న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌కు షేన్ వాట్సన్‌ వీడ్కోలు.. ఇక యెల్లో జెర్సీలో చూడలేం!!

IPL 2020: Chennai Super Kings opener Shane Watson retirement from IPL
IPL 2020 : Shane Watson Announced His Retirement From All Forms Of Cricket On Monday

దుబాయ్: నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు. ఆదివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో చెన్నై గెలిచిన అనంతరం వాట్సన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. చెన్నై సహచర ఆటగాళ్లతో మాట్లాడుతూ.. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతానని చెప్పాడట. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని సహచరులతో షేర్‌ చేసుకునే క్రమంలో వాట్సన్‌ ఉద్వేగానికి గురయ్యాడట.

వాట్సన్‌ ఉద్వేగం

వాట్సన్‌ ఉద్వేగం

'చివరి మ్యాచ్‌ తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో క్రికెట్‌కు‌ వీడ్కోలు పలుకుతున్న విషయాన్ని చెబుతూనే షేన్‌ వాట్సన్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. చెన్నై ఫ్రాంఛైజీ తరఫున ఆడటాన్ని గొప్ప గౌరవంగా భావించాడు' అని వాట్సన్‌ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆసీస్‌ సీనియర్‌ ఓపెనర్‌ వాట్సన్‌ నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. ఇక గతేడాది ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే.

ముందు నుంచే వార్తలు:

ముందు నుంచే వార్తలు:

ఈ ఐపీఎల్‌ సీజన్‌ తర్వాత 39 ఏళ్ల షేన్ వాట్సన్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని ముందు నుంచి వార్తలు వచ్చాయి. ఇదే వాట్సన్‌కు 'చివరి ఆట' అనే మాట ఎక్కుగా వినిపించింది. చివరకు అదే జరిగింది. 2018 ఐపీఎల్‌ వేలంలో వాట్సన్‌ను చెన్నై కొనుగోలు చేసింది. 2018 ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఆదివారం కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ సీఎస్‌కేకు చివరిది. ఈ సీజన్‌లో లీగ్‌ దశ నుంచి సీఎస్‌కే ఆట ముగించడంతో ఇక ఆ జట్టు ఆటగాళ్లు తమ తమ స్వస్థలాలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు.

ఫైనల్‌ మ్యాచ్‌లో సెంచరీ:

ఫైనల్‌ మ్యాచ్‌లో సెంచరీ:

ఐపీఎల్ 2020లో షేన్ వాట్సన్‌ 11 మ్యాచ్‌లు ఆడి 299 పరుగులు చేశాడు. ఇందుదలో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 2018 నుంచి సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న వాట్సన్‌.. ఆ ఏడాది టైటిల్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో సెంచరీ సాధించి సీఎస్‌కే టైటిల్‌ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. గతేడాది ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్‌లో వాట్సన్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. కానీ సీఎస్‌కే పరుగు తేడాతో టైటిల్‌ను కోల్పోయింది.

145 ఐపీఎల్‌ మ్యాచ్‌లు:

145 ఐపీఎల్‌ మ్యాచ్‌లు:

చెన్నై తరఫున ఆడటానికి ముందు వాట్సన్‌ రాజస్తాన్‌ రాయల్స్‌, రాయల్స్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు ఆడాడు. మొత్తంగా 145 ఐపీఎల్‌ మ్యాచ్‌లను వాట్సన్‌ ఆడాడు. అందులో సీఎస్‌కే తరఫున 43 మ్యాచులు ఆడాడు. వాట్సన్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో 3,874 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 21 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఆల్‌రౌండర్‌ అయిన వాట్సన్‌ 92 ఐపీఎల్‌ వికెట్లను కూడా పడగొట్టాడు.

రుతురాజ్‌.. యువ విరాట్ కోహ్లీలా కనిపిస్తున్నాడు: డుప్లెసిస్‌

Story first published: Monday, November 2, 2020, 18:43 [IST]
Other articles published on Nov 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X