న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా జోన్స్

IPL 2019 : Rajasthan Royals Appoint England cricketer As Bowling Coach | Oneindia Telugu
 IPL 2019: Steffan Jones appointed as fast bowling coach of Rajasthan Royals

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్ వేలానికి ముహుర్తం దగ్గర పడుతుండటంతో ఫ్రాంచైజీలు అందుకు సన్నద్ధమయ్యాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 12వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా స్టీఫెన్ జోన్స్‌ను నియమించింది. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీ ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది.

<strong>స్టేడియం అవతల పడింది..: రషీద్‌ హెలికాప్టర్ షాట్ చూశారా? (వీడియో)</strong>స్టేడియం అవతల పడింది..: రషీద్‌ హెలికాప్టర్ షాట్ చూశారా? (వీడియో)

తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఫాస్ట్ బౌలర్‌గా సేవలందించిన స్టీఫెనన్ జోన్స్, ఇంగ్లాండ్ కౌంటీల్లో అద్భుతమైన రికార్డుని కలిగి ఉన్నాడు. గతేడాది బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ జట్టు తరుపున జోన్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. బ్రాడ్, క్రిస్టియన్‌ లాంటి బౌలర్లు సైతం జోన్స్ కోచింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

గతేడాది బిగ్‌బాష్ సీజన్‌‌లో ఒకానొక సందర్భంలో బ్రాడ్ మాట్లాడుతూ తాను కలిసి పనిచేసిన బౌలింగ్ కోచ్‌ల్లో స్టీఫెన్ జోన్స్ ఒకడని కితాబిచ్చాడు. 1997లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌ను ఆరంభించిన స్టీపెన్ జోన్స్ సోమర్సెట్, నార్తంప్టన్‌షైర్, డెర్బీ షైర్, కెంట్ లాంటి జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.

తన కెరీర్‌లో మొత్తం 148 మ్యాచ్‌లాడిన జోన్స్ 36.87 యావరేజితో 387 వికెట్లు తీశాడు. ఒక మ్యాచ్‌లో 10 వికెట్లను ఒకసారి ఐదు వికెట్లను పదిసార్లు తీశాడు. ఇంగ్లాండ్ కౌంటీల్లో డెర్బీషైర్, సోమర్సెట్ జట్లకు జోన్స్ కోచ్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం స్టీఫెన్ జోన్స్ సోమర్సెట్‌లోని వెల్లింగ్టన్ స్కూల్‌లో స్పోర్ట్స్ ఫెర్పామెన్స్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

అంతేకాదు సర్రే జట్టుకు పార్ట్ టైమ్ స్కౌట్‌గా కూడా ఉన్నారు. ప్రఖ్యాత లాఫ్‌బోర్గ్ యూనివర్సిటీ నుంచి స్పోర్ట్ అండ్ ఎక్సర్‌సైజ్ సైన్స్‌ విభాగం నుంచి స్టీఫెన్ జోన్స్ డిగ్రీ పట్టా పొందారు. దీంతో పాటు కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి పీజీసీఈ డిగ్రీని పొందారు.

Story first published: Friday, November 30, 2018, 13:45 [IST]
Other articles published on Nov 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X