న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇచ్చిన ప్రామిస్‌ను నిలబెట్టుకున్నాడు: వార్నర్‌పై లక్ష్మణ్ ప్రశంసల వర్షం

IPL 2019: VVS Laxman reveals that David Warner had promised SRH coach Moody 500 runs this season

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ చెప్పాడు. ఏడాది నిషేధం తర్వాత ఈ సీజన్‌లో అరంగేట్రం చేసిన డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున డేవిడ్ వార్నర్ మొత్తం 12 మ్యాచ్‌లాడి 692 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. వరల్డ్ కప్ సన్నాహాకాల్లో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం సొంత దేశమైన ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించిన విజయాల్లో వార్నర్ పాత్ర ఎంతో కీలకం.

వార్నర్‌పై లక్ష్మణ్ ప్రశంసల వర్షం

వార్నర్‌పై లక్ష్మణ్ ప్రశంసల వర్షం

ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కాలమ్‌లో ఈ సీజన్ ఆరంభానికి ముందే వార్నర్ 500లకు పైగా పరుగులు చేస్తానని కోచ్ టామ్ మూడీకి హామీ ఇచ్చాడని, ఇచ్చిన మాటను అతడు నిలబెట్టుకున్నాడని లక్ష్మణ్ అన్నాడు.

500లకు పైగా పరుగులు చేస్తానని మెసేజ్ చేశాడు

500లకు పైగా పరుగులు చేస్తానని మెసేజ్ చేశాడు

"మేము హైదరాబాద్‌లో ఓ షూటింగ్ మధ్యలో ఉండగా డేవీ(వార్నర్), ఈ సీజన్‌లో 500లకు పైగా పరుగులు చేస్తానని టామ్‌ మూడీకి మెసేజ్ చేశాడు. ఇది మాకు ఉత్సాహాన్ని కలిగించింది. గోల్స్‌ను సెట్ చేసుకుని మరీ, డేవిడ్ వార్నర్ లక్ష్యాలను చేధిస్తుంటే చూసేందుకు అద్భుతంగా ఉంది" అని లక్ష్మణ్ తెలిపాడు.

వార్నర్ గాయంతో ఉన్న దాన్ని లెక్క చేయకుండా

వార్నర్ గాయంతో ఉన్న దాన్ని లెక్క చేయకుండా

వార్నర్ గాయంతో ఉన్న దాన్ని లెక్క చేయకుండా బ్యాటింగ్ చేశాడని ఆయన పేర్కొన్నారు. టోర్నీలో భాగంగా సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ తన ఆఖరి మ్యాచ్‌‌ని సోమవారం ఉప్పల్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆడాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ 81 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను గెలిపించి ఈ సీజన్‌కు ముగింపు పలికాడు.

ఆందోళనకి గురయ్యాం

ఆందోళనకి గురయ్యాం

"వార్నర్ గురించి ఏం చెప్పాలి. గత ఏడాది అతను చాలా విమర్శలు ఎదురుకున్నాడు. ఈ సీజన్‌‌కి ముందు అతను మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. దీంతో మేం కాస్త ఆందోళనకి గురయ్యాం. కానీ, అతను అద్భుతంగా రాణించాడు. అతనికి చాలా మనోధైర్యం ఉంది. అతని భార్య కాన్‌డైస్ అతనికి గొప్ప మద్దతు ఇచ్చింది" అని లక్ష్మణ్ తెలిపారు.

12 మ్యాచులాడి 692 పరుగులు

12 మ్యాచులాడి 692 పరుగులు

ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ మొత్తం 12 మ్యాచులాడి 692 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వరల్డ్‌కప్ సన్నాహాకాల్లో భాగంగా డేవిడ్ వార్నర్ సొంత దేశం ఆస్ట్రేలియాకు పయనం కానున్నాడు. ఈ సీజన్‌లోనూ వార్నర్ 692 పరుగులు సాధించడంతో ఆడిన మూడు సీజన్లలోనూ వరుసగా 600పైగా పరుగులు చేసి ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు.

Story first published: Wednesday, May 1, 2019, 18:43 [IST]
Other articles published on May 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X