న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై, హైదరాబాద్ ప్లేఆఫ్‌కు చేరేనా?: RCB vs RR మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక ఇలా!

IPL 2019 Updated Points Table, Orange Cap and Purple Cap holders after the match RCB vs RR

హైదరాబాద్: చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం రాత్రి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఇరు జట్ల చెరో పాయింటు లభించింది. దీంతో ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో.. మ్యాచ్‌ రద్దవడంతో రాజస్థాన్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిచి, మిగతా మ్యాచ్‌ల ఫలితాలు కలిసొస్తే ముందంజ వేయడానికి అవకాశముండేది. రాజస్థాన్ మిగిలిన ఒక మ్యాచ్‌లలో గెలిచినా 13 పాయింట్లు అవుతాయి.

13 పాయింట్లతో ప్లేఆఫ్‌ చేరడం అసాధ్యం. దీంతో రాజస్థాన్‌ 'ప్లేఆఫ్‌' ఆశలు దాదాపుగా మూసుకుపోయాయి. ఐపీఎల్ టోర్నీలో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాజ్ జరిగిన అనంతరం పాయింట్ల పట్టిక, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్‌లను ఎవరు సొంతం చేసుకున్నారో ఒక్కసారి పరిశీలిద్దాం...

పాయింట్ల పట్టిక

పాయింట్ల పట్టిక

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తులను ఖాయం చేసుకున్నాయి. ఈ రెండు జట్లు చేయాల్సిందల్లా ఒకటే మిగతా రెండు లీగ్ మ్యాచ్‌ల్లో గెలిచి తమ అగ్ర స్థానాలను పదిలం చేసుకోవడమే. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం రాజస్థాన్ అవకాశాలను దెబ్బతీసింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలిచి, మిగతా మ్యాచ్‌ల ఫలితాలు కలిసొస్తే ముందంజ వేయడానికి అవకాశముండేది. రాజస్థాన్ మిగిలిన ఒక మ్యాచ్‌లలో గెలిచినా 13 పాయింట్లు అవుతాయి. 13 పాయింట్లతో ప్లేఆఫ్‌ చేరడం అసాధ్యం.

అరెంజ్ క్యాప్

అరెంజ్ క్యాప్

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసే ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్‌ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వద్ద ఉంది. ఈ సీజన్‌లో 692 పరుగులతో వార్నర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వరల్డ్ కప్ సన్నాహాకాల్లో భాగంగా వార్నర్ ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకోవడంతో అతడు చేసిన పరుగులను అధిగమించే అవకాశం ఉంది. ఆ తర్వాతి స్థానంలో పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ (520) పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో 500 పరుగులు చేసిన తొలి భారత ఆటగాడు కేఎల్ రాహులే. కోల్‌కతాకు చెందిన ఆండ్రీ రస్సెల్ 11 ఇన్నింగ్స్‌ల్లో 486 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

పర్పుల్ క్యాప్

పర్పుల్ క్యాప్

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి ఇచ్చే పర్పుల్ క్యాప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కగిసో రబాడ వద్ద ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన కగిసో రబాడ 25 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో భాగంగా బుధవారం చెపాక్ వేదికగా చెన్నై, ఢిల్లీ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రబాడ మరికొన్ని వికెట్లు తీస్తే మరింత మెరుగవుతాడు. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన శ్రేయాస్ గోపాల్ (13 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు)తో ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Wednesday, May 1, 2019, 17:25 [IST]
Other articles published on May 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X