న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2019: '3 వికెట్లు తీయడానికి కారణం అదే'

IPL 2019 : Rajasthan Royals Pacer Varun Aaron On Three Wicket Won Over Kolkata Knight Riders
IPL 2019: Varun Aaron on Rajasthans Three-Wicket Win Over Kolkata

హైదరాబాద్: కౌంటీల్లో ఆడటం ద్వారానే తన ఇన్‌ స్వింగర్లు మరింత పదునెక్కాయని రాజస్థాన్‌ రాయల్స్‌ పేస్ బౌలర్ వరుణ్‌ ఆరోన్‌ అన్నాడు. టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ ఆరోన్ తన అద్భుతమైన బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

వరుణ్ ఆరోన్‌దే కీలకపాత్ర

వరుణ్ ఆరోన్‌దే కీలకపాత్ర

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 175 పరుగులకే కట్టడి చేయడంలో వరుణ్ ఆరోన్‌దే కీలకపాత్ర. ఓపెనర్లు క్రిస్‌లిన్‌‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చగా... ఆ తర్వాత శుభ్‌మన్‌ గిల్‌ (14) అద్భుతమైన ఇన్‌స్వింగర్లతో పెవిలియన్‌ చేర్చాడు. అనంతరం కేకేఆర్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది.

3 వికెట్ల తేడాతో విజయం సాధించిన రాజస్థాన్

3 వికెట్ల తేడాతో విజయం సాధించిన రాజస్థాన్

దీంతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించి తన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్ అనంతరం వరుణ్ ఆరోన్ మాట్లాడుతూ "నేనింతకు ముందూ ఇన్‌స్వింగ్‌ చేసేవాడిని. కౌంటీల్లో ఆడిన తర్వాత మరింత బాగా చేస్తున్నా. గతంలో ఎక్కువగా ఔట్‌ స్వింగర్లపై ఆధారపడే వాడిని" అని చెప్పుకొచ్చాడు.

కౌంటీల్లో ఆడటం వల్లే

కౌంటీల్లో ఆడటం వల్లే

"గతేడాది ఐపీఎల్‌ ఆడకపోవడంతో కౌంటీల్లో ఆడా. అక్కడి స్వింగ్‌కు అనుకూలం. బంతిని స్వింగ్‌ చేసేందుకు బౌలర్లకు సాయపడతాయి. అందుకే ఇన్‌స్వింగ్‌ ఎక్కువ ప్రాక్టీస్ చేశా. ఈ ఐపీఎల్‌ తర్వాత నాకు కొంత సమయం దొరికింది. మళ్లీ కౌంటీల్లో ఆడతా. ఈ సీజన్‌ మధ్యలో వెళ్తా కాబట్టి ఏ జట్టుకు ఆడతానో తెలీదు" అని ఆరోన్ తెలిపాడు.

Story first published: Saturday, April 27, 2019, 12:10 [IST]
Other articles published on Apr 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X