్‌రైజర్స్ ప్లేయర్

Story first published: Saturday, October 24, 2020, 7:54 [IST]
Other articles published on Oct 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X