న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వచ్చే ఐపీఎల్‌లో ఢిల్లీ తరపున ఆడనున్న ధావన్

 IPL 2019 Transfer: Shikhar Dhawan now linked with Delhi Daredevils; deal with Kings XI Punjab fails

హైదరాబాద్: వచ్చే ఏడాది ఐపీఎల్‌లో శిఖర్‌ ధవన్‌ ఏ జట్టుకు ఆడనున్నాడనే సస్పెన్స్‌‌కు తెరవీడింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడైన ధవన్‌ను తీసుకునేందుకు తొలుత ముంబై, ఆపై పంజాబ్‌ ఆసక్తి చూపించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ధావన్‌ను ఇప్పుడు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ సొంతం చేసేసుకుంది. శిఖర్‌ను కొనుగోలు చేయనున్నట్టు పంజాబ్‌ మేనేజ్‌మెంట్‌ బీసీసీఐకి సమాచారం ఇచ్చినా.. డీల్‌ కుదరకపోవడంతో ఆఖరి నిమిషంలో ఆగిపోయిందని తెలిసింది.

 రూ.5.2 కోట్లకే అట్టిపెట్టుకునేందుకు సన్‌రైజర్స్

రూ.5.2 కోట్లకే అట్టిపెట్టుకునేందుకు సన్‌రైజర్స్

గత సీజన్‌లో ధవన్‌ను రూ.5.2 కోట్లకు తీసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మరోమారు అదే ధరకు అట్టిపెట్టుకునేందుకు ఆసక్తి చూపింది. మిగతా ఫ్రాంచైజీల నుంచి సరైన ధర రాకపోతే తమ జట్టులోనే ఉంచుకుంటామని సన్‌రైజర్స్ ప్రతినిధి పేర్కొన్నారు.

ధవన్‌తోపాటు కరుణ్‌ నాయర్‌ను తీసుకోవాలని

ధవన్‌తోపాటు కరుణ్‌ నాయర్‌ను తీసుకోవాలని

మరో కోటి రూపాయలు ఎక్కువకు ధవన్‌ను కొనుగోలు చేయడంతోపాటు కరుణ్‌ నాయర్‌ను తీసుకోవాలని పంజాబ్‌ బేరసారాలు కొనసాగించింది. కానీ, ఢిల్లీ అంతకంటే ఎక్కువ బిడ్‌ వేసిందని సమాచారం. ఇలా ఆఖరి నిమిషంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్..పంజాబ్ కంటే ఎక్కువ మొత్తంలో వెచ్చించేందుకు మొగ్గుచూపడంతో పోటీ రసవత్తరంగా మారింది.

ఢిల్లీ ముందడుగేయడంతో పక్కకు తప్పుకున్న పంజాబ్

ఢిల్లీ ముందడుగేయడంతో పక్కకు తప్పుకున్న పంజాబ్

తమ టాపార్డర్ బ్యాటింగ్‌ను మరింత మెరుగుపర్చుకునేందుకు ఢిల్లీ ఫ్రాంచైజీ ముందడుగేయడంతో పంజాబ్ పక్కకు తప్పుకుంది. ఇందులో భాగంగానే ధవన్‌పై ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధమైనట్లు ముంబై మిర్రర్ ప్రత్యేక కథనంగా ప్రచురించింది.

గడిచిన సీజన్‌లో డేర్‌డెవిల్స్ ఇలా ముగించింది

గడిచిన సీజన్‌లో డేర్‌డెవిల్స్ ఇలా ముగించింది

ఐపీఎల్ 2018 సీజన్‌లో ఢిల్లీ కేవలం 10 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే కొన్ని మ్యాచ్‌ల తర్వాత కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న గంభీర్‌కు.. మామూలు ఆటగాడిగానూ అవకాశం ఇవ్వలేదు. ప్రధాన ఆటగాళ్లయిన రబడ, క్రిస్‌ మోరిస్‌లకు గాయాలు కావడంతో పాటు కొందరు ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేశారు. దీంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ వరుస వైఫల్యాలు చవిచూడాల్సి వచ్చింది.

Story first published: Monday, October 29, 2018, 12:05 [IST]
Other articles published on Oct 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X