ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గకపోవడానికి కారణమిదే!

IPL 2019 : Virat Kohli Reveals Why Royal Challengers Bangalore Could Never Lift The Trophy

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గకపోవడానికి గల కారణాన్ని ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. ఇప్పటివరకు పదకొండు ఐపీఎల్ సీజన్లు ముగిశాయి. అయితే, ఒక్కసారి కూడా బెంగళూరు జట్టు టైటిల్ విజేతగా నిలవలేదు.

ధోని లేకపోవడం వల్లే ఆస్ట్రేలియా చేతిలో కోహ్లీసేన ఓటమి: పాంటింగ్

తాజాగా బెంగుళూరులో బెంగళూరు జట్టు మొబైల్‌ యాప్‌ లాంచ్‌ సందర్భంగా కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు ఐపీఎల్‌ టైటిల్‌ విజేతగా నిలవకపోవడంపై స్పందించాడు. "ఇక్కడ కూర్చొని మా అదృష్టం బాలేదు అని చెప్పడం సరైందికాదు. మనం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవతలి జట్టు సరైన నిర్ణయాలు తీసుకుంటే.. మనమే ఓడిపోతాం" అని కోహ్లీ అన్నాడు.

స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ

స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ

జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఓడిపోతున్నామని కోహ్లీ అన్నాడు. "మేం అద్భుతంగా ఆడినప్పటికీ సరైన సందర్భాల్లో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఓడిపోతాం. ప్రశాంతంగా ఉండే జట్లు ఒత్తిడిని జయించి బాగా రాణిస్తాయి. అలాంటి జట్లే విజయం సాధిస్తాయి" అని కోహ్లీ తెలిపాడు.

ఆర్సీబీతో అనుబంధంపై

ఆర్సీబీతో అనుబంధంపై

ఇక, ఆర్సీబీతో తనకున్న అనుబంధాన్ని కోహ్లీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరుపున కాకుండా మరే ఇతర జట్టులో ఆడటం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని విరాట్ కోహ్లీ తేల్చి చెప్పాడు. "ఆర్సీబీతో కలిసి ఆడటం నాకెంతో ప్రత్యేకం. ఐపీఎల్‌లో ఈ జట్టు నుంచి విడిపోవడం లేదా ఇతర జట్లలో ఆడటం నేను ఊహించుకోలేను" అని కోహ్లీ అన్నాడు.

2008 ఆరంభ సీజన్ నుంచి ఆర్సీబీతోనే

2008 ఆరంభ సీజన్ నుంచి ఆర్సీబీతోనే

2008లో ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు యాజమాన్యం కోహ్లీని వేలంలో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి తాజా సీజన్ వరకు కోహ్లీ అదే జట్టుతో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్‌ మొదటి మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది.

మార్చి 23న టోర్నీ ప్రారంభం

ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంధి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేయడం విశేషం. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగతా షెడ్యూల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, March 18, 2019, 15:06 [IST]
Other articles published on Mar 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X