న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: సొంతగడ్డపై సన్‌రైజర్స్ తొలి మ్యాచ్: బోణీ కొట్టేనా?

 IPL 2019: SRH vs RR: Live Updates: Sunrisers, Rajasthan Royals eye maiden win

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతగడ్డపై తొలి మ్యాచ్‌కి సిద్ధమైంది. టోర్నీలో భాగంగా శుక్రవారం నగరంలోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌పై భారీ స్కోరు చేసినా రైజర్స్‌ విజయం సాధించలేకపోయింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

సొంత ప్రేక్షకుల మధ్య మ్యాచ్‌ జరుగనుండటంతో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఫేవరెట్‌గా కనబడుతోంది. తొలి మ్యాచ్‌లోనే మెరుపు హాఫ్ సెంచరీతో బాదిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. గాయంతో కోల్‌కతా మ్యాచ్‌కి దూరమైన రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

తొలి మ్యాచ్‌లో వార్నర్ హాఫ్ సెంచరీ

తొలి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ (85) హాఫ్ సెంచరీ సాధించగా.. విజయ్ శంకర్ (40) సత్తాచాటాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 19.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కోల్‌కతా జట్టులో ఆండ్రీ రసెల్ (49 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి మ్యాచ్‌ని దూరం చేశాడు.

బౌలింగ్‌ వైఫల్యంతోనే

గత మ్యాచ్‌లో బౌలింగ్‌ వైఫల్యంతోనే హైదరాబాద్‌ మ్యాచ్‌ను చేజార్చుకుంది. ప్రధాన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ సహా సిద్ధార్థ్‌ కౌల్, సందీప్‌ శర్మ అందరు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భువీ ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో పరుగుల్ని కట్టడి చేసి ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశిస్తోంది.

మన్కడింగ్ రనౌట్‌తో తొలి మ్యాచ్‌లో ఓటమి

ఇక, రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే... ఈ సీజన్‌లో ఆ జట్టు ఓపెనర్ జోస్‌ బట్లర్‌ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. జైపూర్ వేదికగా పంజాబ్‌తో ఆడిన రాజస్థాన్ రాయల్స్ బట్లర్ ‘మన్కడింగ్' రనౌట్ కారణంగా ఒత్తిడికి గురై బోల్తా కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

ఏడాది విరామం తర్వాత బరిలోకి స్మిత్

ఛేదనలో జోస్ బట్లర్ (69) రాణించడంతో ఒకానొక దశలో రాజస్థాన్ విజయం సాధించేలా కనిపించింది. జోస్ బట్లర్ ఔట్ కావడంతో చివరకు రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగిన స్మిత్‌ వరల్డ్‌కప్‌కు ముందు ఈ మ్యాచ్‌లో తనను తాను పరీక్షించుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో స్మిత్ 16 బంతుల్లో 20 పరుగులు చేశాడు.

Story first published: Friday, March 29, 2019, 18:19 [IST]
Other articles published on Mar 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X